
తిరుమలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (ఫైల్)
Tirumala | ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎలా పనిచేస్తోంది?
మరింత అభివృద్ధి చేయాలన్న టీటీడీ అదనపు ఈఓ
తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( Artificial Intelligence AI ) ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ( Integrated Command Control Center) ఏర్పాటైంది. తిరుమల వైకుంఠం 1 క్యూలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రం పనితీరుపై టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలో అధికారులతో సమీక్షించారు.
మాట్లాడుతున్న టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్ఓ మురళీకృష్ణ
"ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై ప్రతివారం సమీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయండి" అని అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్యను కూడా ఈ కేంద్రం నుంచి అంచనా వేయడానికి ఉద్దేశించిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ బ్రహ్మోత్సవాల వేళ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అలిపిరి నుంచి తిరుమల వరకు రద్దీని అంచనా వేయడం తోపాటు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. యాత్రికుల రద్దీ, వారి ఇబ్బంది, వసతి, అన్నదానంలో సీసీ కెమెరాల ద్వారా గుర్తించడం, సరిదిద్దడం ప్రధాన లక్ష్యం. ఈ కేంద్రం కీలకంగా మారింది.
అదనపు ఈఓ సమీక్ష
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి సోమవారం సమీక్షించారు. టీటీడీ ఐటీ జీఎం ఫణికుమార్ నాయుడు, డిప్యూటీ ఈఓ లోకనాథం, వీజీఓలు రామ్ కుమార్, రేంద్ర, DGM (IT) వెంకటేశ్వర నాయుడు గారు, కార్య ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు జయప్రసాద్, శ్రీ రవి, అధికారులతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మరింత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
"దర్శన క్యూల నిర్వహణ మరింత పటిష్టం చేయాలి. దీనికోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, లోపల, బయట క్యూలోని సీసీ కెమెరాలు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయండి" అని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఆదేశించారు.
ఆయన ఇంకా ఏమని సూచించారంటే..
"విజిలెన్స్, వైకుంఠం, ఆలయ సిబ్బంది క్యూలో భక్తుల రద్దీపై విశ్లేషించాలి. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఐటీ విభాగానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించండి" అని అధికారులను అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఆదేశించారు.
సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేయండి
తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో యూఎస్ఏ (USA)లోని కార్య ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న సాప్ట్ వేర్ (Software )ను రివ్యూ చేయాలని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి సూచించారు. ప్రస్తుతం ఉన్న అవసరాల మేరకు మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనికోసం ఆ సంస్థకు కావాల్సిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు వైకుంఠం, విజిలెన్స్ సిబ్బంది అందించాలని ఆదేశించారు.
Next Story

