తిరుమల : ఆ.. విగ్రహాలు ఎక్కడే ఎందుకు ఉన్నాయో తెలుసా?
x

తిరుమల : ఆ.. విగ్రహాలు ఎక్కడే ఎందుకు ఉన్నాయో తెలుసా?

అణువణువు చరిత్రను నిక్షిప్తం చేసుకున్నదే తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం. అందులో ఇద్దరు దేవతావిగ్రహాల కథ ఏమిటో తెలుసుకుందామా?!


తిరుమల ఓ ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు. విజ్ఞానగని కూడా. గత చరిత్రకు ఆనవాళ్లు. తెలుగు, తమిళం, కన్నడంలో ఇక్కడి శాసనాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడి ప్రతి అణువు ఓ చరిత్ర చెబుతుంది.


తిరుమల మహద్వారం వద్దకు వెళ్లగానే కాస్త సూక్ష్మంగా పరిశీలిస్తే గడపపై కుడి ఎడమవైపు రెండు చిన్నపాటి విగ్రహాలు ఉంటాయి. చాలామంది వీటిని గమనించరు. మహా ద్వారం వద్దకు వెళ్లగానే నీటిలో పాదాలను ప్రక్షాళన చేసుకునే సమయంలో గిలిగింతలకు లోనవుతారు. ఎదురుగా బలిపీఠం ( ధ్వజస్తంభం) కనిపించగానే ఈ యాదృచ్ఛికంగా నోటి నుంచి వచ్చే గోవింద నామస్మరణలతో పులకిస్తారు. అంతేకానీ, మహద్వారం పక్కన ఉన్న రెండు విగ్రహాలు ఆలయంలోకి ప్రవేశించేముందు కుడివైపు గోడకు వేలాడుతున్న దాదాపు ఆరడుగుల ఇనుప చువ్వను గమనించరు.. ఎందుకంటే ధ్యాస అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని తలంపుతో ఉంటారు. విషయంలోకి వస్తే...

ఆ విగ్రహాలు అక్కడే ఎందుకు?

తిరుమలలో మహాద్వారం వద్దకు వెళ్ళగానే భారీ తలుపులు తెరిచి ఉంటాయి. అక్కడి గడపకు ఇరువైపుల రెండు చిన్నపాటి విగ్రహాలు ఉంటాయి. ఓ విగ్రహం చేతిలో రెండు శంఖాలు ఉంటే, మరో విగ్రహం చేతిలో రెండు పద్మాలు ఉంటాయి. వారిని తిరుమలలో శంఖనిది, పద్మ నిధి విగ్రహాలు. ఆలయంలోకి ప్రవేశించే ముందు కాస్త సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ విగ్రహాలను గమనించవచ్చు. ఆ విగ్రహాలు అక్కడే ఎందుకు ఉన్నాయి అనే సందేహం కూడా రాక మానదు. అందుకు కూడా ప్రధాన కారణం ఉందనేది పండితుల మాట. చరిత్ర చెప్పిన సత్యం.
కాపలా.. ఎందుకు

శ్రీవారి ఆలయ మహాద్వారానికి ముందు శంఖనిధి, పద్మనిధి అటు ఇటు కూర్చుని కాపలాగా ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపద, నవనిధులను ఈ దేవతలు రక్షిస్తుంటారని పురాణ కథనం. మహద్వారానికి కుడివైపున అంటే దక్షిణ దిక్కుగా ఉన్న రక్షక దేవత శంఖనిది. కుడి పక్కన అంటే ఉత్తరం వైపు ఉన్న దేవత పేరు పద్మ నిధి. శంఖ నిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించి ఉంటే, పద్మ నిధి రెండు చేతుల్లో రెండు పద్మాలను పట్టుకుని ఉంటారు.
తిరుమల ఆలయానికి మహా ద్వారం ముందే వారిద్దరు అక్కడే ఎందుకు ఉన్నారు. అంటే తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారానికి ఇరుపక్కల ద్వార పాలకుల మాదిరి సుమారు రెండు అడుగుల ఎత్తు పంచారు లోహ విగ్రహం ఉంటాయి. మనం శ్రీవారిని దర్శించుకోవడానికి ఆలయంలోకి ప్రవేశించడానికి ముందు మన కాళ్ళను ప్రక్షాళన చేసుకునే గడపకు ఇరువైపులా వారిద్దరు కనిపిస్తారు. ఆరు అంగుళాల పరిమాణం గల రాజ్యవిగ్రహం నమస్కార భంగిమలో నిలుచుని ఉండడం అక్కడ గమనించవచ్చు. ఈ విగ్రహాలను విజయనగర రాజైన అచ్యుత దేవరాయలు కాలంలో ప్రతిష్టించినట్లు చెబుతారు. ఆయనే ఈ విగ్రహాలను ప్రతిష్టించి ఉండవచ్చునేది ఓ కథనం.
రాజుల కాలంలో నిధులు నిక్షేపాలను నేలమాళిగలో దాచేవారని, గుహల్లో నిక్షిప్తం చేసేవారని కథలు చదువుకున్నాం..ఆ క్రమంలోనే తిరుమలలో మహాద్వారం వద్ద కాపలా కోసం ఈ విగ్రహాలను ప్రతిష్టించినట్లు చెబుతారు. ఇలాంటి ఆసక్తికర కథనాలు చెప్పే అంశాలు ఎన్నో తిరుమలలో మనకు కనిపిస్తాయి.
Read More
Next Story