ముగ్గురు స్నేహితులు ఎందుకు దొంగలయ్యారు.. ఆలయాలకు ఎందుకు కన్నం వేశారు..
x

ముగ్గురు స్నేహితులు ఎందుకు దొంగలయ్యారు.. ఆలయాలకు ఎందుకు కన్నం వేశారు..

అనంతపురంలో 22 లక్షల ఆభరణాల స్వాధీనం.


పేకాట, మద్యం వంటి వ్యసనాలకు అలవాటుపడిన ముగ్గురు దొంగతనాలు చేయడం ప్రారంభించారు. చేసిన అప్పులు తీర్చడానికి ఆలయాలకు కన్నం వేసి, వెండి ఆభరణాలు చోరీ చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఆ ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 22 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాల తో తయారు చేసిన అమ్మవారి శిరస్సులు, ఇతర అలంకరణ వస్తువులను భారీగా స్వాధీనం చేసుకున్నారు.


అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ పి. జగదీష్ ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు.

"ఏపీ తోపాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఆ ముగ్గురు దొంగలు 20 ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు" అని ఎస్పీ జగదీష్ చెప్పారు.
ఆలయాల టార్గెట్
తాళం వేసి ఉన్న ఇళ్లు, ఆలయాలను టార్గెట్ చేసిన ముగ్గురు దొంగలు రెండు రాష్ట్రాల్లో అనేక చోట్ల చోరీలకు పాల్పడ్డారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు.
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం మా కొడుకు గ్రామానికి చెందిన వి.మర్రిస్వామి అలియాస్ సంగీత (45), అదే గ్రామానికి చెందిన వి రాజు (37),, శెట్టూరు మండలానికి చెందిన ముచ్చర్ల శ్రీనివాసులు (49) మధ్య స్నేహితం ఉందని, మద్యం పేకాట వంటి వ్యసనాలకు బానిసైన వారు చేసిన అప్పులు తీర్చడానికి చోరీలు మార్గంగా ఎంచుకున్నట్లు ఎస్పీ వివరించారు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లాకు పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కూడా చోరీలకు పాల్పడిన విషయం కూడా వెలుగులోెకి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
22 లక్షల ఆభరణాలు స్వాధీనం

చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర దొంగల నుంచి 22 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ జగదీష్ వివరించారు. అందులో 12.350 కిలోల వెండి, 44 గ్రాముల బంగారు ఆభరణాలు, 20 కిలోల ఇత్తడి గంటలు, ఐదు కిలోల రాగి బిందె నిందితులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి జగదీష్ వివరించారు. ఓ చోరీ కేసులో పట్టుబడిన నిందితులకు రెండు రాష్ట్రాల్లోని అనేక సంఘటనలతో సంబంధం ఉన్నట్లు. కళ్యాణదుర్గం రూరల్, అర్బన్ పోలీసులు చేసిన దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ వివరించారు
వ్యసనాలతోనే దొంగలయ్యారు...
వ్యసనాలకు అలవాటు పడిన ఆ ముగ్గురు చోరీలు చేయడం లక్ష్యంగా మార్చుకున్నారని ఎస్పీ వివరించారు. అప్పులు తీర్చడానికి దొంగతనా లను చేసినట్లు దర్యాప్తులో తేలిందని కూడా ఆయన చెప్పారు. ఊరికి దూరంగా ఉన్న ఇళ్లలో చోరీలు చేసి డబ్బులు సంపాదించే ఆలోచనతో వరుస చోరీలకు పాల్పడినట్లు ఆయన చెప్పారు. జనసంచారానికి దూరంగా ఉన్న ఆలయాలను కూడా టార్గెట్ చేసిన విషయం దర్యాప్తులో వెల్లడైందని ఆయన వివరించారు.
దర్యాప్తు ఇలా..
కళ్యాణదుర్గంలో అనేక ఆలయాల్లో చోరీలు జరిగాయి. ఇళ్లలో కూడా జరిగిన చోరీలతో వారికి ప్రమేయం ఉందని ఎస్పీ వివరించారు. ఆలయాలతో పాటు తాళం వేసి ఉన్న ఇళ్లలో కూడా చోరీలకు పాల్పడిన నేపథ్యంలో నమోదైన కేసులతో డిఎస్పి రవిబాబు సారధ్యంలో ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారని ఎస్పీ వివరించారు. కళ్యాణదుర్గం అర్బన్ సీఐ నీలకంటేశ్వర, రూరల్ సీఐ వంశీకృష్ణ సారధ్యంలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయన్నారు. కొర్లపల్లి క్రాస్ వద్ద నిందితుల ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి ఆభరణాలు రికవరీ చేసినట్లు ఎస్పీ జగదీష్ మీడియాకు వివరించారు.
Read More
Next Story