
TUDA | ఆ టవర్స్ తిరుపతికి తలమానికం కావాలి
భూ అభివృద్ధి, విక్రయాలతో ఆదాయం పెంచాలని మంత్రి నారాయణ దిశా నిర్దేశం చేశారు. ఆయన ఏమి సూచనలు చేశారంటే...
తిరుపతిలో 3.61ఎకరాల్లో జీ+ 13 అంతస్తుల్లో నిర్మిస్తున్న తుడా టవర్స్ పనులు వేగవంతం చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. తిరుపతి నగరానికి తలమానికంగా ఉండేలా టవర్స్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. టెంపుల్ సిటీ తిరుపతి లో పరిశుభ్రత, సుందరీకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఆయన అధికారులను సూచించారు. అనంతరం తుడా టవర్స్ బ్రోచర్ ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు.
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తొడా) అధికారులతో మంత్రి నారాయణ విజయవాడ సీఆర్డీయే కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఈ కార్యక్రమానికి పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ సంపత్ కుమార్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, తుడా వైస్ చైర్మన్ మౌర్య, పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యుల్లత తో పాటు తుడా అధికారులు హాజరయ్యారు. "తుడా" రెవిన్యూ, ఖర్చుల వివరాలపై మంత్రి సమీక్షించారు. రెవెన్యూ పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. తొడా పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు.
భూములు అభివృద్ధి చేయండి
"తుడా" ( Tirupati Urban Development Authority) పరిధిలో భూములను అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయం పెంపుదలక చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు. అవసరమైతే పీపీపీ విధానంలో భూములను అభివృద్ధి చేసి అమ్మకాలు చేయడం ద్వారా ఆదాయం పెంచాలన్నారు. దీనిద్వారా అధారిటీ పై భారం తగ్గుతుందన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో లే అవుట్ లలో హౌసింగ్ ప్రాజెక్టుల ను చేపట్టాలని కూడా ఆయన సూచించారు. "తుడా"పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామపంచాయతీ ల్లో కనీస వసతుల కల్పన కు అవసరమైన నిధులను తుడా నుంచి విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు.
Next Story