JC BROTHERS TADIPATRI | ఇది జేసీ సామ్రాజ్యం..  చెప్పిందే శాసనం.!
x

JC BROTHERS TADIPATRI | ఇది జేసీ సామ్రాజ్యం.. చెప్పిందే శాసనం.!

కొత్త సంవత్సరానికి తాడిపత్రిలో ఆంక్షలు విధించారు. జేసీ ప్రభాకరరెడ్డి కొత్త రూల్ పెట్టారు. డబ్బు ఎక్కువుంటే అభివృద్దికి ఇవ్వండని ఆదేశించారు.


ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఆయన అలవాటు. తన మాటలు, చేతలతో నిత్యం వార్తల్లో ఉంటారు. మద్యం విధానంలో వివాదం రేకెత్తించిన జేసీ ప్రభాకరరెడ్డి మళ్లీ ఆంక్షల కొరడా పట్టి, తన విలక్షణాన్ని చాటుకున్నారు.

తాజాగా కొత్త సంవత్సరం 2025ను స్వాగతిస్తూ, ఫ్లెక్సీలు పెడితే తొలగిస్తాం. అని హెచ్చరించారు. మీకు అంతగా డబ్బు ఎక్కువ ఉంటే, పట్టణ అభివృద్ధికి ఇవ్వండి అని ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలను స్వపక్షీయులే జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు. ఇది మరో పక్క టీడీపీకి కూడా ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆ ప్రాంత వాసుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం మంచిదే అయినా, జేసీ ప్రభాకరరెడ్డి తీరు "ఎవరి మాటా వినడు" ఈ సీతయ్య అన్నట్లే సాగుతోంది.
వాస్తవానికి పట్టణంలో అనుచరులతో కలిసి జేసీ ప్రభాకరరెడ్డి వీధుల్లో తిరగడం అనేది ఓ సరదా. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి, సమస్యలు అడుగుతారు. చెత్త వీధుల్లో వేయెద్దని కోరతారు. మంచినీరు వృధా చేయొద్దని సూచిస్తాదు. ఆయన వాడే భాషా ఆ ప్రాంతానికి సరిపోతుంది. గట్టిగా మందలించినా, నవ్వులు పూయిస్తుంది. చలోక్తలు విసరడంలో కూాడా ఆయన దిట్టే. అయితే, సమస్యలు వినడమే కాదు. వాటిని తీర్చడానికి కూడా ఆయన రంగంలోకి దిగుతారు. కాలువల్లో పూడిక కనిపిస్తే, మాత్రం సహించరు. వెంటనే సిబ్బంది, అధికారులను పిలిపించి, శుభ్రం చేయించిన సంఘటనలు అనేకం. అయితే, ఆయన ముక్కుసూటితనం, మాటల్లో కొన్నిసార్లు కరుకుదనం, వంటి వ్యవహారంతో...

అనంతపురం జిల్లాలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఆయన ఓ కొరుకుడు పడని కొయ్యలా మారారు. తాడిపత్రి అభివృద్ధికి నిధుల వసూళ్లు టీడీపీకి కొత్త కష్టాలు తెచ్చేలా ఉంది. ఎవరేం అనుకుంటే నా పద్ధతి ఇంతే అన్నట్లు మున్సిపల్ చైర్మన్ జేసీ. ప్రభాకరరెడ్డి సాగుతున్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే నూతన మద్యం విధానం అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, సాధారణంగా పరస్పర శుభాకాంక్షలు చెప్పుకోవడం సహజం. తమ నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం ద్వారా అభిమానం చాటుకుంటూ ఉంటారు. ఈసారి అది కుదరదు అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి తెగేసి చెబుతున్నారు.
"తాడిపత్రి పట్టణంలో ఫ్లెక్సీలు కడితే తొలగిస్తాం." అని జేసీ ప్రభాకరరెడ్డి తీవ్రంగానే హెచ్చరించారు. "విగ్రహాల వద్ద కూడా ఎలాంటి పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుకు అనుమతించేది లేదు" అని కూడా ఆయన తెగేసి చెప్పారు. మీకు అంత డబ్బు ఎక్కువ ఉంటే, ఆ సొమ్ము పట్టణాభివృద్ధికి విరాళంగా ఇవ్వండి అని జేసీ ప్రభాకరరెడ్డి సూచించారు.
విపక్ష పార్టీ నేతలే కాదు. చివరాఖరికి అధికార టీడీపీ కూటమి మద్దతుదారులను కూడా ఆయన ఇరకాటంలో పడేశారని భావిస్తున్నారు. "ఎవరేమి అనుకుంటే నాకేం. నా మాటే చెల్లుబాటు కావాలి" అనేది జేసీ పట్టుదల. ఈ విషయంపై గతంలో కూడా తాడిపత్రిలో చర్చకే కాదు. రాజకీయంగా కూడా దెబ్బతగిలిందనేది పరిశీలకుల అభిప్రాయం. దీనిని మంత్రి నారా లోకేష్ కూడా ఉదహరించారు.
2024 సార్వత్రిక ఎన్నికల వేళ యువగళం పేరిట నారా లోకేష్ పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయన పాదయాత్ర తాడిపత్రికి చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ,

"తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకారన్న ఏమి తప్పు చేశాడబ్బా. ఉగాది వీధుల్లో చెత్త వేయొదన్నాడు. అప్పుడు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పట్టణాభివృద్ధికి నిధులు ఇవ్వాలని నన్ను కోరారని గుర్తు చేసుకున్నారు. తరువాత చూస్తాలే అంటే వినలేదు. తప్పించు కుందామని, వేరే మీటింగ్ కు వెళ్లి, మూడు గంటల తరువాత తిరిగి వస్తే, అప్పటికీ నిరీక్షిస్తూనే ఉన్నాడు" అని 2104లో అనుభవాన్ని గుర్తు చేసుకున్న లోకేష్ నిధుల మంజూరుపై సీఎం చంద్రబాబుతో మాట్లాడి, చేస్తాలే. అని చెప్పినా జేసీ అన్న వినలేదు. తప్పదన్నట్లు సంతకం చేస్తే, 200 కోట్లు మంజూరు చేయించుకున్నారు" అని ఆనాటి రోజులను ప్రజల ముందు ఉంచారు. ఆ నిధులతో పనులు చేపడుతూ, "పట్టణంలో చెత్తవేసే సహించను" అని ఉగాది రోజు చేతిలో కర్రపట్టుకున్న ఫ్లెక్సీ ఏర్పాటు చేయించుకున్నాడు. దీనిని తప్పుగా అర్థం చేసుకున్న మీరు (ఓటర్లు) జేసీ ప్రభాకరన్న కొడుకు జేసీ పవన్ ను ఓడించారు కదబ్బా" అని నారా లోకేష్ వివరించడం గమనార్హం. అంటే..
మళ్లీ కట్టె పట్టకుండా జేసీ ప్రభాకరరెడ్డి ఫ్లెక్సీ లేని ఆంక్షలు విధిస్తున్నారనే విషయంపై సరదాగా చర్చించుకుంటున్నారు. తండ్రికి ఏమాత్రం తీసిపోని విధంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంలో ఏమాత్రం రాజీపడకుండా వ్యవహరించిన తీరు వల్ల రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ సమయంలో తనను ఎదిరించిన ఎస్ఐకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ముందే జోరు వానలో ధర్నాకు దిగడం గమనార్హం. ఇలా తండ్రి జేసీ. ప్రభాకరరెడ్డికి ఏమాత్రం తీసిపోనని సహజ మాటల తీరుతో, కొడుకు అస్మిత్ రెడ్డి కూడా అదేబాట పట్టారు. వీరిద్దరి వ్యవహారం అనంతపురం జిల్లాలోనే కాదు. తరచూ వార్తల్లో వ్యక్తులుగా మారుతున్నారు. తాజాగా జేసీ ప్రభాకరరెడ్డి ఆంక్షలు ఎలాంటి ఫలితం చూపుతుందనేది వేచిచూడాలి.
Read More
Next Story