
దేవలోకంగా మారిన తిరుమల.. వైభవంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం
తిరుమలలో ఏటా మూడుసార్లు నిర్వహణ.
కలియుగ వైకుంఠం తిరుమల దేవలోకాన్ని ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో శ్రీవారి ఆలయం మరింత కళకళలాడుతోంంది. రెండో రోజు వైకుంఠ ద్వాదశి కావడంతో బుధవారం శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్వార్లకు చక్రస్నానం నిర్వహించారు. ఈ కాక్రమం సంవత్సరంలో మూడుసార్లు నిర్వహించడం ఆనవాయితీ.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నిరాంటంగా సాగుతున్నాయి. వైకుంఠంలోకి ప్రవేశించామని యాత్రికుల అనుభూతికి లోనయ్యేూ విధంగా శ్రీవారి ఆలయంపై విష్ణుమూర్తి పవళింపు సవలో ఉన్న ప్రతిమను ఏర్పాటు చేయడం మరింత శోభ తెచ్చింది. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు దివ్యలోకాన్ని తలపించేలా టీటీడీ ఉద్యానవన శాఖ సిబ్బంది అలాంటి వాతావరణం సృష్టించారు.
వైభవంగా చక్రస్నానం..
తిరుమలలో వైకుంఠ ద్వాదశి నేపథ్యంలో బుధవారం వేకువజామున సూర్యోదయానికి ముందే చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. చక్రతాళ్వార్ విగ్రహాలను ఒకఅర తో కూడిన పెట్టలో ఉంచి ఆలయ మాడవీధుల నుంచి ఊరేగింపుగా శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకుని వచ్చారు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పల్లకీ మోశారు. ఊరేగింపులో టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, టీటీడీ సీవీఎస్ఓ కేవి. మురళీకృష్ణ ఉత్సవంలో పాల్గొన్నారు.
తిరుమలలో ఏటా మూడుసార్లు చక్రతాళ్లార్ కు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం క్రతువు నిర్వహిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపునకు సూచకంగా చక్రస్నానం ఘట్టం జరుగుతుంది. రథసప్తమి ( సూర్యజయంతి) సందర్బంగా ఒకో రోజు సప్తవాహనాలపై ఉభయ దేవేరులతో మలయప్పస్వామి వీధుల్లో విహరిస్తారు. దీనిని అర్ధబ్రహ్మోత్సవంగా పరిగణిస్తారు. ఆ రోజు కూడా చక్రతాళ్వార్ ఊరేగింపు పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీ. మూడోసారి వైకుంఠ ద్వాదశి రోజు వేకువజామున సూర్యోదయానికి ముందే బుధవారం తిరుమల శ్రీవారి పుష్కరిణిలో వరాహస్వామి ఆలయం సమీపంలో నిర్వహించారు.
ద్వాదశి చక్రస్నానం ఎందుకంటే..
వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని శ్రీవారి పుష్కరిణిలో బుధవారం తెల్లవారుజామున " శ్రీసుదర్శన చక్రతాళ్వార్"కు చక్రస్నానం నిర్వహించారు. తెల్లవారుజామూను ఐదు నుంచి ఆరు గంటల మధ్య టీటీడీ వేదపండితులు ఈ కార్యక్రమం నిర్వహించారు.
తిరుమలలోని వరాహస్వామి ఆలయం సమీపంలోకి చక్రతాళ్వార్లను ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అక్కడ అభిషేకాది పూజల అనంతరం, వేదపండితులు, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, అధికారులు పుణ్యస్నానాలు ఆచరించారు. చక్రస్నానం జరిగే సమయంలోనే శ్రీవారి పుష్కరిణిలో యాత్రికులు కూడా పుణ్యస్నానాలు ఆచరించారు.
తిరుమలలో ముక్కోటి ద్వాదశిని వైకుంఠ ద్వాదశి కూడా పిలుస్తారు. ధనుర్మాసంలో 12 వ రోజు ఈ కార్యక్రమం జరిగే విధంగా ఆగమశాస్త్రం ప్రకారం ఏకాదశి, ద్వాదశి శుభముహూర్తలు ఖరారు చేస్తారు. తిరుమలలో ఈ పవిత్రమైన రోజున సూర్యోదయానికి ముందు పవిత్రమైన స్వామి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు.
పురాణాల ప్రకారం, పవిత్ర ధనుర్మాస శుక్ల పక్ష ద్వాదశి రోజున అంటే వైకుంఠ ద్వాదశి నాడు, దేశవ్యాప్తంగా ఉన్న మూడు కోట్ల (ముక్కోటి) పవిత్ర నదులు, నదులు సంగమిస్తాయని భావిస్తారు. అందులో పవిత్ర జల ప్రవాహాలు, గంగా, కావేరి, యమున మొదలైన నదులు, ఈ గొప్ప సందర్భంలో స్వామి పుష్కరిణిలో సంగమిస్తాయనేది నమ్మకం. ఈ పవిత్ర సమయంలో స్వామి పుష్కరిణి పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల మూడు కోట్ల పవిత్ర తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుందనేది యాత్రికుల మనోభిప్రాయం.
Next Story

