తిరుపతిలో ఈ మెయిల్ సృష్టించిన కలకలం
x

తిరుపతిలో ఈ మెయిల్ సృష్టించిన కలకలం

అప్రమత్తమైన పోలీసులు. శ్రీకాళహస్తిలో కూడా తనిఖీలు. ఇంతకీ ఏమి జరిగింది?


"తిరుపతిని పేల్చేస్తాం. ఈ మెయిల్ హెచ్చరిక" తో పోలీసులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం తిరుపతి తోపాటు శ్రీకాళహస్తి ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు, యాత్రికులతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ టిటిడి యాత్రికుల వస్తే గృహాల సముదాయాల్లో శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

"ప్రజలు భయపడొద్దు., వదంతులు నమ్మవద్దు. పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు భరోసా ఇచ్చారు. ఆయన ఇంకా ఏమి చెప్పారంటే..
"ఈ మెయిల్ బెదిరింపులపై కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారనే సమాచారం వైరల్ అయింది.
విషయం ఏమిటంటే..
"తమిళనాడు సీఎం స్టాలిన్, సినీ కథానాయకి త్రిష నివాసాలు పేల్చివేస్తాం" అని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపించిన నేపథ్యంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో స్లీపర్ షెల్సుగా పని చేస్తున్న తమిళనాడు ప్రాంతానికి చెందిన ఉగ్రవాదులను ఈ ఏడాది జూలై నెలలో అరెస్టు చేసిన విషయం తెలిసినదే. వారిని తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏపీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని..
తిరుపతిలో అప్రమత్తం
తిరుపతి పోలీసులు కూడా ముందు జాగ్రత్త చర్యగా యాత్రికులతో రద్దీగా ఉండే అనేక ప్రదేశాలను క్షుణ్ణంగా బాంబు, డాగ్ స్క్వాడ్ నగరంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో యాత్రికులు కూడా ఆందోళనకు గురయ్యారు. తిరుపతి నగరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి.
తిరుపతి నగరంలో ప్రధాన హోటళ్లను పేల్చివేస్తామంటూ కొన్ని నెలల కిందట కూడా ఇదే తరహాలో ఈ మెయిల్స్ అందాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అన్ని హోటలలో బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్, డాగ్స్ కోడతో తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత ఇవన్నీ ఒత్తుత్తి బెదిరింపులే అని తేల్చేశాయి. మెయిల్స్ పంపించిన వారిని కూడా గతంలో గుర్తించినట్లు సమాచారం. ఆ వివరాలు మాత్రం వెల్లడికాలేదు.
తాజా హెచ్చరిక
తమిళనాడులో తాజాగా అందిన హెచ్చరికల నేపథ్యంలోనే తిరుపతి పోలీసులు కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని పోలీసు అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. యాత్రికులకు భద్రత కల్పించే దిశగానే ముందస్తుగా తనిఖీలు నిర్వహించామని పోలీసు అధికార వర్గాలు చెప్పాయి.
షెల్టర్ జోన్
తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న అల్ ఉమా ఉగ్రవాదులు రాయలసీమ ప్రాంతాన్ని షెల్టర్ జోన్గా వాడుకుంటున్నారనే విషయం 2013 వెల్లడైంది. చిత్తూరు జిల్లా పుత్తూరులో తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ చేసుకోవడం దాడి చేసి , ఇస్లామిక్ లిబరేషన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు ఇస్మాయిల్ అలియాస్ మున్నా, అల్ ఉమా ఉగ్రవాద సంస్థకు చెందిన బిలాల్ మాలిక్, తిరుమలేవే ప్రాంతం మేల్ పాయల యూనికి చెందిన ఇస్మాయిల్ ను అరెస్టు చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత
2025 జూలై జూలై నెలలో అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలో అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ అనే ఇద్దరు తీవ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాంత సాధారణ జనంతో కలిసిపోయిన వారిద్దరూ ఇక్కడే వివాహాలు చేసుకుని వ్యాపారుల ముసుగులో కొనసాగుతున్న విషయం పసిగట్టిన తమిళనాడు ఏటీఎస్ పోలీసులు రహస్యంగా విచారణ చేసిన అనంతరం పట్టుకున్న విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో.. తాజాగా తమిళనాడులో ఈ మెయిల్స్ హెచ్చరిక నేపథ్యంలో ఆ రాష్ట్రం తో పాటు పొరుగునే ఉన్న తిరుపతి నగరం అలాగే పరిసర ప్రాంతాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడానికి దారి తీసినట్లు భావిస్తున్నారు.
ఆందోళన వద్దు
తిరుపతిని పేల్చివేస్తామనే ఈ-మెయిల్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పందించారు. అధికారులను అప్రమత్తం చేశారు. తిరుపతి తోపాటు శ్రీకాళహస్తి ఆధ్యాత్మిక క్షేత్రంలో తనిఖీలు చేయించారు.
"జిల్లాలో మా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు" అని ఎస్పీ సుబ్బారాయుడు ఓ సందేశం ద్వారా భరోసా ఇచ్చారు.
పోలీసు శాఖ పీఆర్ఓ కూడా ధృవీకరించారు. తనిఖీల ఫోటోలు షేర్ చేయడం సాధ్యం కాదని ఆయన 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి స్పష్టం చేశారు.
"ఈ మెయిల్ బెదిరింపు విషయం తెలియగానే మా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశాం" అని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. కేవలం తిరుపతిలోనే కాకుండా, తిరుమల మరియు శ్రీకాళహస్తి వంటి ఇతర ప్రధాన పుణ్యక్షేత్రాల్లోనూ బాంబ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేయించాం. అని చెప్పారు.
"పలు రాష్ట్రాల్లో ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. అదే తరహాలో తిరుపతి జిల్లాకు కూడా బెదిరింపు వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోనుకావద్దు. అనవసరమైన అపోహలను, ఊహాగానాలను నమ్మవద్దు," అని ఎస్పీ సుబ్బారాయుడు ప్రకటన వైరల్ అయింది. పోలీసులు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆయన వివరించారు.
Read More
Next Story