PAWAN KALYAN | సినిమా టైటిల్ గా సీజ్ ది షిప్
x

PAWAN KALYAN | సినిమా టైటిల్ గా 'సీజ్ ది షిప్'

పవన్ కల్యాణ్ డైలాగ్ ట్రెండ్ సెట్ చేసింది. ఆ పదంతో సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ చేశారు.


డిప్యూటీ సీఎం బాధ్యతలు కాకముందు కొణిదెల పవన్ కల్యాణ్ సినిమా కథానాయకుడు. తాను హీరోగా నటించిన గబ్బర్ సింగ్ (GABBAR SING) సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఓ డైలాగ్ నిజం చేశారు.

"నేను ఏ ట్రెండ్ ఫాలో కాను. నేనే ఓ ట్రెండ్ సెట్ చేస్తా" ( Pawan Kalyan set the trend) అనేది డైలాగ్. ఆ సినిమాలో ఆయన కోసం రచయితలు కథను ఇతివృత్తంగా తీసుకొని మాటలు రాసి ఉండొచ్చు..
ఈ సీన్ కట్ చేస్తే..
కాకినాడ పోర్టు వద్ద బియ్యం రవాణాకు సిద్ధంగా ఉన్న ఓడను రాష్ట్ర పౌరసరఫలాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తోకలిసి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తనిఖీ చేశారు. అక్కడ ఆయన బోటులో ప్రయాణం. బియ్యం బస్తాల తనిఖీ మొత్తం ఎపిసోడ్ సినిమానే తలపించింది. అన్ని పరిశీలించిన తరువాత ఒడ్డుకు రాగానే సినిమా స్టైల్లో అక్కడ అధికారులతో పవన్ కళ్యాణ్ నవ్వూతూ సంభాషించారు.

ఏమి జరుగుతుందో అని పోర్టు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఓ పక్క బిక్కుబిక్కుంటూనే పవన్ కల్యాణ్ ఏమి చెబుతారాని వింటున్నారు. నవ్వుతూనే "సీజ్ ద షిప్" (seize the ship) అని పవన్ కల్యాణ్ ఆదేశించారు. దీంతో అధికారులు నివ్వెరపోయారు. పవన్ కల్యాణ్ వాడిన ఆ డైలాగ్ మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పదంతోనే సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ మాటలు ఊతమిచ్చాయి. దీని ద్వారా తాను ట్రెండ్ సెట్టర్ను అనే మాటను సార్ధకం చేసుకున్నట్లే కనిపిస్తోంది.
తెలుగు చలనచిత్ర రంగంలో కొణిదెల చిరంజీవి కథానాయకుడిగా ఓ చరిత్ర సృష్టించారు. ఆయన చెంత, సాహిత్యంలో పెరిగిన చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు. రాజకీయాల్లో కూడా ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
టీడీపీ కూటమిలోనే కాదు. ఎన్డీఏ భాగస్వామ్యపక్షంలో అత్యంత కావలసిన వ్యక్తిగా ఎదిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నారు.
కాకినాడ ఓడరేవు నుంచి బియ్యం అక్రమంగా రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న షిప్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
"సీజ్ ది షిప్" అనే మాట రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలో ఈ పదం బాగా వైరల్ అయింది. ఈ పదంతో టాలీవుడ్ కి చెందిన నిర్మాణ సంస్థ ఆర్. ఫిలిం ఫ్యాక్టరీ "సీజ్ ద షిప్" అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏడాది పాటు ఈ టైటిల్ హక్కులు వర్తిస్తాయని చెబుతున్నారు. కాంట్రవర్సీ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ చిత్రనిర్మాణ సంస్థ ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా,

సామాజంలో జరిగిన అనేక వాస్తవ సంఘటనల ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇటీవలి కాలంలో ఈ తరహా నిర్మాణాలు చాలా వరకు లేవనే చెప్పవచ్చు. సుదీర్ఘ విరామం తరువాత పవన్ కల్యాణ్ మండించిన మాటలు ఓ సినిమా తీయడానికి పురిగొల్పాయనే విషయం స్పష్టమైంది.
కాకినాడు పోర్టులో బియ్యం లోడుతో ఉన్న ఓడ స్వాధీనం చేసుకోవడం వెనుక చాలా మంది పెద్దలు ఉన్నారనే విషయంపై వార్తలు వస్తున్నాయి. అందులో ఆంధ్రతో పాటు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా చౌకబియ్యం వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, సినీ పరిశ్రమలోని కొందరికి ఉన్న మిల్లుల నుంచి కూడా బియ్యం పాలిష్ చేసి, కాకినాడు పోర్టుకు తరలిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. వైసీపీలో కూడా బియ్యం సరఫరాదారులు ఉన్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ వ్యవహారంలో ఎవరిపాత్ర ఏమిటనేది దర్యాప్తులో మాత్రమే తేలాలి. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చిన తరువాత కథ సిద్ధం చేస్తారా? సినిమా ఎవరు తీయబోతున్నారు? అనేది స్పష్టం అవుతుంది. ఆ కథ ఇతివృత్తం ఎలా ఉండబోతుందనేది వేచిచూడాలి.
Read More
Next Story