TIRUMALA DAMS | ఎండాకాలానికి నీళ్ల కష్టాలు తప్పినాయి సామీ
ఫెంగన్ తుపాను పుణ్యమాని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. తిరుమలలో ఓ డ్యాం క్రస్టుగేట్లు తెరిచారు. యాత్రికులు వెళ్లకుండా కొన్ని ప్రదేశాలను మూసివేశారు.
ఫేంగల్ తుపాను పుణ్యమా అని రానున్న వేసవికి నీటి ఎద్దడి బాధ తప్పింది. చిత్తూరు జిల్లాలోని ప్రాజెక్టులు నీటితో కళకళ లాడుతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తడిసిముద్దవుతున్నారు. తిరుమలలో యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. కాగా, తిరుమల గిరుల్లోని నాలుగు ప్రధాన డ్యాముల్లోకి సమృద్ధిగా నీరు చేరింది. వేసవికి ఇబ్బంది లేకుండా పోయిందని టీటీడీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జాలపాతాలు హెరెత్తుతున్నాయి. అందులో కపిలతీర్థం, మాల్వాడిగుండం, తలకోన జలపాతాలు ఉధృతంగా పారుతున్నాయి.
కొండకొనల నుంచి పారుతున్న సేలయేర్లతో తిరుమల గిరుల్లోని గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం, కుమారధార పసుపుధార ప్రాకెక్టులు కళకళలాడుతున్నాయి. ఈ జలాశాయాల నుంచి తిరుమలకు వచ్చే యాత్రికుల అవసరాలు తీరుస్తున్నారు. డ్యాములకు సమీపంలోనే ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుద్ధిచేసి, తాగునీటిగా కూడా వాడుతున్నారు.
వరదనీటి ప్రవాహం ఎక్కవగా ఉండడం వల్ల తిరుమలకు సమీపంలోని గోగర్భం జలాశాయంలోకి ఉధృతంగా వరదనీరు చేరుతోంది. దీంతో గోగర్భం జలాశయం నిండడం వల్ల ఇక్కడి క్రస్ట్ గేట్లు మూడు సెంటీమీటర్ల మేరకు ఎత్తివేశారు. తద్వారా అదనపు నీటిని దిగువప్రాంత జలాశయాల్లోకి వదులుతున్నారు.
శేషాచలం కొండల నుంచి వరదనీరు ఉధృతంగా దిగువకు ప్రవహిస్తోంది. దీంతో తిరుపతి నగరానికి ఆనుకుని ఉన్న కపిలతీర్ధం జలసోయగాన్ని సంతరించుకుంది. జలపాతం వద్ద సందడిగా మారింది. యాత్రికులు దూరం నుంచి ఫొటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జలపాతం వద్ద ఉన్న పుష్కరిణి వద్ద వర్షంలోనే హోమమహోత్సవాల ముగింపు పూజలు కూడా అర్చకులు ఆదివారం పూర్తి చేశారు.
తిరుమల గిరులతోపాటు తిరుపతి జిల్లా పరిధిలోని ఆరణియార్ సహా జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల వద్ద నీటి పారుదల శాఖాధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్ అధికారులు భద్రతా చర్యలను సమీక్షించారు. వరదనీరు వృధా కాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ప్రజలు ప్రమాదానికి గురికాకుండా, రక్షణ చర్యలు ఏర్పాటు చేశారు.
తిరుమల జలాశయాల్లో..
తిరుమల గిరుల్లోని ఐదు జలాశయాలు ఆదివారం రెండు గంటలకు పూర్తిస్థాయి నీటి మట్టం ఏర్పడింది. ఈ జలాశయాల్లో దాదాపు నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఆ మేరకు అధికారికంగా ప్రకటించారు. . ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 200 రోజుల తాగునీటి అవసరాలకు సరిపడ నీరు చేరింది.
1) పాపవినాశనం డ్యామ్ :- 694.25 మీటర్లు
ఎఫ్ఆర్ఎల్ (FULL RESRVOYER LEVEL-FRL) : 697.14 మీ.
నిల్వ సామర్థ్యం :- 5240.00 లక్షల గ్యాలన్లు
ప్రస్తుత నిల్వ :- 4345.00 లక్షల గ్యాలన్లు
2) గోగర్భం డ్యామ్ :- 2894.00 అడుగులు
ఎఫ్ఆర్ఎల్ (FULL RESRVOYER LEVEL-FRL) : 2894.00 అడుగులు
నిల్వ సామర్థ్యం :- 2833.00 లక్షల గ్యాలన్లు
ప్రస్తుత నిల్వ :- 2833.00 లక్షల గ్యాలన్లు
3) ఆకాశగంగ డ్యామ్ :- 857.85 మీ
ఎఫ్ఆర్ఎల్ (FULL RESRVOYER LEVEL-FRL) : 865.00 మీటర్లు
నిల్వ సామర్థ్యం :- 685.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 306.50 లక్షల గ్యాలన్లు.
4) కుమారధార డ్యామ్ :- 891.00 మీటర్లు
ఎఫ్ఆర్ఎల్ (FULL RESRVOYER LEVEL-FRL) : 898.24 మీటర్లు
నిల్వ సామర్థ్యం :- 4258.98 లక్షల గ్యాలన్లు
ప్రస్తుత నిల్వ :- 2372.76 లక్షల గ్యాలన్లు
5) పసుపుధార డ్యామ్ :- 896.40 మీటర్లు
ఎఫ్ఆర్ఎల్ (FULL RESRVOYER LEVEL-FRL) : 898.24 మీటర్లు
నిల్వ సామర్థ్యం :- 1287.51 లక్షల గ్యాలన్లు
ప్రస్తుత నిల్వ :- 950.39 లక్షల గ్యాలన్లు
యాత్రికుల సంచారంపై నిషేధం
తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా టీటీడీ అధికారులు ఆంక్షలు విధించారు. జలాశయాల పక్కకు ప్రధానంగా ఆ మార్గంలో రాకపోకలు నిషేధించారు. అందేలో ప్రధానంగా తిరుమలకకు సమీపంలోని గోగర్భం డ్యాం నుంచి పాపవినాశనం జలాశయం వరకు ఆలయాలు ఉన్నాయి. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు శనివారం మధ్యాహ్నం నుంచే నిలిపివేశారు.
శ్రీవారిమెట్టు మార్గంలో...
తిరుమలకు అలిపిరితో పాటు శ్రీనివాసమంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గం నుంచి కూడా నడకమార్గంలో వెళ్లవచ్చు. తుపాను కారణంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జలపాతాలు హోరెత్తుతున్నాయి. కొండకు ఎగువప్రాంతాల నుంచి నీటిప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదంతో పాటు జలపాతాల వద్ద యాత్రికులు వెళితే ఊహించని ప్రమాదాలకు ఆస్కారం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. దీంతో శ్రీవారిమెట్టు మార్గాన్ని కూడా మూసివేశారు.
పోలీసులు అప్రమత్తం
తుపాను ప్రభావం తీవ్రంగా ఉండడంతో జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆంధ్ర, తమిళనాడుకు సమీపంలో ఉన్న జిల్లాలోని పిచ్చాటూరు వద్ద ఆరణియార్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు అధికారులతో కలిసి ఈ జలాశయాన్ని సందర్శించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం ఉండాలని హెచ్చరించారు. జలాశయానికి దిగువన ఉన్న గ్రామాల ప్రజలకు ఏ సమయంలో ఏ అవసరమైనా సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.
అనుకోని ఇబ్బందులు ఏర్పడితే వెంటనే ఫోన్ నంబర్లు 112/ 8099999977 సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు. సమాచారం అందిన వెంటనే సాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
Next Story