HOME MINISTER ANITA | అసలైన  పోలీస్ ఆట  ఇక మొదలు..
x

HOME MINISTER ANITA | అసలైన ' పోలీస్ ఆట ' ఇక మొదలు..

రాష్ట్ర హోం శాఖ మంత్రి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు కర్తవ్య బోధ చేశారు.


రాష్ట్రంలో పోలీస్ శాఖ కఠిన పరీక్షలు ఎదుర్కొంటుంది. ఇక అసలైన ఆట, వేట ప్రారంభమవుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు ప్రధానంగా గాంజ, మాదకద్రవ్యాల కట్టడికి అంతర్రాష్ట్ర పోలీసు అధికారుల మీట్ ఏర్పాటు చేస్తామని ఆమె వెల్లడించారు. జనం కోసం పోలీసులు.. పోలీసుల కోసం ప్రజలు అనే విధంగా సంస్కరణలు అమలు చేస్తామని అనిత స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నా, ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసినప్పటికీ గాంజ ప్రభుత్వానికి ఓ సవాల్ గా మారింది. నిత్యం ఏదో ఒకచోట భారీగా గంజా భారీ స్థాయిలో పట్టుబడుతూ ఉండడం ఎందుకు నిదర్శనం. మాదకద్రవ్యాలు కూడా ఇదే తరహాలో విచ్చలవిడిగా విక్రయాలు సాగిస్తున్నారు. స్మగ్లర్లు, అక్రమ రవాణా దారుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా కట్టడి చేయడానికి పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాలు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ సమర్థవంతంగా పనిచేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలను నేలమట్టం చేయడానికి పోలీసు శాఖ సమర్థవంతంగా పరిచేయాల్సిన అవసరాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి గుర్తు చేశారు.
అనంతపురం పర్యటనకు వచ్చిన హెంశాఖ మంత్రి అనిత పోలీస్ అధికారులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా పాల్గొన్నారు.
అనంతపురం పోలీసు శిక్షణ కళాశాల (ananthapuram police training College -PTC) లో శిక్షణ పూర్తి చేసుకున్న 2024- 25 బ్యాచ్ 394 మంది ఎస్సైలు ( Sub inspector of police) పాసింగ్ అవుట్ పరేడ్ (passing out parade) లో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. అంతకుముందు పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.

"రాష్ట్రంలో గాంజా పెద్ద సవాల్ గా మారింది. దీనిని మటుమాయం చేయడానికి పోలీస్ శాఖ కు పరిపుష్టి కల్పించాం" అని హోంమంత్రి అనిత చెప్పారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్ష కేసులు గాంజ, డ్రగ్స్ కు సంబంధించిన ఆపరేషన్స్ నిర్వహించి కేసులు నమోదు చేశాం అని ఆమె చెప్పారు.
అనంతపురం పిటిసి కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న 394 మంది రిజర్వ్, సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ లలో 97 మంది మహిళలే ఉన్నారని చెప్పారు. వారిలో 94 మంది apsp siలు ఉన్నారని హోం మంత్రి అనిత వృత్తిలో ప్రత్యేకతను చాటుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
వంద రోజుల్లో శిక్ష పడాలి
మహిళలు, బాలికల పై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడే వారికి వంద రోజుల్లో శిక్ష పడేవిధంగా అవసరమైన దర్యాప్తు పూర్తి చేయాలని హోం మంత్రి అనిత కర్తవ్య బోధ చేశారు. దర్యాప్తు లో ఆధారాలు పక్కాగా సేకరించడం, నిందితుడు తప్పించుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా వైద్య నిపుణుల నివేదికలతో న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేసి, బాధితులకు అండగా నిలబడాలని ఆమె కర్తవ్యం బోధ చేశారు.
రాష్ట్రంలో గాంజా నిరోధానికి ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన ఈగల్ (eagle) విభాగం పనితీరు మెరుగ్గా ఉందని ఆమె అభినందించారు. వేల ఎకరాల్లో సాగుతున్న గాంజాను గణనీయంగా తగ్గించడంలో విస్తృతంగా దాడులు సాగించామన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 97 మంది మహిళ సభ ఇన్స్పెక్టర్లు మహిళా శక్తిగా మారాలని ఆకాంక్షించారు.
"చేసే ప్రతి పని. మాట్లాడే ప్రతి మాట. చూసే ప్రతి చూపు చురుగ్గా అభినందించే విధంగా" మెలగాలని ఆమె యువ ఎస్సైలకు, పోలీసు శాఖకు హితబోధ చేశారు.
"మీ పని. మీ మాటలు. మీ చూపులు" ప్రభుత్వానికి దిక్సూచి అనే విషయాన్ని మరిచిపోవద్దని ఆమె పాఠం చెప్పారు. పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేసే సమాజానికి మంచి సేవలు అందిస్తే అవి ప్రభుత్వం పై మంచి ప్రభావం చూపుతాయి అనే విషయాన్ని గుర్తు చేశారు.
ఓ ప్యాషన్ గా మలుచుకోండి
సేవ అనేది ఓ ప్యాషన్ గా మారాలి. పోలీసు శాఖలోకి రాకముందు ఉన్న ఈ అలవాటును కాకి దుస్తులు ధరించిన తర్వాత కూడా కొంతమంది అదే పద్ధతిని అలవాటు చేసుకునే అవకాశం లేకపోలేదని హోమ్ మంత్రి అనిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మాటలు చెప్పడానికి ముందు ఆమె వెల్లడించిన వివరాలు మిగతా పోలీస్ అధికారులు నే కాదు పరేడ్కో హాజరైన కుటుంబీకులను కూడా ఉత్సాహపరిచాయి. ఆమె ఏమన్నారంటే..
ఎస్సై శిక్షణ కోసం కొన్ని కోరికలను కూడా త్యాగం చేసి ఉంటారు. కష్టపడి చదివారు. చిన్నపాటి సరదాలను కూడా వదులుకున్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎస్ఐగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. 394 మంది సుక్షితులైన సబ్ ఇన్స్పెక్టర్ లలో ఎం కామ్, ఎంఏ, బీటెక్, ఎంటెక్ చదివిన యువతి యువకులు చాలామంది ఉన్నారని తెలిసి ఆనందం కలిగింది. అని హోం మంత్రి వంగలపూడి అనిత ఆ విషయాలను వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక ఆధారిత సేవలకు ప్రాధాన్యత ఇస్తుంది. సాంకేతికంగా సురక్షితులైన సబ్ ఇన్స్పెక్టర్లు ఆ టెక్నాలజీ తో సైబర్ నేరాలను కట్టడి చేయడానికి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాలని దిశ నిర్దేశం చేశారు. కాస్తో కూస్తో తెలివి ఉన్న సైబర్ నేరగాళ్లు చివరికి పోలీసులను కూడా బురిడీ కొట్టిస్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఉన్నత విద్యావంతులైన యువ సబ్ ఇన్స్పెక్టర్లు ఎంతో తెలివివంతులు, నిరంతర విద్యార్థుల అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సాంకేతికత ఆధారంగా ఆ నేరగాళ్ల పని పట్టడానికి ఎంచుకున్న వృత్తిని మరింత ఫ్యాషన్ గా మలుచుకోవాలని ఆమె సూచించారు.
రాష్ట్రంలో పోలీసు సంక్షేమానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఆరోగ్య భద్రత కోసం బ్యాంకు లింకాజితో కోటి రూపాయల ప్రమాద బీమా అమలు చేస్తున్నామని చెప్పారు. పోలీసు కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక ఆరోగ్య సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆమె చెప్పారు. దీనికోసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
జిల్లాకు ఓ సైబర్ క్రైమ్ స్టేషన్
రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఓ సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మంత్రి పునరుద్ఘాటించారు. లక్షలాది రూపాయల ఐటీ ఉద్యోగాలను కూడా కాదని సమాజం పట్ల బాధ్యతతో వచ్చిన యువ ఎస్సైలు పోలీస్ శాఖలు ప్రజలు బాధితులకు కాకుండా, సైబర్ నేరగాళ్ళ వల్ల చిక్కుకోకుండా మేధస్సును ఉపయోగించాలని ఆమె కోరారు. పోలీస్ స్టేషన్లను ఆధునీకరణతో పాటు లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి స్టేషన్ కు రెండు డ్రోన్ కెమెరాలు ఉండే విధంగా నేరాల కట్టడికే కాదు. ట్రాఫిక్ సమస్యలు తెలుసుకునేందుకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. డిజిపి హరీష్ కుమార్ గుప్తా, పిటిసి ప్రిన్సిపల్ మోహనరావు కూడా మాట్లాడారు.
Read More
Next Story