Tirupati Municipal Corporation | తిరుపతిలో ఓటెయ్యని ఒకే ఒక్కడు...
బెదిరించారు. కిడ్నాప్ చేశారు. అయినా వైసీపీకి మాత్రం ఓటేయలేదు. మాజీ ఎమ్మెల్యే భూమన ఇంటికి చేరిన నలుగురు కార్పొరేటర్లు ఏం చెప్పారంటే..
తిరుపతిలో.టిడిపి కూటమి నేతలు నలుగురు వైసిపి కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్న విషయం బహిరంగ రహస్యం. మంగళవారం నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఫిరాయించిన వారితోపాటు తాజాగా కిడ్నాప్ అయిన నలుగురిలో ఒక వైసీపీ కార్పొరేటర్ మాత్రం ఎవరికీ ఓటు వేయలేదు. తటస్థంగా ఉండిపోయారు. వైసిపి ఎమ్మెల్సీ అనారోగ్యం పేరుతో ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు.
బెదిరించారు.. చంపుతామన్నారు
మమ్మల్ని కిడ్నాప్ చేసి బెదిరించారు. చంపుతామన్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తామన్నారు. గంటగంటకు కొట్టారు. ఈ బాధ భరించలేకే టిడిపి డిప్యూటీ మేయర్ అభ్యర్థికి ఓటు వేసాం. అని వైసిపి నలుగురు కార్పొరేటర్లు కన్నీటి పర్యంతమయ్యారు. రెండు రోజుల కిందటే మమ్మల్ని కిడ్నాప్ చేశారు. బాధలు పెట్టారని తిరుపతి వైసిపి కార్పొరేటర్లు అనీష్ రాయల్, అమర్నాథరెడ్డి, మోహన కృష్ణ యాదవ్ ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత వారంతా మాజీ ఎమ్మెల్యే బి కరుణాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆయన కాళ్లపై పడి బోరున విలపించారు. తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, నగర మేయర్ శిరీషతో కలిసి వారితో మాజీ ఎమ్మెల్యే మీడియా ముందుకు తీసుకుని వచ్చారు.
తిరుపతి నగర పాలక సంస్థలు ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని భర్తీ చేయడానికి ముందే రాజకీయంగా అనేక చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. రాజకీయంగా హై డ్రామా సాగిన పరిస్థితుల్లో, క్యాంపులు కూడా నిర్వహించారు. అయినా, కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి ఎదుర్కొన్న పరాభవం, ప్రతిఘటనకు టిడిపి కూటమి నేతలు ప్రతీకారం తీర్చుకున్నట్లే కనిపిస్తోంది.
రాష్ట్రంలో వైసిపి అధికారంలో ఉండగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. అందులో తిరుపతి నగరపాలక సంస్థ కూడా ఒకటి. ఇక్కడ 50 డివిజన్లు ఉండగా, టిడిపి నుంచి నామినేషన్లు కూడా దాఖలైన పరిస్థితి అప్పట్లో ఎదురైంది. దీంతో దాదాపు సగం వంతు డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 49 స్థానాలను వైసీపీ అభ్యర్థులు దక్కించుకున్నారు. టిడిపి సీనియర్ నాయకుడు ఆర్సి మునికృష్ణ మాత్రమే కార్పొరేటర్ గా విజయం సాధించారు. దీంతో మేయర్ పదవితో పాటు రెండు డిప్యూటీ మేయర్ పదవులు కూడా వైసిపి దక్కించుకుంది. వారిలో డిప్యూటీ మేయర్ పదవిలో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ రెడ్డి అన్ని తానే ఈ చక్రం తిప్పారు. అయితే,
గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన భూమన అభినయ రెడ్డి డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదవి భర్తీ చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్తో తిరుపతి జెసి శుభం బన్సల్ ఎన్నిక నిర్వహించారు.
హైడ్రామా ఏంటి?
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి తప్పుకున్నారు. ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకోవాలని టిడిపి కూడా ఎత్తులు వేసింది. వైసీపీ నుంచి 20 మంది కార్పొరేటర్ లను తమ వైపు తిప్పుకుంది. అప్పటికే తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదయ్యారు. వైసీపీ నుంచి తిరుపతి ఎంపీ మధ్యలో గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంకు కూడా ఓటు హక్కు ఉంది. ఇదిలా ఉంటే..
తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకోవాలని పట్టుదలతో టీడీపీ కూటమి నేతలు రంగంలోకి దిగారు. వైసిపి నుంచి విజయం సాధించిన కార్పొరేటర్లు అనీష్ రాయల్, అనిల్ కుమార్, మోహన్ కుమార్ యాదవ్, అమర్నాథరెడ్డిని టిడిపి నేతలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
వారంతా మొదటి నుంచి వైసీపీ ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డికి ప్రధాన విధేయులుగా కోరుతున్నారు. మంగళవారం మధ్యాహ్నానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయిన తర్వాత, వారంతా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.
ఆ తర్వాత వారందరినీ మీడియా ముందు మాట్లాడించారు. వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన ముగ్గురు కార్పొరేటర్లు ఏమన్నారంటే...
"మమ్మల్ని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కారులో ఎక్కించుకొని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లారు" అని ఆ నలుగురు కార్పొరేటర్లు ఆరోపించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఇంటికి చేరుగానే వారిలో అమర్నాథరెడ్డి మినహా మిగతా ముగ్గురు కరుణాకర్ రెడ్డి పాదాలపై పడి బోరున విలపించారు.
"మమ్మల్ని క్షమించండి. మనస్ఫూర్తిగా వారికి ఓటు వేయలేదు. మమ్మల్ని బాగా బెదిరించారు. కొట్టారు" అని తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఆ కార్పొరేటర్లు కన్నీటి పర్యంతమాత వివరించారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు డిప్యూటీ మాజీ మేయర్ అభినయ రెడ్డి కూడా"పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన కార్పొరేటర్లను"సముదాయించారు.
ఓటెయ్యని కార్పొరేటర్
తిరుపతి నగరపాలక సంస్థ కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 48 మందిలో అమర్నాథరెడ్డి కూడా ఓ కార్పొరేటర్. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపి కూటమి నేతలు కిడ్నాప్ చేసిన వారిలో ఆయన కూడా ఉన్నారు. మంగళవారం జరిగిన ఎన్నికకు అమర్నాథరెడ్డిని సమావేశానికి తీసుకువచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో అమర్నాథరెడ్డి ఎవరికి ఓటు వేయకుండా తలస్తంగా ఉండిపోయారు. దీనిపై ఆయన మాట్లాడుతూ,
"నాపై కూడా అనేక ఒత్తిళ్లు వచ్చాయి. అధికార పార్టీ నిధులు బెదిరించారు. నేను వైసీపీ పక్కనే ఉంటాను" అని అమర్నాథరెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో నా రాజకీయం ముడివడి ఉంది. అందుకే, టిడిపి అభ్యర్థికి ఓటు వేయలేదు. భయాందోళనలకు గురి చేయడం వల్లే వైసీపీకి కూడా ఓటు వేయకుండా తటస్థంగా ఉండాల్సి వచ్చింది అని వ్యాఖ్యానించారు.
Next Story