'ఈ సంకల్పం' వెనక లక్ష్యం ఏమిటంటే..
రాష్ట్ర ప్రభుత్వం "మిషన్ పాట్ హోల్ ఫ్రీ" చేపట్టింది. సీఎం కర్తవ్యం ఏమిటి? సంక్రాంతి నాటికి ఏమిచేస్తారంటే..
ఏ పనిచేయలన్నా సంకల్పం, లక్ష్యం ఉండాలి. ఆచరణ ముఖ్యం అనేది సీఎం చంద్రబాబు ఉద్బోధ. వ్యక్తిత్త వికాసాన్ని బోధించడం సీఎం చంద్రబాబుకు ఉన్న మంచి లక్షణం. ఇందులో ఆయన మించిన వారెవరూ ఉండరేమో. అంతేకాదు, వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంలో కూడా తెలుగుదేశం శైలి విభిన్నంగా ఉంటుంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు నుంచి ఆ లక్షణాలను సీఎం చంద్రబాబు కూడా అందిపుచ్చుకున్నట్లే కనిపిస్తుంది. కోవలో తాజాగా..
రాష్ట్రంలో "మిషన్ పాట్ హోల్ ఫ్రీ" కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శనివారం రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ మిషన్ కోసం ప్రభుత్వం 860 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇదే కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో మంత్రులు కూడా అనుసరించారు. ఆ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఒక్కటే అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. "రాష్ట్రంలో గుంతల లేని రోడ్లు ఏర్పాటు చేయాలి" అనేదే ప్రధాన కర్తవ్యం అని ప్రకటించారు. తన సంకల్పాన్ని. ఉద్యమంలా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎ చంద్రబాబు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో శంకుస్ధాపన చేశారు.
పార చేతపట్టి..
అంతకుముందు ఆయన పార చేతపట్టారు. మట్టి తీసి రోడ్డుపై వేశారు. రోడ్డు రోలర్ ఎక్కారు. రోడ్డుపై పోసిన కంకర గుల్ల చదును చేశారు.రెండు నెలల్లో అంటే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి నాటికి చక్కటి రోడ్లు ఏర్పాటు చేయాలనే సంకల్పించారు. టీడీపీ కూటమి శ్రేణులకు కూడా అదే విషయంపై కర్తవ్య బోధ చేశారు. సీఎం చంద్రబాబు చేపట్టిన స్ఫూర్తితో అనంతపురం జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్, రాప్తాడులో ఎమ్మెల్యే పరిటాల సునీత పుట్టపర్తి సాయిబాబా చిత్రానికి పూజలు చేసిన అనంతరం రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రోడ్లను జగన్ కొలనులు చేశారు..
అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో గుంతలు లేని రోడ్లకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. సంక్రాంతిలోపు రోడ్లపై ఉన్నటువంటి గుంతలన్నీ పూడ్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
"గత పాలకుల కారణంగా రాష్ట్రంలోని రోడ్లు నరకానికి రహదార్లు అయ్యాయి. మాజీ సీఎం జగన్ రోడ్లపై ఈత కొలనులు ఏర్పాటు చేశారు" అని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు జగన్‌కు మనసు రాలేదన్నారు. రహదారులు అభివృద్ధికి చిహ్నమని, గుంతలు లేని రోడ్లకు వెన్నలపాలెంలో శంకుస్థాపన చేశామని, రహదారులు బాగుంటే వ్యాపారాలు బాగా జరుగుతాయని తెలిపారు. సంక్రాంతిలోపు రోడ్లపై ఉన్నటువంటి గుంతలన్నీ పూడ్చాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు వద్దు. అభివృద్ధి రాజకీయాలు కావాలి" అని సూచించారు. 2014-19లో రహదారులు ఎలా ఉండేవో గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. మళ్లీ ఆ తరహా అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
'అనంత'కు రూ.2.90 కోట్లు కేటాయింపు
సీఎం చంద్రబాబు సంకల్పాన్ని మంత్రులు కూడా అందిపుచ్చుకున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ కూటమిలోని బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ అనుసరించారు. సరస్వతీదేవి చిత్రపటానికి పూజలు చేశారు. పలుగు, పారకు కూడా పూజల అనంతరం ధర్మవరంలో రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులపై గుంతలు పూడ్చేందుకు రూ.2.90 కోట్ల రూపాయలు కేటాయించారని సత్యకుమార్ తెలిపారు.
అంతకుముందు జరిగిన సభలో సత్యకుమార్ మాట్లాడుతూ, " వైసీపీ పాలనలో రాష్ట్రంలో రోడ్లు ప్రజలకు నరకాన్ని చూపించాయి" అని విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చడం ద్వారా ప్రమాదాల నివారణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింద ని ఆయన తెలిపారు. జనవరి నాటికి రాష్ట్రంలో ఏ రహదారిపైనా గుంతలు కనిపించకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, అధికారులు చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరారు. ప్రజల సహకారం కూడా అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు.
శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రోడ్లపై గుంతలు పూడ్చే పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ధర్మవరం - కళ్యాణదుర్గం రోడ్డు, కనగానపల్లి - తగరకుంట గ్రామాల మధ్య రోడ్లపై గుంతలు పూడ్చే పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించి మాట్లాడారు. "ఐదేళ్లపాటు వైసీపీ చేసిన పాపాలు కడిగేస్తున్నాం" అని అన్నారు. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగాయి. ఆ పరిస్థితి నుంచి వాహనదారులను కాపాడే బాధ్యత కూడా తీసుకున్నామని ఆమె వ్యాఖ్యానించారు.
Next Story