
శ్రీవారి యాత్రికులను భయపెట్టిన చిరుత
వారి మెట్టు మార్గంలో కొంతసేపు యాత్రికుల నిలుపుదల.
తిరుమల నరకదారిలో శుక్రవారం ఉదయం చిరుత పులి మరోసారి యాత్రికులను భయపెట్టింది. యాత్రికులను శ్రీవారిమెట్టు మార్గంలో కొద్దిసేపు నిపివేశారు. చిరుత జాడల కోసం గాలింపు సాగిస్తున్నారు. నడకమార్గంలో యాత్రికులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ భద్రతా సిబ్బంది సూచనలు ప్రసారం చేస్తున్నారు.
తిరుమల తోపాటు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో ఇటీవల కొంత కాలం నుంచి పరిశీలిస్తే చిరుతపులు ల సంచారం తగ్గింది. అలిపిరికి సమీపంలోని బైపాస్ రోడ్డులో కూడా వాటి అలజడి తగ్గినట్లే కనిపించింది.
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లడానికి అలిపిరితోపాటు శ్రీవారి మెట్టు ప్రాంతం నుంచి కూడా యాత్రికులు కాలినడకన వెళుతూ ఉంటారు. అందులో భాగంగానే శుక్రవారం ఉదయం యాత్రికులు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళుతుండగా 400 మెట్ల వద్ద చిరుత సంచరిస్తూ ఉండడాన్ని యాత్రికులు గమనించారు. ఆందోళనకు గురైన యాత్రికులు వెంటనే టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు.
శ్రీవారిమెట్టు వద్ద ఆగిన యాత్రికులు
శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచరిస్తున్నదనే సమాచారం అందిన వెంటనే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం సిబ్బంది అప్రమత్తమయ్యారు. సుమారు గంటకు పైగానే యాత్రికులను కనుమ మార్గంలో అనుమతించకుండా నిలిపివేశారు. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించిన ప్రదేశానికి చేరుకున్న టిటిడి భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత పులి ఏ మార్గంలో వెళ్లిందనే విషయంలో జాడలు కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు.
శ్రీవారి మెట్టు, కాలినడకన తిరుమలకు వెళ్లే యాత్రికుల భద్రతపై టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం దృష్టి సారించింది.
"యాత్రికులు ఒక్కొక్కరుగా కాకుండా గుంపులుగా వెళ్లాలి" అని టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ సూచించారు. టిటిడి బ్రాడ్కాస్టింగ్ విభాగం కూడా నిరంతరాయంగా ఇదే విషయాన్ని ప్రసారం చేస్తోంది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలిబాటలో గతంలో పిల్లలపై చిరుత పులి దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఒక బాలిక మరణించిన విషయం తెలిసిందే. తోటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తం
తిరుమలతో పాటు నడక మార్గంలో చిరుత పులుల సంచారం, దాడులకు దిగిన సంఘటన నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. అలిపిరి, శ్రీవారిమెట్టు విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు. యాత్రికులను నిలువరించి కనీసం 50 మంది పోగైన తర్వాత నడక మార్గంలో అనుమతిస్తున్నారు. చంటి పిల్లలు ఉంటే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వారి తల్లిదండ్రులను కూడా వెంట తీసుకు వెళ్ళడానికి అనుమతించని విధంగా ఆంక్షలు విధించారు. భద్రతా కారణాల రీత్యా నే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు టిటిడి అధికార కూడా స్పష్టం చేశారు.
శ్రీవారి మెట్టు మార్గంలో అటవీ శాఖ, టిటిడి విజిలెన్స్ సిబ్బంది చిరుత పులి జాడలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. యాత్రికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీటీడీ సి వి ఎస్ ఓ కె.వి మురళీకృష్ణ కూడా స్పష్టం చేశారు. టీటీడీ చేస్తున్న సూచనలను యాత్రికులు పాటించాలని ఆయన కోరారు.
Next Story

