ఆలోచనలకు శాస్త్రీయ రెక్కలు తొడిగే లక్ష్యంగా...
x
తిరుపతి సంస్కృతి విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభిస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఎం నారా చంద్రబాబు

ఆలోచనలకు శాస్త్రీయ రెక్కలు తొడిగే లక్ష్యంగా...

తిరుపతిలో ప్రారంభమైన భారతీయ విజ్ణాన సమ్మేళనం.


భారతీయ విజ్ఞాన సమ్మేళనం ద్వారా శాస్త్ర, సాంకేతిక, విజ్ణానాన్ని ప్రజల మధ్య విస్తరింపచేయడం లక్ష్యంగా ఐదో సదస్సు తిరుపతి వేదికగా ప్రారంభమైంది.

భారతీయ భాషల్లో శాస్త్రీయ ఆలోచనల మార్పిడి ప్రధాన లక్ష్యం భారతీయ విజ్ణాన సమ్మేళనం-5 నిర్వహిస్తున్నట్లు విజ్ఞాన్ భారతి (VIBHA) అధ్యక్షుడు డాక్టర్ శేఖర్ సి. మండేజీ తెలిపారు. ఈ కార్యక్రమాన్నిఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, కేంద్ర కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్, విజ్ఞాన్ భారతి (VIBHA) అధ్యక్షుడు డాక్టర్ శేఖర్ సి. మండేజీ, రిసెప్షన్ కమిటీ హెడ్ - BVS 2025,DRDO మాజీ చైర్మన్ డాక్టర్ జీ. సతీష్ రెడ్డి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ జిఎస్ఆర్కె. మూర్తి,విజ్ఞాన్ భారతి జనరల్ సెక్రటరీ, వివేకానంద పాయ్ హాజరయ్యారు.
"ఈ జాతీయ సదస్సు భారతీయ సమాజం-ఆ ధ్యాత్మిక వారసత్వాన్ని వేడుకలో యువతలో సృజనాత్మక, స్వతంత్ర ఆలోచన చేయడానికి ప్రేరణ కలిగిస్తుంది" అని విజ్ఞాన్ భారతి (VIBHA) అధ్యక్షుడు డాక్టర్ శేఖర్ సి. మండేజీ చెప్పారు. ఈ జాతీయ సదస్సులో గ్రామీణ ఆవిష్కరణలు, భారతీయ శాస్త్రవేత్తల కృషి, ఆధునిక సమస్యలకు సాంప్రదాయ విజ్ణానంతో పరిష్కారాలు చూపించే చర్చలు సాగుతాయని ఆయన వివరించారు.
భారతీయ విజ్ణాన సమ్మేళనం ( bvs ) తొలి సమ్మేళనం భోపాల్ లో జరిగింది. 2009లో ఇండోర్, 2012లో జలంధర్, 2015లో గోవా రాజధాని పనాజీ, 2017లో పుణె, 2013లో అహ్మదాబాద్, 2025 సదస్సుకు తిరుపతి వేదికగా ఎంచుకున్నట్లు ఆయన వివరించారు.
సీఎం చంద్రబాబుకు స్వాగతం

సంస్కృత విశ్వవిద్యాలయంలో జాతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శుక్రవారం ఉదయం తిరుపతి చేరుకున్నారు. ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఆయనకు మంత్రులు, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు స్వాగతం పలికారు.

జిల్లాకు విచ్చేసిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్ కు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ స్వాగతం పలికారు.
Read More
Next Story