Seshachalam forest | కడప అడవిలో శ్రీకాళహస్తి విద్యార్థుల ఆర్తనాదాలు
x

Seshachalam forest | కడప అడవిలో శ్రీకాళహస్తి విద్యార్థుల ఆర్తనాదాలు

విద్యార్థుల విహారయాత్ర విషాదంగా మారింది. దారితప్పిన ఆరుగురిలో ఒకరు మరణించారు.


ఇటీవల కురిసిన వర్షాలు. మంచుకురిసే వేళ్లలో అడవులు పచ్చదనం సంతరించుకున్నాయి. దట్టమైన అడవిలో జలపాతాలు సందడి చేస్తున్నాయి. ఆరుగురు బీటెక్ విద్యార్థులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని శేషాచల అడవుల్లో గుంజన జలపాతం వద్దకు విహారయాత్ర వెళ్లారు. అడవిలో దారి తప్పిన ఆ విద్యార్థులు అగచాట్లు పడ్డారు. తమ వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.అడవిలో చిక్కుకున్న విద్యార్థులను సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన అటవీ, పోలీసు శాఖ అధికారులు ఐదుగురిని కాపాడగలిగారు. ఆరోగ్యం సరిగా లేని మరో విద్యార్థి అడవిలోనే ప్రాణం కోల్పోయారు. ఈ విషాద సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.


ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులకు ఎలా తెలిసిందో కానీ, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అటవీ ప్రాంతంలోని వాగేటికోన ప్రాంతంలోని గుంజన జలపాతాలను చూడడానికి శుక్రవారం విహారయాత్రకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో దారి తప్పినట్లు వారు గమనించారు. ఈ వెంపర్లాటలో దారీతెన్ను తెలియని స్థితిలో అడవిలోనే తిరుగుతున్న ఆ మిత్రులు చివరకు రైల్వేకోడూరు అటవీ ప్రాంతం సమీపంలోనే ఉన్న ఎన్. ఉప్పరపల్లి, ఎస్ కొత్తపల్లి ప్రాంతాల పరిధిలోకి రాగానే సెల్ఫోన్ సిగ్నల్స్ అందాయి. అప్పటికే ఆందోళన చెందుతున్న దారితప్పిన ఆ ఆరుగురు విద్యార్థులు రేణిగుంటలోనే తమ స్నేహితులకు సమాచారం అందించారు. ఆపదలో ఉన్నాం. కాపాడమని కోరారు. వారి సూచన మేరకు లైస్ సిగ్నల్స్ లొకేషన్ కూడా పంపించారు. దారితప్పిన విద్యార్థుల బృందంలోని కొందరి సెల్ఫోన్లకు సిగ్నల్ రావడంతో రేణిగుంట పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

పోలీస్ అటవీ శాఖ అప్రమత్తం
దట్టమైన అడవిలో విద్యార్థులు దారితప్పారనే విషయం తెలుసుకున్న రేణిగుంట పోలీసులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే రైల్వే కోడూరు సిఐ హేమ సుందర్ రావు స్పందించారు. ఎస్ఐ నవీన్ బాబు పోలీసు సిబ్బందితోపాటు అటవీ శాఖ అధికారులతో కలిసి అడవిలో తప్పిపోయిన ఆరుగురు విద్యార్థుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు.
ఓ విద్యార్థి మృతి
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంజనేరు వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థుల లోకేషన్ సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా కనుగొన్నారు. ఆ ఆరుగురు బృందంలో దత్త సాయి (26) అనే బీటెక్ విద్యార్థి మరణించినట్లు సమాచారం అందింది. మరణించిన విద్యార్థి మృతదేహాన్ని రైల్వే కోడూరు ఆస్పత్రికి తరలించారని సమాచారం.
Read More
Next Story