
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య బచ్చన్
ప్రపంచానికి దిక్సూచి సత్యసాయి బోధించిన '5 D’s ..
బాబా శతజయంతి వేడుకల్లో మాజీ విశ్వసుందరి ఐశ్వర్య బచ్చన్
భగవాన్ సత్యసాయి బాబా జన్మించి నేటికి వందేళ్లు పూర్తయింది. ఆయన ప్రభావం, ఆయన దివ్య స్ఫూర్తి ప్రపంచంలోని మిలియన్ల హృదయాల్లో ఇంకా నిలిచే ఉందని మాజీ విశ్వసుందరి, సినీనటి ఐశ్వర్యా బచ్చన్ వ్యాఖ్యానించారు.
"మానవ సేవే మాధవ సేవ అని బాబా నమ్మేవారు. ఆచరించి చూపించారు. ఆయన చేసిన ప్రజాసేవ, ప్రేమ, దయ, పరిపూర్ణత – ఇవన్నీ ప్రపంచానికి ఒక ఆదర్శం.” భగవాన్ బోధించిన “5 D’s”ను ఐశ్వర్య బచ్చన్ ప్రస్తావించారు.
Discipline (క్రమశిక్షణ), Dedication (అంకితభావం), Devotion (భక్తి), Determination (దృఢ సంకల్పం), Discrimination (సత్యాసత్య వివేకం) ఈ ఐదు 'డీ'లు జీవితానికి దిశగా, ధర్మంగా నిలుస్తాయన్నారు సత్యసాయిబాబా ఎప్పుడూ ఇవే జీవితానికి పునాది అని చెప్పేవారని గుర్తు చేశారు. విద్య, ఆరోగ్య సేవల్లో సత్యసాయి సంస్ధల సేవలు అమూల్యమని తెలిపారు.
సత్యసాయి శతజయంతి వేడుకల్లో భాగంగా బుధవారం హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన కార్యక్రమాలకు ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ చక్రవర్తి, గ్లోబల్ సత్యసాయి ట్రస్టు అధ్యక్షులు నిమీష్ పాండ్య, సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్జే. రత్నాకర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా బచ్చన్ మాట్లాడుతూ,
వేలాది మంది విద్యార్థులకు సత్యసాయి విద్యాసంస్థల్లో ఉచితంగా విలువలతో కూడిన విద్య అందిస్తున్నాయి. బాల వికాస్ స్కూళ్లలో నైతిక బోధనలు భవిష్యత్ తరాలకు వెలుగు చూపుతున్నాయని ఐశ్వర్య అన్నారు.
"ప్రేమ, సేవ, దయకు సరిహద్దుల్లేవు. సేవ అనేది నిజమైన నాయకత్వం" అని సత్యసాయి ప్రబోధనలను ఆమె ఉటంకించారు. పుట్టపర్తి సత్యసాయి శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో కుల్వంత్ హాలులో బాబా సమాధిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం పుట్టపర్తి లోని హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన వేడుకలో ఆమె మాట్లాడారు. సత్యసాయి విద్యా సంస్థల విద్యార్థినిగా తాను అనేక పాఠాలు నేర్చుకున్నానని ఐశ్వర్య బచ్చన్ గుర్తు చేసుకున్నారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి, కోల్కతా, వైట్ ఫీల్డ్, ముంబై లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అంతర్జాతీయ స్థాయి వైద్యం పూర్తిగా ఉచితంగా అందించడం బాబా కరుణామూర్తి హృదయానికి నిదర్శనం అని అభివర్ణించారు. జలసేవ, గ్రామీణాభివృద్ధి, యువత సాధికారతలో బాబా కార్యక్రమాలు చరిత్రాత్మకమని ఆమె పేర్కొన్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడులో లక్షలాది మందికి తాగునీరు అందించడం, గ్రామీణాభివృద్ధి, యువత శక్తి వృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేయడం అనేవి సత్యసాయి అపారమైన సేవాశక్తికి ఉదాహరణలుగా ఆమె వివరించారు. సత్యసాయి బోధించిన శాశ్వత విలువలపై మాట్లాడుతూ,
"సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనేవే సత్యజాయి జీవితం. ఆయన సందేశం" అని అన్నారు. ఈ విలువలను మనం ఆచరణలో పెట్టే సమయమే నిజమైన భక్తి అంటూ భగవాన్ సత్యసాయి బాబా ప్రేమ, సేవ, కరుణ ప్రపంచానికే ఒక వరమని ఐశ్వర్య బచ్చన్ భావోద్వేగంగా అన్నారు.
Next Story

