కలిసి జీవించాలని వచ్చి.. తమిళ ప్రేమజంట ఆత్మహత్య
x

కలిసి జీవించాలని వచ్చి.. తమిళ ప్రేమజంట ఆత్మహత్య

తిరుపతిలో కలకలం రేపిన ముగ్గురి ఆత్మహత్యలు


ఆమెకు పెళ్లయింది. కొడుకు ఉన్నాడు. ప్రియుడితో కలిసి జీవించాలని తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ ముగ్గురు తిరుచానూరుకు సమీపంలోని దామినేడు ఇందిరమ్మ కాలనీలోని ఓ ఇంటిలో శవాలై కనిపించారు. ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో తిరుచానూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

"రెండున్నర సంవత్సరాల పిల్లాడితో పాటు ఆమె తల్లి, ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నారు" అని తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ చెప్పారు. ఈ సంఘటనకు దారి తీసిన వివరాలు లోకి వెళితే..
తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం ప్రాంతానికి చెందిన పొన్నాగుట్ట నాయకి కి వివాహమైంది. ఆమెకు రెండున్నర సంవత్సరాల కొడుకు మనీష్ ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన సత్యరాజ్ తో ప్రేమలో పడింది.
గుడియాత్తం నుంచి వచ్చి..
తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం నుంచి సత్యరాజ్ వెంట పొన్నగుట్టె నాయగి ఆమె కొడుకు మనీష్ ను తీసుకొని తిరుపతికి చేరుకున్నాడు. తిరుచానూరుకు సమీపంలోని 150 బైపాస్ రోడ్డులో ఉన్న డామినేడు ఇందిరమ్మ నివాసాల సముదాయంలో ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నారు. కొన్ని రోజులు కూలీ పనులు చేసుకుంటూ ఆ ఇద్దరూ జీవనం సాగిస్తున్నట్లు కాలనీలోని ప్రజల ద్వారా తెలిసింది. దామినేడు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న సత్యరాజ్, పొన్నాగుట్టే నాయగి గత నెల 22వ తేదీ నుంచి ఇంటి నుంచి బయటకు రాలేదని కాలనీవాసులు చెబుతున్నారు.
ఇంతకూ ఏమైంది..
ఇందిరమ్మ కాలనీలో సత్యరాజ్, నాయగి నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో కాలనీ ప్రజలకు సందేహం వచ్చింది. ఈ విషయాన్ని తిరుచానూరు పోలీసులకు తెలిపారు. ఘటన స్థలాన్ని తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ తో పాటు సిబ్బంది కూడా పరిశీలించారు. ఆ ఇంటిలో ముగ్గురు సవాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ముగ్గురు సత్యరాజ్, పొన్నాగుట్టే నాయగి, ఆమె కొడుకు మనీష్ మృతదేహాలుగా గుర్తించారు.
"ప్రియురాలు నాయగి, ఆమె కొడుకు మనీష్ కు విషయం తాపేచ్చిన తర్వాత సత్తిరాజు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపిస్తోంది" అని తిరుచానూరు సిఐసా సునీల్ కుమార్ చెప్పారు. ఈ సమాచారం అందుకున్న నాయకి తల్లిదండ్రులతో పాటు, సత్యరాజ్ మామ ఇతర కుటుంబ సభ్యులు కూడా దామినేడు కాలనీ వద్దకు మంగళవారం చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సునీల్ కుమార్ తెలిపారు.
Read More
Next Story