
ICC Champions Trophy | క్రికెట్ ప్రేమికులకు పండుగ తెచ్చిన ఆదివారం
ఈ సమరాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే ఛాంపియన్ ట్రోఫీ టీమ్ ఇండియాకే అని విశ్లేషిస్తున్నారు.
క్రికెట్ అభిమానులకు ఈ ఆదివారం ఓ పండగ తెచ్చింది. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న భారత క్రికెట్ జట్టు కు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలవడం చాలెంజ్గా తీసుకుంది. గత ఏడాది టి20 ప్రపంచ కప్ సాధించిన భారత క్రికెట్ జట్టు ICC champions trophy 2025 ట్రోఫీ దక్కించుకోవడానికి న్యూజిలాండ్ జట్టుతో తలపడబోతోంది.
క్రికెట్ అభిమానులు ఈ పండుగను ఆస్వాదించడానికి ఎప్పుడు ఎప్పుడు ఈ మధ్యాహ్నం 2.30 గంటల కోసం నిమిషాలు యుగాలుగా నిరీక్షిస్తున్నారు. 25 ఏళ్ల తర్వాత కివీస్ జట్టుతో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో తలపడనుంది.
సాధారణంగా దాయాది పాకిస్తాన్ జట్టుతో క్రికెట్ జరిగే సమయంలో దేశభక్తి ఉప్పొంగుతుంది. నరాలు తెగే ఉత్కంఠతో భారత క్రికెట్ అభిమానులే కాదు. సాధారణ ప్రజలు కూడా ఆ పోటీని చూడడానికి ఆసక్తి చూపిస్తారు.
దుబాయ్ వేదికగా ఈరోజు (ఆదివారం) మధ్యాహ్నం ర కివీస్ తో టీమ్ ఇండియా గట్టు తలపడుతున్నది ఫైనల్ మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానుల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 కూడా టీమిండియా దక్కించుకుంటే ఓ రికార్డు నమోదు చేస్తుంది.
ప్రత్యేక ఏర్పాట్లు
దుబాయ్ వేదికగా పుష్కర కాలం తర్వాత కివీస్ తో భారత్ జట్టు పోటీ పడబోతుంది. ఈ క్రికెట్ పండుగను ఆస్వాదించడానికి కుర్రకారు ప్రధానంగా క్రికెట్ ప్రేమికుల ద్వారా సొమ్ము చేసుకోవడానికి కొన్ని సంస్థలు బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశాయి.
రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ పట్నం ప్రాంతాల్లో క్రీడా మైదానాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మేము కూడా ఏం తక్కువ కాదనే రీతిలో తిరుపతిలో కూడా అనేక పేరెన్నికగన్న బార్ అండ్ రెస్టారెంట్, క్రీడా ప్రాంగణాల్లో క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ ప్రదేశాల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ సమరాన్ని చూడడానికి వీలుగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు, తినుబండారాలను కూడా సంసిద్ధం చేశారు.
దుబాయ్ వేదికగా జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 వన్డే టోర్నీ ఫైనల్ లో టీమిండియా క్రికెట్ సంబరం ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. ఒకపక్క క్రికెట్ క్రీడా, దీనికి ఆదివారం కూడా కలిసి రావడంతో క్రికెట్ అభిమానులు ఇళ్లకు పరిమితమైన వారి సంఖ్య ఒక రకంగా ఉంది.
రాష్ట్రంలోని ప్రధాన నగరాలే కాదు. పట్టణాల్లో కూడా ఏమాత్రం తగ్గేది లేదని టీమిండియా జరిగే క్రికెట్ క్రీడా సంబరాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంతటి ఆసక్తి ఏర్పడడానికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయని క్రికెట్ అభిమాని, ఫిజికల్ డైరెక్టర్ చెబుతున్నారు.
"గత ఏడాది టి20 ప్రపంచ కప్ సాధించిన భారత క్రికెట్ జట్టు చరిత్ర నమోదు చేసింది. 12 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్తో ఢీకొంటున్న టీమిండియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సాధిస్తుంది" అని డేవిడ్ అభిప్రాయపడ్డారు.
ఈ విజయం సాధిస్తే భారత్ ఖాతాలో మూడో ఛాంపియన్స్ ట్రోఫీ చేరుతుంది.
"2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమిండియా, చివరిగా 2013లో ఈ టైటిల్ సాధించింది. 2000 లో కివీస్ జట్టు భారత్ ఓడించే ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది" అని కూడా డేవిడ్ విశ్లేషించారు.
విపరీతమైన ఆసక్తి
టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఫైనల్ లో న్యూజిలాండ్తో తలపడే మ్యాచ్ క్రికెట్ అభిమానుల అంచనాలను ఎక్కువ చేశాయి. 24 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కివీస్ నుంచి దక్కించుకోవడానికి టీమిండియా జట్టు పోటీ జరగనున్న నేపథ్యంలో బెట్టింగులు కూడా అంచనాలను మించి జరిగాయని తెలుస్తోంది. ఇటీవల రెండు రోజుల కిందట కూడా బెట్టింగ్ రాయలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
టీమిండియా, కివీ స్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం దుబాయ్ వేదిక సిద్ధమైతే... ఈ రెండు జట్ల మధ్య జరిగే క్రికెట్ సమరాన్ని ఆస్వాదించడమే కాదు. కేరింతలతో టీమ్ ఇండియా జట్టును స్క్రీన్ ల ముందే మరింత ఉత్సాహపరుస్తున్నాం అని భావించే విధంగా క్రికెట్ ప్రేమికులు ఏర్పాటు చేసుకున్నారు.
తిరుపతిలో ఏర్పాట్లు
కివిస్ తో టీమిండియా క్రీడా సంబరాన్ని చూసేందుకు తిరుపతిలోని జెన్ క్రికెట్ అకాడమీ ప్రతినిధి కిరణ్ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (Tirupati urban development authority- TUDA) కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన కచ్చపి ఆడిటోరియం వద్ద బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు.
"ఔత్సాహిక క్రికెట్ క్రీడాకారులకు ఛాంపియన్ ట్రోఫీ ద్వారా మరింత స్ఫూర్తి ప్రోత్సాహం అందించాలని ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసాం" అని కిరణ్ కుమార్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.
ట్రోఫీ ఇండియాదే..
దుబాయ్ లో కివీస్ జట్టుతో జరిగే ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీ టీమిండియా జట్టు దక్కించుకుంటుందని ఫిజికల్ డైరెక్టర్ డేవిడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఏమంటున్నారంటే..
"పాకిస్తాన్ కు 20 ఏళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశం దక్కింది. ఐసీసీ చాంపియన్స్ ప్రొఫెసర్ 2025 పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తుంది. భద్రతా కారణాల రీత్యా భారత జట్టు పాకిస్థాన్లో కాకుండా తటస్థ వేదికల పైనే మిగతా జట్లతో తలపడుతుంది. వాస్తవానికి ఫైనల్ పోటీ కరాచీలో జరగాల్సింది. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీమిండియా జట్టు ఫైనల్కు చేరింది. దుబాయిలో కివిస్తూ తలపడుతోంది అంటే టీమిండియా ట్రోఫీ సాధించినట్టే లెక్క" అని డేవిడ్ విశ్లేషించారు.
Next Story