పేదవాడి ఊటీలో స్టార్ హోటల్
రాయలసీమలో ఆంధ్రా ఊటీ హార్సిలీహిల్స్. ఇది పేదవాడిని సేదదీర్చే విహార కేంద్రం. ఇక్కడ స్టార్ హోటల్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి.
పేదవాడి ఊటీ హార్సిలీహిల్స్. పిల్లపాపలతో సరదాగా వెళ్లవచ్చు. ఖర్చు తక్కువ ఆహ్లదం ఎక్కువ. ఇకపై ఆ పరిస్థితి తిరగబడనుంది. హార్సిల్ హిల్స్ లో స్టార్ హోటల్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. పర్యావరణం కూడా దెబ్బతినే పరిస్థితి లేకపోలేదు. వీఐపీలు కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతారు. రక్షణ పరంగా ఇబ్బంది లేదు. ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. సందర్శకులతో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఈ పరిస్థితుల్లో మదనపల్లె ప్రాంత పర్యటనకు 2019 డిసెంబర్ ఐదో తేదీ జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కల్యాణ్ హార్సిలీహిల్స్ లో హాయిగా సేదదీరారు. గాలిబండపై ఆయన ప్రకృతి అందాలను ఆస్వాదించిన ఫొటోలు ఎక్స్ లో షేర్ చేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బీ. కొత్తకోట మండలం పరిధిలో ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్. ఇక్కడు 7-స్టార్ హోటల్ నిర్మాణ పనులకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఒబెరాయ్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం ఉదయం హార్సిలీహిల్స్ లో నిర్మించదలచిన 7-స్టార్ హోటల్ నిర్మాణానికి అనువైన స్థల పరిశీలన చేశారు. హార్సిలీహిల్స్ పై 20 ఎకరాల విస్తీర్ణంలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణం చేస్తామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు.
హార్సిలీహిల్స్ పూర్తిగా అటవీప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ పెత్తనం మొత్తం పర్యాటక శాఖ ఆధీనంలో ఉంటుంది. రెవెన్యూ శాఖ నామమాత్రంగా ఉంటోంది. దీంతో హార్సిలీహిల్స్ లో పర్యాటక శాఖ ద్వారానే అన్ని వ్యవహారాలు సాగుతుంటాయి. అటవీశాఖ, రెవెన్యూ శాఖల ప్రమేయం తక్కువ అనేది అందరికీ తెలిసిందే.
లోకల్ అధారిటీ...
రాష్ట్రంలో లోకల్ అధారిటీలు మూడు ఉన్నాయి. అందులో హార్సిలీహిల్స్, మదనపల్లె సమీపంలోని ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ (ఏెఎంసీ), తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ మూడి కేంద్రాల్లో పరిపాలన, నిర్ణయాలు విభిన్నంగా ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధం లేకుండా, ఆయా ప్రాంతాల్లో నివాసితులు సభ్యులుగా ఉంటారు. లోకల్ అధారిటీకి ఆ కేంద్రాల పరిధిలోని సబ్-కలెక్టర్ అధ్యక్షుడి ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ పరిస్థితుల్లో పర్యావరణ సమతుల్యం కాపాడడంలో హార్సిలీహిల్స్ కీలక భూమిక పోషిస్తుంది. ఈ ప్రదేశంలో స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతులు, వ్యవహారం చర్చకు వచ్చింది.
దీనిపై సమగ్రమైన వివరాలు మరో కథనం ద్వారా తెలుసుకుందాం.
Next Story