శ్రీవారికి నెల రోజులు సుప్రభాత సేవ రద్దు..
x
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం (ఫైల్)

శ్రీవారికి నెల రోజులు సుప్రభాత సేవ రద్దు..

16వ తేదీ నుంచి ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు. తిరుమల ఆలయంలో ప్రత్యేకతలు..


తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసంలో సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. ఈ నెల ప16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. శ్రీవారి ఆలయంలో ఆ రోజు ఉదయం నుంచి జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై ప్రవచనాలు ఆలపిస్తారు.

దేశంలోని అనేక రాష్ట్రాల్లోని 233 కేంద్రాల్లో కూడా ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించడానికి టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు వెల్లడించింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు.
ధనుర్మాసం...
కాలచక్రంలో సూర్యుడు ధనస్సురాశిలోకి ప్రవేశించడం ద్వారా ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఆ తరువాత సూర్యుడు మకరరాసిలోకి ప్రవేశించే సంక్రాంతి పండుగ నాడు ధనుర్మాసం ముగుస్తుంది.
తిరుప్పావై ప్రవచనాలు అంటే...
శ్రీవారి వైభవాన్ని విస్తృతం చేయడంలో 12 మంది ఆళ్వారులు (భక్తులు) ప్రధానమైనవారు. అందులో ఒకరైన గోదాదేవి ధనుర్మాస వ్రతం చేశారు. దీనివల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో ప్రస్తావించారు.
ఈ వ్రతం ఎలా చేయాలనే విషయాలను గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ అమ్మవారు భగవంతుడినే భర్తగా భావించారు. ఆయనను చేరుకునే సంకల్పంతో ఆచరించిన వ్రతమే. తిరుప్పావైగా మారింది. తిరు అంటే శ్రీ అని అర్థం. పావై అంటే పాటలతో కూడిన వ్రతం.
గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. పాశురం అంటే చందోబద్ధంగా ఉన్న పాటలే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు . ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
దేశంలో ప్రవచనాలు
శ్రీవారి భక్తులను కూడా ఇందులో మమేకం చేయాలనే సంకల్సంతో ఈ సంవత్సరం ఈ నెల 14వ తేదీ ప్రారంభించే తిరుప్పావై పాసురాలు నెలపాటు దేశంలోని 233 కేంద్రాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రతినిధులు తెలిపారు. అందులో భాగంగా తిరుపతితో పాటు ఏపీలో-76 కేంద్రాలు, తెలంగాణలో 57, త‌మిళ‌నాడులో 73, క‌ర్ణాట‌క‌లో 21, పాండిచ్చేరిలో నాలుగు చోట్ల , న్యూఢిల్లీ, ఒడిశాలోని ఒక్కో కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వ‌హించ‌నున్నారు.
మరో ప్రత్యేకత
తిరుమల శ్రీవారి ఆలయంలో సాధారణంగా సుప్రభాత, పవళింపు సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఇది క్రమం తప్పకుండా నిర్వహించే క్రతువు.

తిరుమల ఆలయంలో శ్రీవారి పాదాల చెంత ఉన్న భోగశ్రీనివాసమూర్తికి నిత్యం ఏకాంత సేవ నిర్వహించడం ఆనవాయితీ. విగ్రహానికి ఈ సేవలు నిర్వహించడం ద్వారా ఉదయం నిద్రలేపడం, రాత్రి పవళింపు సేవ చేయడంలో అన్నమాచార్యుల 12వ తరదానికి చెందిన ప్రతినిధి, వేదపండితులు ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో మాత్రం భోగశ్రీనివాసుడితో పని ఉండదు. సుప్రభా, పవళింపు సేవలు ఉండవు.
చిలకలతో అలంకరణ
భోగశ్రీనివాస మూర్తికి బదులు ధనుర్మాసంలో ఆలయలోని శ్రీకృష్ణస్వామికి ఈ సేవ నిర్వహించడం సంప్రదాయంగా పాటిస్తుంటారు.
శ్రీవారికి కూడా ధనుర్మాంలో తెల్లవారుజామున చలిలో వేడి పొంగలి, పాయసం దోసె ప్రత్యేకంగా నివేదిస్తారు. ముద్దాన్నం తోపాటు సుండల్, సీరా కూడా సమర్పించడం ఆనవాయితీ. ధనుర్మాసంలో శ్రీవారికి అలంకరణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మూడు చిలుకలతో అలంకర ఉంటుంది. వాటిలో ఓ చిలుకను, పుష్పాలు ఆకులతో టీటీడీ గార్డెన్ విభాగం లో తయారు చేస్తారు. వజ్రాలు పొదిగిన బంగారు చిలుక, ఆకులతో తయారు చేసిన మరో చిలుక శ్రీవిల్లిపుత్తూరులోని అండాల్ అమ్మవారి సన్నిధిలో తయారు చేసిన చిలుకలతో అలంకరణ చేయడం ప్రత్యేకత.
బంగారు చిలుకను మాత్రం శ్రీవారి కుడిపక్క ఎదపై అలంకరిస్తే, టీటీడీ ఉద్యానవన విభాగం తయారు చేసే చిలుకను ఎడమపక్క శంఖువు వద్ద అలంకరించడం ప్రత్యేకత.
Read More
Next Story