టీటీడీలో  శ్రీవారి ప్రొఫెషనల్ సేవ
x
టీటీడీలో శ్రీవారి సేవకులు (ఫైల్)

టీటీడీలో "శ్రీవారి ప్రొఫెషనల్ సేవ"

సేవకులకు ఐఐఎంలో శిక్షణపై ఈఓ సమీక్ష


టీటీడీ ప్రస్తుతం అమలు చేస్తున్న సేవకు సమాంతరంగా "శ్రీవారి ప్రొఫెషనల్ సేవ"ను అమలు చేయడానికి సమాయత్తం అవుతోంది. దీనికోసం అహ్మదాబాద్ ఐఐఎం బృందంతో గ్రూప్ సూపర్ వైజర్లకు శిక్షణ ఇవ్వడానికి కార్యాచేరణ సిద్ధం చేయాలని టీటీడీ ఈఓ జే. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న శ్రీవారిసే వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

అధికారులతో సమావేశమైన టీటీడీ ఈఓ శ్యామలరావు

తిరుమలలో అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరితో కలిసి అన్నమయ్య భవన్ లో టీటీడీ ఈఓ జే.శ్యామలరావు, శుక్రవారం సమీక్షించారు.

టీటీడీలో ప్రారంభించనున్న ప్రొఫెషనల్ శ్రీవారి సేవ, ఎన్ఆర్ఐ సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల కార్యాచరణ పురోగతిపై సుదీర్ఘoగా చర్చించారు.
ఇకపై అమలు చేసే ప్రొఫెషనల్ సేవను పర్యవేక్షించే గ్రూప్ సూపర్ వైజర్లను ఐఐఎం-అహ్మదాబాద్ బృందంతో సుక్షితులు చేయడానికి కార్యాచరణకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్
శ్రీవారి ప్రొఫెషనల్ సేవ కోసం టీటీడీ IT డిపార్ట్మెంట్ పవర్ పాయింట్ ద్వారా గ్రూప్ సూపర్ వైజర్ల కోసం తయారు చేసిన అప్లికేషన్ ను ప్రదర్శించారు. ఎన్ఆర్ఐ సేవ, Professional సేవలను కూడా త్వరిత గతిన ప్రారంభించాలని, NRI సేవలను విస్తరించేందుకు APNRT సంస్థతో సంప్రదింపులు చేయాలని శ్రీవారి సేవ అధికారులను ఈఓ శ్యామలరావు ఆదేశించారు. టీటీడీ ట్రాన్స్ పోర్ట్, IT జీఎం శేషారెడ్డి, సీపీఆర్వో డాక్టర్ టీ.రవి, అశ్వినీ ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారి, పిఆర్ఓ కుమారి నీలిమ, అధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story