
తిరుమల తరహాలో అన్నదానం, వసతి, మల్లన్న దర్శనం...
శ్రీశైలంలో సంస్కరణలతో చెంచులకు ప్రాధాన్యం ఇస్తానని 'ది ఫెడరల్' ప్రతినిధికి చెప్పారు.
శ్రీశైలం ఆధ్యాత్మిక. పర్యాటకంగా ప్రదేశం. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక యాత్రికులకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. నల్లమల అటవీప్రాంతంలోని ఈ జ్యోతిర్లింగ క్షేత్రానికి రోజు వేలాది మంది యాత్రికులు సందర్శిస్తుంటారు. శ్రీశైలం నల్లమల అటీవీ ప్రాంతం చెంచుగూడేలకు నిలయం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న భ్రమరాంబికా సమేత మల్లన్నస్వామి శైవక్షేత్రం సేవలను చెంచులకు చేరువ చేస్తానని శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు చెప్పారు. శ్రీశైల మల్లన్న దర్శనం, సేవలను మరింత సరళతరం చేస్తానని కూడా ఆయన చెప్పారు.
తిరుమల పాలక మండలి తరహాలోనే శ్రీశైలం ట్రస్టు ఏర్పాటు చేయడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి సభ్యులుగా నియమించడానికి శ్రద్ధ తీసుకుంది. ట్రస్టు బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు.
మాట్లాడుతున్న శ్రీశైలం ట్రస్టు బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు. పక్కన రాష్ట్ర మంత్రి సత్యకుమార్
"తిరుమల తరహాలో యాత్రికులకు సేవలు అందించడానికి సంవత్సరంలో అమలు చేస్తా. అన్నదానం తో పాటు స్వచ్ఛంద సేవకులకు సదుపాయాలు కల్పించడానికి శ్రద్ధ తీసుకుంటా" అని రమేష్ నాయుడు చెప్పారు.
శ్రీశైలం దేవస్థానం నల్లమల అటవీ ప్రాంతం. నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలో ఉండడం వల్ల రాత్రిళ్లు ఘాట్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఉండదు. దీంతో దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు కర్ణాలక నుంచి అధికంగా వచ్చే యాత్రికులకు వసతి సమస్య వల్ల ఆరుబయట సేదదీరే పరిస్థితి ఇక్కడ ఉంది. రోజూ సగటున 25 వేల మంది యాత్రికులు శ్రీశైలం వస్తుంటారు. వారాంతంలో ఆ సంఖ్య 50 వేల నుంచి 60 వేల వరకు ఉంటుంది. అన్నదాన సత్రంలో కూడా నాలుగు వేల మందికి మాత్రమే అన్నప్రసాదాలకు ఆస్కారం ఉంది.
శ్రీశైలం ఎలా వెళ్లాలి...
కర్నూలు జిల్లా (ప్రస్తుతం నంద్యాల జిల్లా) పరిధిలో ఉంది. ఇదంతా నల్లమల అటవీ ప్రాంతం. కర్నూలు నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టు ఘాట్ రోడ్డులో ప్రయాణం సాగుతుంది. హైదరాబాద్ నుంచి జాతీయ రహదారి 765లో 213 కిలోమీటర్లు ఉంటుంది. గుంటూరు నుంచి 225 కిలోమీటర్లు. నరసరావుపేట, వినుకొండ, మీదుగా సాగే ఈ మార్గంలో శ్రీశైలం ఘాట్ రోడ్డు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల నుంచి ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి దట్టమైన అడవి, ఘాట్ రోడ్డులోొ 53 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీశైలం చేరవచ్చు. అయితే అడవిలో వన్యమృగాల సంచారం ఎక్కవగా ఉండడం వల్ల రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు టోల్ గేట్లు మూసి వేస్తారు. పగలు మాత్రమే ప్రయాణానికి వీలు ఉంటుంది.
పర్యాటకులకు ఆహ్లాదం
శ్రీశైలం, సమీప ప్రాంతాల్లో దాదాపు 500 వందల వరకు శివలింగాలు పూజలు అందుకుంటాయి. మల్లన్న ఆలయంతో పాటు దేశంలోని అన్ని మఠాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీశైలం వద్ద చూడదగిన పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు కొదవలేదు. అందులో ప్రధానంగా శివమల్లికార్జు దేవాలయం, శ్రీభ్రమరాంబదేవి ఆలయం, ఆక్టోపస్ వ్యూ పాయింట్, శ్రీశైలం డ్యాం ఆనకట్ట, అక్కమహాదేవి గుహలు, పాతాళగంగ, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం, ఇష్టకామేశ్వరి దేవి ఆలయం, పాలధార పంచదార వంటి ప్రదేశాలు యాత్రికులతో పగలంతా రద్దీగా ఉంటాయి. పాతాళగంగ వద్దకు వెళ్లడానికి అందుబాటులోని రోప్ వేలో డ్యాం నీటి మట్టం వద్దకు చేరవచ్చు. ఈ ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. జలాశయం నీటిలో కూడా బూట్లలో షికారు చేయవచ్చు.
శ్రీశైలం దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా ఉమ్మడి కడప జిల్లా రాజంపేటకు చెందిన పోతుకుంట రమేష్ నాయుడు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మరో 16 మంది సభ్యులు కూడా పాలకమండలి సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందే.. శ్రీశైలంలో గుర్తించిన సమస్యలు, తీసుకురావాల్సిన సంస్కరణలు, యాత్రికులకు కల్పించాల్సిన వసతి ఏర్పాట్లపై శ్రీశైలం ట్రస్టు బోర్డు చైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ ఏమన్నారంటే..
శ్రీశైలం ట్రస్టు బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు
"తిరుమల తరహాలో శ్రీశైలం మల్లన్న ఈష్టాదశ శక్తిపీఠంలో సత్రాల నిర్మాణం తోపాటు అన్నదాన సత్రంలో ఎక్కువ మంది ఆకలి తీర్చేందుకు బాధ్యతలు చేపట్టడానికి ముందే చేసిన అధ్యయనంలో సమస్యలు గుర్తించాను. కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే యాత్రికులు ఆరుబయట సేదదీరడం కూడా గమనించడం వల్లే, వసతి సమస్య తీర్చడానికి అధికారులతో సమీక్షించి, నిర్ణయాలు తీసుకుంటా" అని రమేశ్ నాయుడు చెప్పారు.
యాత్రికుల సదుపాయాలు
శ్రీశైలంలో యాత్రికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి తిరుమల లో అమలు చేసిన సంస్కరణలు పాటిస్తానని రమేష్ నాయుడు చెప్పారు. తిరుమలలో శ్రీవారి సేవా కార్యక్రమాల్లో వేకుజామున అభిషేకం నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి యాత్రికులు తహతహలాడుతారు. అదే తరహాలో.. శ్రీశైలంలో స్పర్శ దర్శనానికి అంత ప్రాధాన్యత ఉంది. ఈ సేవా కార్యక్రమాలను సామాన్య యాత్రికుడికి దక్కే విధంగా తన పనితీరు ఉంటుందని రమేష్ నాయుడు చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.
"శ్రీశైలం అటవీ ప్రాంతంలో సుమారు 17 పైగానే చెంచు గూడేలు ఉన్నాయి. వారంలో ఒకరోజు ఆ చెంచులకు స్పర్శ దర్శనం కల్పించడానికి శ్రద్ధ తీసుకుంటా. శ్రీశైలం మల్లన్న ఉత్సవమూర్తులతో చెంచుగూడాల్ల ఉత్సవాలు నిర్వహించడానికి కార్యాచరణ అమలు చేస్తా" అని రమేష్ నాయుడు తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు.
అన్నదానంపై దృష్టి..
శ్రీశైలంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదానంలో ఆహార పదార్థాల నాణ్యత మరింత పెంచడానికి శ్రద్ధ తీసుకుంటానని చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు చెప్పారు.
"ప్రస్తుతం తక్కువ మందికే అన్నదానం అందుబాటులో ఉంది. ఈ సంఖ్య పెంచడానికి మరింత చొరవ తీసుకుంటా. శ్రీశైలంలో వందకు పైగానే చిన్న పెద్ద హోటలు ఉన్నాయి. సామాన్య యాత్రికులకు మంచి భోజనం. ఉదయం సాయంత్రం వేళలో అల్పాహారం అందించే విధంగా మెనూ అమలు చేయడానికి ప్రయత్నిస్తా" అని రమేష్ నాయుడు చెప్పారు.
తిరుమల తరహా లోని శ్రీశైలంలో కూడా స్వచ్ఛంద సేవకుల సేవలను వాడుకుంటున్నారు. వారికి అక్కడ సరైన వసతి లేదు. రెండు డార్మెటరీల్లో వసతి అందుబాటులో ఉంది. ఈ అంశంపై రమేష్ నాయుడు మాట్లాడుతూ,
"మల్లన్న స్వచ్ఛంద సేవకులకు శాశ్వత భవనం అందుబాటులోకి తీసుకుని వస్తా. స్వచ్ఛంద సేవకు వచ్చేవారు దరఖాస్తు చేసుకునే విధానాన్ని కూడా ఆన్లైన్ చేయిస్తా.. దీనితోపాటు ఆలయం, దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల జారీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా అవినీతికి ఆస్కారం లేని విధంగా చర్యలు తీసుకుంటారు" అని రమేష్ నాయుడు చెప్పారు.
శ్రీశైలం దేవస్థానం ఆలయం వ్యవహారాలపై ఆయన మాట్లాడుతూ,
"అనేక వ్యవహారాలను చక్కదిద్దాల్సిన అవసరం ఏర్పడింది. శ్రీశైలం దేవస్థానం ఆధ్యాత్మిక కార్యక్రమాు విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రత్యేక ప్రజా సంబంధాల వ్యవస్థను పటిష్టం చేస్తా" అని రమేష్ నాయుడు చెప్పారు.
శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా యాత్రికులు వస్తుంటారు. దేవస్థానానికి సంబంధించిన అతిథి గృహాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల, ఆరు బయట ప్రమాదకరమైన వాతావరణంలో సేదదీరుతూ ఉంటారు. ఈ పరిస్థితిని నేను స్వయంగా గమనించాలని చైర్మన్ రమేష్ నాయుడు చెప్పారు. కర్ణాటకనే కాదు. ఎక్కడ నుంచి వచ్చిన యాత్రికులైనా సరే వారికి సరైన వసతి, అన్నదాన సత్రంలో మంచి భోజనం ఏర్పాటు చేసే దిశగా సంస్కరణలు అమలు చేసి తీరుతానని రమేష్ నాయుడు స్పష్టం చేశారు.
కులానికో సత్రం..
శ్రీశైలం దేవస్థానానికి ఆదాయం ఎంత ప్రధానమూ.. యాత్రికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం కూడా ఉంతే ఉంది. శ్రీశైలంలో అన్నికులాలకు సంబంధించిన 70 వరకు సత్రాలు ఉన్నాయి. 1955కు పూర్వం ఆర్యవైశ్యులు, శ్రీవీరశైవ లింగాయితీసత్రం ఏర్పాటైంది. కర్ణాటక నుంచి వచ్చే యాత్రికులకు ఇవి ఆశ్రయం కల్పించాయి. ఆ తరువాత మెల్లగా సత్రాలు ఏర్పాటు చేస్తే వచ్చారు. ఇప్పుడు హిందూ మాల అన్నదాన సత్రంతో పాటు కరివేన బ్రాహ్మణ, రెడ్డి,కమ్మ, కాపు, గౌడ, క్షత్రియ, వెలమ, యాదవ, నాయీబ్రాహ్మణ, రజక, కరికాల, గాండ్ల, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, వీరశైవ శరణ బసవేశ్వర, దేవాంగ, కుమ్మరి, వాల్మీకి, (బోయ, ఉప్పర, ముదిరాజ్ కులాల సత్రాలు ఏర్పాడ్డాయి. వాటితో పాటు కార్పొరేట్ కంపెనీల అతిథి గృహాలకు కొదవ లేదు. ఇక్కడి అద్దెలు సామాన్య యాత్రికుడికి భారంగా ఉంటున్నాయి.
శ్రీశైలం దేవస్థానం సత్రాల వివరాలు వెబ్ సైట్లో కూడా అందుబాటులో ఉండకపోవడం, అక్కడికి వెళ్లినా, గదులు దొరకడం కష్టంగా మారుతోంది. దీనిపై శ్రీశైలం ట్రస్టు బోర్డు చైర్మన్ రమేశ్ ఏమంటారంటే..
"యాత్రికుల సంఖ్య పెరుగుతోంది. దేవస్థానం సత్రాలు పెంచాలి. సామాన్య యాత్రికుడికి మంచి వసతి కల్పించడమే మా ముందు ఉన్న కర్తవ్యం" qని స్పష్టం చేశారు. రెండేళ్ల వ్యవధిలో ఎలాంటి సంస్కరణలు తీసుకుని వస్తారనేది కాలమే సమాధానం చెప్పాలి.
Next Story