పెద్ద శేష వాహన సేవలో ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శన
x
బుధువారం రాత్రి 10.40 గంటలు. పెదశేషవాహనంపై శ్రీావారు.

పెద్ద శేష వాహన సేవలో ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శన

పెద్దశేష వాహనంపై శ్రీనివాసుడిసై శ్రీహరి విహారం. ఆకట్టుకున్న కళా బృందాలు.


పెద్ద శేష వాహన సేవలో ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శన. శ్రీవారి సన్నిధిలో భారత ఉపరాష్ట్రపతి


తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లో పెదశేషవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీవారు


తిరుమల శ్రీవేేంకటేశ్వరస్వామి ఆలయంలో భారత ఉపరాష్ట్రపతి రాథాకృష్ణన్

తిరుమల సాలకట్ల బ్రహ్మత్సవాలు బుధవారం రాత్రి పెదశేష వాహనంతో ప్రారంభమయ్యాయి. సప్తగిరి సార్వభౌముని సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి పెద్ద శేష వాహనంపై శ్రీనివాసుడు భక్తకోటిని అనుగ్రహిస్తూ మాడవీధులలో ఊరేగే సందర్భంగా 19 కళాబృందాలు స్వామివారి సేవలో తరించాయి.

తిరుపతికి చెందిన శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన మూడు కళా బృందాలు తమ కళారూపాలతో ఆహుతులను ఆకట్టుకున్నాయి. క్షీరసాగర మధనం రూపకం నయన మనోహరంగా సాగింది. తమిళనాడుకు చెందిన భరతనాట్యం, మహారాష్ట్ర నుండి గోంధాల్ నృత్యం ప్రదర్శించారు. గూడూరు శ్రీ సాయి నృత్య బృంద అకాడమీకి చెందిన శైలజా కుమారి బృందం ప్రదర్శించిన శ్రీనివాస కళ్యాణ ఘట్టం కనువిందు చేసినది.
అస్సాం రాష్ట్రానికి చెందిన జోయ్ దేవ్ దేఖా బృందం ప్రదర్శించిన బిహూ నృత్యం ఎంతో కమనీయంగా సాగింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రసూన్ బెనర్జీ ప్రదర్శించిన రవీంద్ర నృత్యం ప్రసిద్ధ కవి రవీంద్రనాథ ఠాగూర్ రచించిన నాటకాలు, కవితలు, పాటలు ఆధారంగా రూపొందించిన నృత్య రుపకం, భావ ప్రధానమైన కళారూపకం. బెంగాలీ సాంస్కృతిక కళావైభవానికి అద్దం పట్టే ఈ కళ ఎంతో మనోహరంగా సాగినది.
త్రిపురకు చెందిన రాజ్ మోగ్ దీపపు నృత్యం, కడపకు చెందిన బ్రహ్మయ్య బృందం ప్రదర్శించిన కోలాటం, విశాఖపట్నానికి చెందిన కె.సునీత బృందం ప్రదర్శించిన దైవకోల, తెలంగాణకు చెందిన శ్రీ గౌరవి రెడ్డి బృందం ప్రదర్శించిన దశావతార ఘట్టం భక్తులను మంత్రముగ్ధులను చేసింది,
మహారాష్ట్ర కు చెందిన శ్రీ తరుణ శేఖర్ బృందం ప్రదర్శించిన కథక్ నృత్యం, కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ దర్శిని మంజునాథ్ ప్రదర్శించిన మోహిని అట్టం నృత్యం, పశ్చిమగోదావరికి చెందిన త్రిమూర్తులు బృందం ప్రదర్శించిన కోలాట నృత్యం, కడపకు చెందిన శ్రీ బాబు బృందం ప్రదర్శించిన డ్రమ్ముల విన్యాసం, హైదరాబాద్ కు చెందిన శ్రీమతి రేణుక ప్రభాకర్ బృందం ప్రదర్శించిన కాళింగ నృత్యం, కేరళకు చెందిన అభిషేక్ బృందం ప్రదర్శించిన కథాకళి, పుదుచ్చేరికి తిరుమరుగన్ బృందం ప్రదర్శించిన కరఘట్టం, ఎంతో ఉత్సాహభరితంగా నేత్రపర్వంగా సాగింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, అస్సాం, త్రిపుర, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల నుండి 19 కళాబృందాలు 472 మంది కళాకారులు పాల్గొన్నారు

శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి


ఉప రాష్ట్రపతి సి. పి.రాధాకృష్ణన్ బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు సీఎం నారా చంద్రబాబు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.

ఉప రాష్ట్రపతి సి. పి.రాధాకృష్ణన్ ను స్వాగతించిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి, శ్రీవారి దర్శనం ఏర్పాట్లు చేశారు.


ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత సి. పి.రాధాకృష్ణన్ మొదటిసారి రాష్ట్ర పర్యటనకు వచ్చారు. శ్రీవారి ఆలయంలో ఆయన ధ్వజస్థంభానికి మొక్కుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.

Read More
Next Story