శ్రీహరికోట: నింగిలోకి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్
x

శ్రీహరికోట: నింగిలోకి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్

కమ్యూనికేషన్, నావిగేషన్, రక్షణ వ్యవస్థలకు కీలక ప్రయోగమన్న ఇస్రో చైర్మన్ నారాయణన్.


తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు బాహుబలి రాకెట్ విజయవంతంగా ప్రయోగించారు. ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు నిప్పులు చెరుగుతూ, నింగిలోకి దూసుకెళ్లింది.

శ్రీహరికోట నుంచి LVM-03-M-5 రాకెట్ ప్రయోగించింది. 4,410 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలో నిలపడం ద్వారా దేశంలో కమ్యూనికేషన్, నావిగేషన్, రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి ఈ రాకెట్ విస్తృతంగా సేవలు అందించనుంది. ఈ రాకెట్ ప్రయోగానికి ముందు శనివారం కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
భారత అంతరిక్ష ప్రయాణంలో ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన ఒక మైలురాయి. ఈ ప్రయోగాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ ప్రయోగం వల్ల దేశీయ సాంకేతికతతో పాటు కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగుపడతాయి. జాతీయ భద్రతలో కీలకంగా అంతరిక్షం నుంచి నిఘా మరింత పటిష్టం చేయడంలో ఈ శాటిలైట్ కీలకంగా మారనుంది.
చంద్రయాన్ 3 మిషన్ కు వాడిన రాకెట్ తోనే ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేశారు. బాహుబలి అనే పేరు ఉన్న ఈ రాకెట్ ద్వారా భూస్థిర కక్షలో ప్రవేశపెట్టడానికి ఈ రాకెట్ ప్రయోగించారు. దీనిని జిఎస్ఎల్వి మార్క్-3 (GSLV Mark-3) గా కూడా పిలుస్తున్నారు.
హిందూ మహాసముద్రం పై కమ్యూనికేషన్ సేవలను మరింత పటిష్టం చేసే దిశగా సి ఎం ఎస్ త్రి ఒక మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది భారత భూభాగంతో పాటు విస్తారమైన సముద్ర తీర ప్రాంతాలకు కమ్యూనికేషన్ సేవల అందిస్తుంది. సముద్ర యానంలో రక్షణ శాఖ నేవీ నిఘా అవసరాలకు కూడా ఈ ఉపగ్రహం విస్తృతంగా సేవలు అందిస్తుంది.
సుళ్లూరుపేట సమీపంలోని శ్రీ శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి అనేక రాకెట్ను ప్రయోగించారు. అందులో జీ సాట్ 11 అత్యంత బరువైన ఉపగ్రహం 5, 854 కిలోల బరువు ఉంది. ఆ తర్వాత 2018లో ఫ్రెంచ్ గయానా నుంచి విదేశీ రాకెట్ ద్వారా కూడా ప్రయోగించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపిన రాకెట్ ప్రయోగాల్లో సిఎంఎస్03 అత్యంత బరువైనది. ఇది 4000 కిలోల బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఎల్విఎం 3 రాకెట్ తో ఇస్రో పూర్తి స్వయం సమృద్ధి సాధించే దిశగా, ఆదివారం సాయంత్రం ఈ రాకెట్ను ప్రయోగించింది.
ఎల్బీఎం 3 రాకెట్ తోనే గత సంవత్సరం చంద్రయాన్ 3 మిషన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నింగిలోకి. పంపించారు. ఇదే తరహా రాకెట్తో సాటిలైట్ నింగిలోకి పంపించడంలో ఇది ఐదోసారి.
Read More
Next Story