Tiruchanuuru | సిరుల‌త‌ల్లి మెడలో ఒదిగిన ఏడురకాల పూలమాలలు
x
తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో స్పపనం నిర్వహిస్తున్న అర్చకులు

Tiruchanuuru | సిరుల‌త‌ల్లి మెడలో ఒదిగిన ఏడురకాల పూలమాలలు

పద్మావతీ అమ్మవారికి స్నపనం తరువాత పూలదండల చిత్రాలు చెప్పేకథ..


తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి బుధవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తరువాత అమ్మవారికి ఉత్సవమూర్తికి అలంకరించిన పూలమాలలు మరింతగా ఆకట్టకున్నాయి.

అమ్మవారికి అలంకరించిన రంగురాళ్ల పూలమాల

అమ్మవారికి రంగురాళ్ల మాల

అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్వహించారు.


ఎలా చేశారంటే..


పద్మావతీ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి స్నపన తిరుమంజనం నిర్వహించడానికి ముందు విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవ కలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. ఆ తరువాత ఛత్రచామర, వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం సమర్పించారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధం మిశ్రమంతో కలిపిన ద్రవంతో అమ్మవారి విగ్రహానికి స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను నిర్వహించారు.
ఏడు ర‌కాల మాల‌లు

పద్మావతీ అమ్మవారి విగ్రహానికి స్నపన తిరుమంజనం చేసిన వేదపండితులు తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీప్రశ్న సంహిత మంత్రాలను పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక పూలమాల వంతున ఏడు రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు.

అందులో నెమ‌లి ఈక‌ల మాల‌, ద్రాక్ష‌, రోజ్ పెటల్స్, వ‌ట్టి వేరు, తులసి

రోజా పూలమాలలు

అమ్మవారి విగ్రహానికి అలంకరించిన వట్టి వేరుతో తయారు చేసిన పూలమాల



శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజమండపం, గర్భాలయం, శ్రీకృష్ణస్వామివారి ఆలయం, శ్రీ సుందరరాజస్వామివారి ఆలయం, వాహనమండపం, ఆస్థానమండపం టీటీడీ గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.

గార్డ‌ెన్ డిప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో దాదాపు 80 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి సుందరంగా అలంకరించారు.
Read More
Next Story