Exclusive - Red sandal |గుజరాత్‌లో ఏపీ టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు..
x

Exclusive - Red sandal |గుజరాత్‌లో ఏపీ టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు..

గుజరాత్ లో ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.


తిరుపతి ఆంధ్రప్రదేశ్ రెడ్ శాండర్స్ ఏంటి స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (Andhra Pradesh red Sanders aunty smuggling task force- Rsastf) గుజరాత్ తో మెరుపు దాడి చేసింది. ఐదు కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను కూడా అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ షరీఫ్ సారధ్యంలో ఈ ఆపరేషన్ జరిగింది.

రాష్ట్ర సరిహద్దులు దాటిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడమే కాదు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ తిరుపతి ఎర్రచందనం అక్రమ రమణా నివారణ విభాగం టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించనున్నారు.
సాహసమే..

వాస్తవానికి ఇది సాహసోపేతమైన ఆపరేషన్ గానే చెప్పవచ్చు. అధికారికంగా వెలవడాల్సిన ఈ వివరాలు తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇక్కడ ప్రత్యేకత.
"తిరుపతి టాస్క్ ఫోర్స్ ప్రతినిధిని సంప్రదిస్తే.. ఎర్రచందనం అక్రమ రమణా చేసి గుజరాత్ లో నిలువ ఉంచారనే సమాచారం అందింది వాస్తవమే. తిరుపతి నుంచి టాస్క్ ఫోర్స్ డిఎస్పీ సారాధ్యంలో ఓ బృందం అక్కడికి వెళ్ళింది" అని ఆ ఆయన ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి స్పష్టం చేశారు.
ఇక్కడ ప్రధానంసం ఏమిటంటే, అధికారిక సమాచారం అధికారుల నుంచి కాకుండా అధికార టిడిపి ఫేస్బుక్ సైట్లో ప్రత్యక్షం కావడమే. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
తిరుపతి పరిసర ప్రాంతాల్లోని శేషాచలం అడవులను స్మగ్లర్లు కొల్లగొడుతున్నారు. ఈ పరంపరలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన స్మగ్లర్లు ఇక్కడి నుంచి ఎర్రచందనం దుంగలు రవాణా చేసి నిలువ ఉంచినట్లు, తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ రెడ్ సాండర్స్ అండ్ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (Rsastf) యూనిట్కు పక్కా సమాచారం అందింది.
గుజరాత్ కు టాస్క్ ఫోర్స్ టీం
తిరుపతి నుంచి అక్రమంగా రవాణా చేసిన ఎర్రచందనం దొంగలు నిలువ ఉంచిన సమాచారం అందింది. దీంతో తిరుపతి టాస్క్ ఫోర్స్ డిఎస్పి షరీఫ్ నేతృత్వంలో ఆర్ఎస్ఐ వినోద్ కుమార్, మరో కానిస్టేబుల్ గుజరాత్ కు వెళ్ళింది. ఆ రాష్ట్రంలోని పటాన్ జిల్లా పోలీసుల సహకారం తీసుకున్నారు. ఎర్రచందనం నిలువ ఉంచిన గోడౌన్ వద్దకు చేరుకున్న డిఎస్పి షరీఫ్ సారథ్యంలోని పోలీస్ బృందం ఆకస్మికంగా దాడి నిర్వహించింది.
ఐదు కోట్ల విలువ రక్తచందనం
అక్కడ నిలువ ఉంచిన 1505 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు సుమారు ఐదు టన్నులు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఎర్రచందనం దొంగల విలువ ఐదు కోట్లు ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆధార రెట్టింపు ఉంటుందని టాస్క్ ఫోర్స్ అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. ఈ దొంగలతోపాటు అక్కడ ఉన్న స్మగ్లర్లలో దిశా ప్రాంతానికి చెందిన ఉత్తంకుమార్ నందకిషోర్ సోనీ, జిల్లా కేంద్రమైన పటాన్ కు చెందిన జోషి, ఇదే ప్రాంతానికి చెందిన ఠాగూర్ పరేష్ జి అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి ఒక టయోటా బెజ్జా కారు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ట్రాన్సిట్ వారెంట్ కోసం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, వారెంట్ తీసుకున్న తర్వాత వారిని తిరుపతికి తీసుకురానున్నట్లు సమాచారం. అలాగే స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు సామాగ్రి కూడా తరలించి, ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న ప్రధాన వ్యక్తుల కోసం విచారణ జరపనున్నట్లు డిఎస్పి షరీఫ్ స్పష్టం చేశారు.
టిడిపి సైట్ లో..

ఏదన్నా అధికారిక సమాచారం ఆ విభాగం అధికారుల ద్వారా మీడియాకు అందిస్తారు. సాధారణంగా ట్రాన్స్ఫోర్స్ దాడులు నిర్వహించిన సమయంలో కూడా విచారణ పూర్తయిన తర్వాత ఆ శాఖ ఎస్పీ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడిస్తూ ఉంటారు. అయితే, గుజరాత్లో ఎర్రచందనం దుంగలు స్వాధీనం స్వాధీనం చేసుకున్న వ్యవహారం టాస్క్ ఫోర్స్ నుంచి కాకుండా, టిడిపి సోషల్ మీడియా సైట్లో ప్రత్యక్షం కావడం ప్రస్తావనార్హం.
Read More
Next Story