టిప్పర్ కింద నలిగిన ఆరుగురి ప్రాణాలు..
x

టిప్పర్ కింద నలిగిన ఆరుగురి ప్రాణాలు..

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.


నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం ఆరుగురు మరణించారు. ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం అందింది. మితిమీరిన వేగంతో రాంగ్ రూట్లో వచ్చిన ఓ టిప్పర్ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. దీంతో ఆ చిన్న కారు టిప్పర్ కిందికి దూసుకుపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఇది. ఆ వివరాలు ఇవి.

నెల్లూరు జిల్లా సంఘం మండలం పెనమన గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. నెల్లూరు నుంచి ఆరుగురు కారులో కడపవైపు బయలుదేరారు. వారిలో ఓ పసిపాప కూడా ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. నెల్లూరు నుంచి ఉదయమే బయలుదేరిన ఆ బృందం జాతీయ రహదారిపై పెనమన గ్రామానికి సమీపంలో ప్రయాణిస్తుండగా ఎదురుగా టిప్పర్ రూపంలో మృత్యువు తారసపడింది.

రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతోనే కారు నుజ్జుగా మారింది. కారులోని ఆరుగురు అక్కడికక్కడే మరణించినట్లు స్థానికుల కథనం. గ్రామానికి సమీపంలో జరిగిన ప్రమాదం చూసి రోడ్డు పక్కన ఉన్నవారు ఉలిక్కిపడ్డారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి ఉరుకుల పరుగుల పైన ప్రమాద స్థలానికి చేరుకున్నారు అని తెలిసింది. వేగంగా టిప్పర్ ఢీకొనడంతో ఆ ధాటికి కారులోని వారందరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలినట్లు తెలిసింది. ప్రమాదం జాతీయ రహదారిపై జరగడంతో వెంటనే సమాచారం అందుకున్న సంఘం మండల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతులు నెల్లూరు వాసులే

నెల్లూరు నగరం ముత్తుకూరు గేట్ ప్రాంతానికి చెందిన గుర్రంవీధికి చెందిన వారు ఈ ప్రమాదంలో మరణించినట్లు గుర్తించారు. మృతుల్లో కారు డ్రైవర్ తో పాటు తాళ్లూరు రాధ (28 ), శ్రీనివాసులు (40 ), సారమ్మ (40 ), వెంగయ్య (45 ), లక్ష్మి (30 ) ఉన్నట్లు పోెలీసుల ద్వారా తెలిసింది.

Read More
Next Story