
వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి (ఫైల్)
రెండు నెలలుగా అజ్ఞాతం.. వైసీపీ మాజీ మంత్రి 'కాకాణి' అరెస్ట్
వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి కాకాణిని కేరళలో అరెస్టు చేశారు. వివరాలతో బులెటిన్ విడుదలతో ఊహాగానాలకు తెరదించాలని మాజీ మంత్రి అనిల్ డిమాండ్ చేశారు.
నెల్లూరుకు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి క్వార్జ్ (Quartz) అక్రమంగా రవాణా చేసినట్లు కేసు నమోదైంది. దీంతో రెండు నెలలుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసులు జారీ చేసిన నోటీసులకు స్పందించకపోవడం, అరెస్టు నుంచి మినహాయించడానికి హైకోర్టు, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయన ఆచూకీని నెల్లూరు పోలీసులు తెలుసుకున్నట్లు కనిపిస్తోంది. వివరాలు చెప్పడానికి నెల్లూరు జిల్లా పోలీసులు నోరు మెదపడం లేదు.
వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అరెస్టు కావడంలో నాటకీయత ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టు తప్పదనే నేపథ్యంలోనే ఆయన పోలీసులకు చిక్కడం వెనుక ఆంతర్యం ఏమిటనేది పోలీసులే చెప్పాలి.
మాజీ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి అరెస్టు అయ్యారా? అనే విషయంపై పొదలూరు సీఐ ఏఎస్ఆర్కే. రెడ్డి స్పందించడానికి సుముఖత చూపలేదు. "నాకు ఈ విషయం తెలియదు" అని మాత్రమే చెప్పారు. వాస్తవానికి మాజీ మంత్రి కాకాణిపై పొదలకూరు పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదు కావడం గమనార్హం.
కేరళలో ఉండగా, కాకాణి పోలీసులకు చిక్కినట్లు చెబుతున్నారు. బెంగళూరులో ఉండగానే అదుపులోకి తీసుకున్నట్లు నెల్లూరు నుంచి అందిన సమాచారం. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిన తరువాతి నుంచి నెల్లూరుకు చెందిన ఏడు పోలీస్ బృందాలు గాలిస్తున్నట్లు తెలిసింది.
ఈ ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ చేసినా నెల్లూరు జిల్లా ఎస్పీ జీ. కృష్ణకాంత్ స్పందించలేదు.
బులెటిన్ విడుదల చేయండి వైసీపీ
మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని అరెస్టు చేశారా? లేదా? చేసి ఉంటే కోర్టులో ఎప్పడు హాజరు పరుస్తారు? అనే వివరాలు వెల్లడించాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదివారం రాత్రి 10 గంటలకు నెల్లూరులో వైసీపీ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం విజయకుమార్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంఎల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
"అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టలేరు. మాజీ మంత్రి కాకాణి గోవర్ణనరెడ్డిని ఎక్కడ అరెస్టు చేశారు" అనే విషయాలు వెల్లడించాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు ఎస్పీని కోరారు. మీడియాలో విభిన్న కథనాలు వస్తున్నాయి. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి కాకాణి అరెస్టు వార్తల నేపథ్యంలో పొదలకూరు మార్గంలోని వైసీపీ జిల్లా కార్యాలయానికి ఆ పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నట్లు సమాచారం అందింది.
ఫిర్యాదు ఇదీ..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నులకొద్దీ క్వార్జ్ ఖనిజాన్ని తరలించారు అనేది మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై ఉన్న అభియోగం. మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మైనింగ్ చేయడానికి అనుమతులు లేకుండానే పేరుడు పదార్థాలు కూడా వినియోగించాలని నాయక్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. మైనింగ్ జరగకుండా ప్రశ్నించిన గిరిజనులు కూడా బెదిరించారన్నారు. ఈ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నారు.
అజ్ఞాతంలోకి..
ఈ కేసు నమోదు అయ్యే నాటికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అక్రమ క్వార్జ్ తరలింపు కేసు సీరియస్ అయింది. దీంతో ఆయన హైదరాబాదులోని నివాసానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత మూడు నెలలుగా ఆయన ఎక్కడ ఉన్నారనేది కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు పై విచారణకు రావాలని నోటీసులు కూడా ఆయన కుటుంబసభ్యలకే కాకుండా, అక్కడి నివాసానికి కూడా అంటించారు. హైదరాబాద్, సర్వేపల్లి నియోజకవర్గంలో నివాసాల వద్ద కాకాణి గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించారు.
లుకౌట్ నోటీసులు
క్వార్జ్డ్ అక్రమ తరలింపుతో పాటు ఇంకొన్ని కేసుల్లో నిందితుడుగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారణకు రావాలని పోలీసులు పదే పదే కోరారు. ఇళ్లకు నోటీసులు కూడా అందించారు. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి కాకాణి విదేశాలకు పారిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం లుక్ అవుట్ (Look out) నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో ఆయన ఇటు నెల్లూరులో కనిపించకుండా, హైదరాబాద్ నివాసంలో కూడా లేకుండా పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్నట్లు సమాచారం.
ముందస్తు బెయిల్ నిరాకరణ
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అక్రమ క్వార్జ్డ్ ఖనిజం తరలింపు కేసులో నుంచి మినహాయించాలని మాజీ మంత్రి కాకాణి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి కూడా ఏపీ హైకోర్టు తాజాగా తిరస్కరించింది.
అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని మాజీ మంత్రి కాకాణి అభ్యర్థనను హైకోర్టు ఏప్రిల్ 10వ తేదీనే తిరస్కరించింది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కూడా సుప్రీం కోర్టు తాజాగా నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేరళలో ఉన్నట్లు ఏపీ పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు నెల్లూరుకు తీసుకు వస్తున్నట్లు సమాచారం.
కేసు ఇది..
నెల్లూరు జిల్లాలో లీజు ముగిసిన క్వార్జ్ తరలించారు అనేది మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై ఉన్న అభియోగం. ఇందులో 250 కోట్ల రూపాయల విలువైన కోఆర్జి తరలించారని మైనింగ్ అధికారులు గుర్తించారు పోలీసులకు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇందులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ-4గా ఎఫ్ఐఆర్లో చేర్చి, 120 బి, 129, 220, 447, 427, 379, 506 సెక్షన్లతో పాటు అక్రమంగా పేలుడు పదార్థాలు కూడా వాడారనే ఆక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు.
ఈ కేసులో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన శ్యాం ప్రసాద్ రెడ్డి ఏ1, ఎ-2గా వాకాటి శివారెడ్డి, ఏ-3గా వాకాటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, ఈ కేసులో ఏ-6, ఏ-8 నిందితులుగా ఉన్న ఇద్దరినీ ఏప్రిల్ నెలలోనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత వారిద్దరి తోపాటు శ్యాంప్రసాద్ రెడ్డికి కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
భయపడేది లేదన్నారు
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసిపి నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత క్వాడ్చి ఖనిజం అక్రమ తరలింపు పై ఆరోపణల వెల్లువ నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన మాజీ మంత్రి కాగానే గోవర్ధన్ రెడ్డి సుమారు మూడు నెలలుగా ఆచూకీ తెలియలేదు.
ఎట్టకేలకు మూడు నెలల తర్వాత వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేరళలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనను సోమవారం కోర్టులో హాజరు పరుస్తారనేది విశ్వసనీయ సమాచారం.
Next Story