
చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం
ప్రతి నియోజకవర్గంలో ఒక జూనియర్ కాలేజీ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించిన మంత్రి నారా లోకేష్
చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు.
ప్రశ్న: గత ఏడాది నవంబర్ లో గురజాల ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఈ మేరకు ప్రభుత్వానికి లేఖరాశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా విభజన తర్వాత చిత్తూరు జిల్లా పరిధిలో ప్రభుత్వ రంగంలో ద్రవిడియన్, ప్రైవేటురంగంలో అపోలో వర్సిటీలు ఆ జిల్లా పరిధిలో ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ లేదా ప్రైవేటు వర్సిటీ ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు.
మంత్రి సమాధానం : చిత్తూరు జిల్లా కుప్పంలో ద్రవిడియన్ వర్సిటీ ఉన్నప్పటికీ అది లాంగ్వేజ్ స్పెసిఫిక్ వర్సిటీ, కలసికట్టుగా పనిచేసి, చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటుచేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు.