
రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి లోకేష్ కు స్వాగతం పలుకుతున్న కలెక్టర్ వెంకటేశ్వర్
సత్యవేడు:టీడీపీలో కొట్లాట.. రంగంలోకి లోకేష్
ఈ సమావేశానికి ఎమ్మెల్యేను దూరంగా ఉంచారు. కొద్దిసేపటి కిందట నాయకులతో లోకేష్ భేటీ అయ్యారు. రేపు శ్రీసిటీలో ఎల్జీ పరిశ్రమ శంకుస్థాపన చేస్తారు.
జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం టిడిపిలో కలహాలను చక్కదిద్దడానికి మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు.
తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, టిడిపి జిల్లా అధ్యక్షుడు గొల్ల నరసింహ యాదవ్, నాయకులు స్వాగతం పలికారు. గురువారం ఆయన సత్యవేడు శ్రీసిటీలో ఎల్జీ పరిశ్రమ 5, కోట్ల పెట్టుబడితో దేశంలో ప్రారంభించనున్న మూడో యూనిట్ కు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.
ఎమ్మెల్యే లేకుండానే నేతలతో భేటీ
సత్యవేడు నియోజకవర్గంలో పార్టీలో అంతర్గత కలహాలను చక్కదిద్దడానికి మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారని పార్టీ వర్గాల సమాచారం. ఈ నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విజయం సాధించారు.
టిడిపి నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ను కార్యకర్తల సమావేశానికి దూరంగా ఉంచారు. రాసలీల వ్యవహారం నేపథ్యంలో ఓ మహిళ చేసిన ఆరోపణలతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ను కొన్ని నెలల కిందట పార్టీ నుంచి సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిన విషయం తెలిసిందే. కోర్టులో ఈ కేసును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాజీ కుదుర్చుకున్నారు. ఇది జరిగి నెలల కాలం అవుతున్న, ఎమ్మెల్యే పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయలేదు.
ఈ పరిస్థితుల్లో సత్య వేడులోని వారపు సొంత మైదానంలో టిడిపి నియోజకవర్గ క్రియాశీల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి నారా లోకేష్ స్వయంగా హాజరయ్యారు. పార్టీలో అంతర్గత కలహాలను చక్కదిద్దడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా,
అధికారం కోసం ఆరాటం
సత్యవేడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా చంద్రశేఖర్ నాయుడు వ్యవహరిస్తున్నారు. ఈ నియోజకవర్గ నుంచి ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, అధికారం కోసం ఆదిపత్య పోరాటం సాగుతోంది. తాను చెప్పిందే జరగాలని చంద్రశేఖర్ నాయుడు మొదటినుంచి పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. అందుకు ప్రధాన కారణం వైసీపీ నుంచి టికెట్ నిరాకరించిన నేపథ్యంలో మీటింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టిడిపిలో చేతులు ఎమ్మెల్యేగా గెలిచారు.
అప్పటినుంచి తన వెంట వచ్చిన వైసీపీ నాయకులకే కాంట్రాక్టు పనులు కేటాయిస్తున్నారని ఆయన పై ఉన్న అభియోగం.
ఈ పరిస్థితుల్లో..
నియోజకవర్గంలోని బి ఎన్. కండ్రిక, వరదయ్యపాలెం, కే వి బి పురం మండలాల నాయకులు ఎవరికి వారు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈయనకి తోడు మాజీ ఎమ్మెల్యే హేమలత కూడా తన వర్గం నాయకులతో కలిసి పట్టుకోవటం ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా దున్నట్లు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీబీ నాయుడుకు సత్యవేడు నియోజకవర్గంలోని 6 మండలాల్లో మూడు మండలాల ఓటర్లను ప్రభావితం చేసే సామర్థ్యం ఉంది. దీంతో ఆయన కూడా తన బలం సంవత్సరానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
నీ పరిస్థితిలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ, సత్యవేడు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విజయం సాధించిన, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో తీవ్ర అగాధం ఏర్పడింది.
టిడిపి సభ్యత్వం చేయించడంలో ప్రతిభ చాటిన నాయకులను అభినందించే పేరిట, బుధవారం కార్యకర్తల సమావేశంలో నష్ట నివారణ కోసమే సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
మంత్రి నారా లోకేష్ గాయకల్ప చికిత్స ఎంత మేరకు పని చేస్తుందనేది వేసి చూడాలి.
శ్రీ సిటీలో రూ. 5 కోట్లతో ఎల్జీ పరిశ్రమ
శ్రీసిటీలో ప్రారంభించనున్న ఎల్ జీ పరిశ్రమకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ముందస్తు ఏర్పాటను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం పరిశీలించారు.
ఎల్ జి కంపెనీ రేపు సుమారు 5 వేల కోట్ల రూపాయల పైబడిన పెట్టుబడితో దేశంలో తన మూడవ యూనిట్ ను శ్రీ సిటీలో ఏర్పాటు చేయనున్నది . ఇక్కడ ఏర్పాటు
శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి, ఎల్జీ కంపెనీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
Next Story