సత్యసాయి శతజయంతి కానుక.. గిరిజన మహిళా ఆరోగ్య రక్షణ
x
పుట్టపర్తి సత్యసాయి శతజయంతి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ట్రస్టు సభ్యులు

సత్యసాయి శతజయంతి కానుక.. 'గిరిజన మహిళా ఆరోగ్య రక్షణ'

పుట్టపర్తిలో లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు.


పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో గిరిజనుల ఆరోగ్య రక్షణకు ఆ ట్రస్టు కానుక ఇచ్చింది. సత్యసాయి ఆధ్యాత్మిక సందేశాన్ని విశ్వవ్యాపితంగా ప్రచారం చేసేందుకు శ్రీసత్యసాయి గిరిజన మహిళా ఆరోగ్య సంరక్షణ ప్రోగ్రాం ( Tribal Women's Health Care Program) కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. శ్రీసత్యసాయి యూనివర్సల్ టార్చ్ ఆఫ్ పీస్ టార్చ్ (Sri Sathya Sai Universal Torch of Peace Torch ) వెలిగించారు.


విశ్వప్రశాంతి నిలయం పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రశాంతి నిలయాన్ని సందర్శించి, సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆమె వెంట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రెండు కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు.
పుట్టపర్తిలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తోపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, శ్రీసత్యసాయి సెంట్రల్ టెస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్, గ్లోబల్ సత్యసాయి ట్రస్ట్ అధ్యక్షులు నిమీష్ పాండ్య తదితరులు హాజరయ్యారు.
రాష్ట్రపతికి స్వాగతం..

సత్యసాయి జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం ఆయన పుట్టపర్తికి చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పుట్టపర్తి విమానాశ్రయంలో తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఘనంగా స్వాగతించారు. ఆ తరువాత రాష్ట్రపతి ముర్ముతో కలిసి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ హాలులో మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు శ్రీ సత్యసాయి సెంట్రల్ టెస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్.జె.రత్నాకర్, ట్రస్ట్ సభ్యులు స్వాగతించారు.
మానవసేవే మాధవ సేవ

మునుషులకు సేవ చేయడం అనేది కర్తవ్యంగా భావించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. ఇది మాధవ సేవ అవుతుందన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మొదట శ్రీసత్యసాయి యూనివర్సల్ టార్చ్ ఆఫ్ పీస్ టార్చ్ (Sri Sathya Sai Universal Torch of Peace Torch ) వెలిగించారు. శ్రీసత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ద్వారా ప్రపంచంలోని 140 దేశాలలో ఈ దివ్య జ్యోతితో సత్యసాయి ట్రస్టు ప్రతినిధులు, భక్తులు పర్యటిస్తారు. భగవాన్ శ్రీసత్యసాయి సూచించిన ఐక్యత, స్వచ్ఛత ,ఆధ్యాత్మిక సందేశాన్ని వ్యాప్తి చేయనున్నట్లు సత్యసాయి ట్రస్టు ప్రతినిధులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వివరించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ, ఏమన్నారంటే..
"సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాల్లో భాగం కావడం తనకు సంతోషం ఇచ్చింది" అన్నారు. 2023లో పుట్టపర్తిని సందర్శించిన అనుభవాలు పంచుకున్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ మరియు అహింస అనే ఆయన సార్వత్రిక ఆదర్శాలు మానవాళిని ఎలా నడిపిస్తున్నాయో ఆమె ప్రస్తావించారు. సత్యసాయి బోధించిన చూపిన బాటలో నిస్వార్థ ప్రేమ, సేవ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కరుణ మరియు ఐక్యత మార్గంలో నడవడానికి ప్రేరేపించాయని ఆమె నొక్కి చెప్పారు.
శాంతికి అంబాసిడర్లుగా ఉండాలి..

ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతూ, పుట్టపర్తిలో సత్యసాయి ట్రస్టుల ద్వారా విద్య, వైద్యం, ఆరోగ్యం, మంచినీటి కోసం బాబా స్ఫూర్తిని కొనసాగిస్తున్నారని అన్నారు.
పుట్టపర్తి సత్యసాయి ట్రస్టు ద్వారా శ్రీసత్యసాయి గిరిజన మహిళా ఆరోగ్య సంరక్షణ ( Tribal Women's Health Care Program) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, శాంతి సందేశం, మానవతకు సత్యసాయి అంబాసిడర్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యానించారు. సాయి భక్తులు ఆ స్ఫూర్తిని కొనసాగించడంలో మరింత చురుగ్గా సేవలు అందించాలని ఆయన సూచించారు. ఎవరినీ నొప్పించకుండా, సేవ చేయడంలో ఉన్న సంతృప్తిని ఎలా ఆస్వాదించాలనే విషయంపై ఆచరణాత్మక బోధన చేశారంటూ సత్యసాయి బాబాతో ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పంచుకున్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా అనే ఐదు సూత్రాల సత్యసాయి సిద్దాంతాలు పాటిస్తే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
"సత్యసాయి బాబా చెప్పిన సిద్దాంతాలు.. సూత్రాలను పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుంది. ఆంధ్రా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడానికి అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయి బాబా భావించారు" అని సీఎం చంద్రబాబు
గతాన్ని గుర్తు చేశారు. సత్యసాయి అభిప్రాయాన్ని తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగు నీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చారని చెబుతూ, ఆ సమయంలో తనతో సత్యసాయి పంచుకున్న భావాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
"ప్రాణాంతక రోగాల బారిన పడిన వారిని సత్యసాయి బాబా ట్రస్టు ఆదుకుంటోంది. మానవ సేవే... మాధవ సేవ అనే సిద్దాంతాన్ని సత్యసాయి బాబా ట్రస్ట్ అమలు చేసి చూపిస్తోంది" అని అన్నారు. ఈ రోజు సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రొగ్రాం ప్రారంభించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.
గిరిజనులంటే ప్రేమ..

సత్యసాయి ట్రస్టు ద్వారా ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రొగ్రాం ప్రారంభించడం వెనుక ఆసక్తికరమైన విషయాలను సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షులు నినేష్ పాండే వెల్లడించారు. ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయికి గిరిజన సమాజంపై ఉన్న ప్రేమగా అభివర్ణించారు.
ఆయన ఏమిచెప్పారంటే..
"సత్యసాయి వ్యక్తిగతంగా నీలగిరిని సందర్శించారు. మెరుగైన వ్యవసాయ పద్ధతులను పరిచయం చేశారు. తద్వారా గిరిజన మహిళలకు సాధికారత కల్పించారు" అని నినేష్ పాండే గుర్తు చేశారు. సత్యాసాయి తీసుకున్న చొరవ వల్ల అనేక తరాలను ఉద్ధరించే కరుణను ప్రదర్శించే కార్యక్రమంగా ఉంటుందని చెప్పారు. ఆ గిరిజన సంఘాలు భక్తి, కృతజ్ఞతకు చిహ్నంగా తమ వ్యవసాయ ఉత్పత్తులలో 10% ప్రేమతో భగవాన్ మిషన్‌కు అందిస్తున్నాయని ఆయన వివరించారు. దీంతో పాడేరు (విశాఖపట్నం), ఛత్తీస్‌గఢ్‌లోని శ్రీసత్యసాయి తాగునీటి ప్రాజెక్టుల అమలు చేస్తున్న విధాన్ని ఆయన ప్రస్తావించారు. సత్యసాయిట్రస్టు తీసుకున్న చొరవ వల్ల గిరిజన జీవితాలను మార్చిన సంతృప్తి మాకు సత్యసాయికి మిగిలిందన్నారు. వేలాది మంది గిరిజన గ్రామస్తులకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా సత్యాసాయిప్రేమకు శాశ్వత చిహ్నంగా మార్చామన్నారు.
ఒడిశా ప్రేరణ

శాంతికి అత్యున్నత నిలయం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మభూమి కర్మభూమి అని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్. జె. రత్నాకర్ స్వాగతోపన్యాసంలో ప్రస్తావించారు. రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన మాట్లాడుతూ, భగవాన్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 225కి పైగా సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒడిశాలోని అద్భుతమైన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రేరణగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు.
Read More
Next Story