అనంతలో సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ సంబరం
x

'అనంత'లో సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ సంబరం

క్రీడాభిమానులకు మరో పండుగ వచ్చింది. ఆర్డీటీ స్టేడియంలో పోటీలు ఆడంబరంగా ప్రారంభమయ్యాయి.


అనంతపురం క్రీడాభినులకు మరో వేడుక తీసుకుని వచ్చింది. ఫుట్ బాల్ క్రీడా సంబరానికి వేదికైంది. 78వ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ - 2024 (Santosh Trophy Football Tournament) శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. అనంతపురంలోని ఆర్డీటీ (Rural Development Trust- RDT) స్టేడియంలో ఈ నెల 19వ తేదీ వరకు జరిగే ఫుట్ బాల్ జరిగే టోర్నమెంట్ లో రు జట్లు తలపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఫుట్ బాల్ అసోసియేషన్ (APFA) ఆతిధ్యమిస్తున్న ఈ టోర్నమెంట్ లో పాల్లొనడానికి దక్షిణాది రాష్ట్రాల్లోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, అండమాన్ అండ్ నికోబార్ దీవుల నుంచి ఫుట్ బాల్ మేటి క్రీడాకారులు హాజరయ్యారు.


అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జరిగే సంతోప్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి ముందుగానే జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లా అధికారులను సమన్వయం చేశారు. గతంలో కూడా ఇదే స్టేడియంలో దులీప్ ట్రోఫీ క్రికెట్ సంబరానికి ఆతిథ్యం ఇచ్చింది. తాజాగా,


ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (APFA) ఆధ్వర్యంలో శుక్రవారం 'జాతీయ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2024' అనంతపుం ఆర్డీటీ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ వేడుకలో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పాల్గొన్నారు. అంతకుముందు క్రీడాకారులను చౌబే పరిచయం చేసుకున్నారు.


అనంతరం జరిగిన సభలో కళ్యాణ్ చౌబే మాట్లాడుతూ దేశంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్ బాల్ క్రీడకు మరింత ప్రాచుర్యం తీసుకుని వచ్చే దిశగా ఔత్సాహిలను ప్రోత్సాహించడమే ప్రధాన లక్ష్యం అన్నారు. రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. క్రీడాకారులకు మౌలిక సదుపాయాలు మరింతగా పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఔత్సాహిక క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడం ద్వారా ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేయడమే తమ ముందు ఉన్న కర్తవ్యం అని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్, ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డేనియల్ ప్రదీప్, కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధికారులు, స్పాన్సర్లు, వలంటీర్లందరికీ అభినందనలు తెలిపారు. కోశాధికారి విజయ్ కుమార్, పీఆర్ఓ అడ్వ దీపక్ దయానందన్, క్రీడాకారులు, APFA అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మొదటి రోజు శుక్రవారం ఉదయం తమిళనాడు జట్టుపై జరిగిన పోటీలో అండమాన్ జట్టు విజయం సాధించింది. సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం తరువాత నిర్వహించన పోటలో ఆంధ్రప్రదేశ్ జట్టుపై కర్ణాటక జట్టు విజయం సాధించిందని ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ పీఆర్ఓ దీపక్ దయానంద్ తెలిపారు. ఈ నెల 19 వ తేదీ వరకు జరిగే పోటీల్లో విజేలకు హైదరాబాద్ లో జరిగే జాతీయ పోటీలకు అర్హత సాధిస్తాయని ఆయన వివరించారు.
Read More
Next Story