తిరుమల లడ్డూ: మాజీ చైర్మన్లపై కేసు పెట్టాలని సాధువుల పట్టు
x

తిరుమల లడ్డూ: మాజీ చైర్మన్లపై కేసు పెట్టాలని సాధువుల పట్టు

టీటీడీ మాజీ చైర్మన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సాధువులు డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు కాపాడాలని కూడా నినదించారు.


తిరుమలను కాపాడండి... టీటీడీని రక్షించండి అని సాధువులు నినదించారు. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో వ్యాపించిన ప్రకంపనలు ఆందోళనలకు ఉసి గొల్పాయి.


తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వద్ద శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్యర్యంలో ప్రకాశానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ధర్నాకు దిగారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాధు పరిషత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో శ్రీనివాసనంద సరస్వతి, మహదేవానందస్వామీజీ, ఒంగోలుకు చెందిన భైరవానందస్వామీజీ, పేరూరు బాలకృష్ణస్వామీజీ హాజరయ్యారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయంలో బాధ్యుల వ్యవహారం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. గతంలో టీటీడీ చైర్లన్లుగా పనిచేసిన వైవీ. సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుుడు, శ్రీకాకుళంలోని ఆనందాశ్రమ పీఠాధిపతి ప్రకాశానంద సరస్వతి స్వామీజీ డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమి అన్నారంటే...
"శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో గొడ్డు, పంది కొవ్వుతో పాటు చేప నూనె కలిసింది" అనే సీఎం చంద్రబాబు బహిర్గతం చేశారు. ఇందుకు బాధ్యలైన వారిని కఠినంగా శిక్షించండి" అని ప్రకాశానంద సరస్వతి స్వామీజీ కోరారు. "లడ్డూలో జరిగిన కల్తీ వల్ల శ్రీవారి భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వారి మనసుల్లో ఉన్న వెలితి, బాధ, ఆవేదన తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి" అన్నారు.

"తిరుమలలో శాందియోగం, ప్రోక్షణ నిర్వహించిన కారణంగా మాలిన్యం పోయింది" అని ప్రకాశానంద సరస్వతి స్వామీజీ అభిప్రాయపడ్డారు. "తిరుమలలో అపచారం జరగడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోండి" అని కోరుతూ టీటీడీ పరిపాలన భవనంలో ఈఓ జే. శ్యామలరావుకు వినతపత్రం అందించారు. " తాము చేసిన సూచనలకు ఈఓ సానుకూలంగా స్పందించారు" అని
ఆటంకం
టీడీపీ పరిపాలన భవనం వద్ద రోడ్డుపై సాధువులు ధర్నాకు దిగారు. దింతో అప్పటికే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, సివిల్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక హిందూ సంస్థ ప్రతినిధులతో పాటు హిందూ పరిరక్షణ ప్రతినిధి ఓంకార్ తదితరులు సమన్వయం చేశారు.
Read More
Next Story