APSRTC - Kumbh Mela | ఆర్టీసీ బస్సులో 'మహా కుంభమేళా'కు వెళ్లొద్దామా
ప్రయాగ్ రాజ్ తీర్థయాత్రకు ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అయోధ్య, వారణాశితో కలిపి టూర్ ప్యాకేజీ ప్రకటించారు.
యాత్రికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రయాగ్ రాజ్ కు వెళ్లడానికి ప్యాకేజీ టూర్ ప్రకటించింది. విజయవాడ తోపాటు కొవ్వూరు, రాజమహేంద్రవరం, కడప జిల్లా బద్వేలు నుంచి ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. ఆ మేరకు ప్రజా రవాణా శాఖ అధికారులు ఈ విషయాలను వెల్లడించారు.
పుణ్యక్షేత్రాల సందర్శన చేయాలనేది ప్రతిమతంలోనూ ప్రగాఢ కోరిక ఉంటుంది. హిందూ భక్తులు కాశీయాత్రకు ప్రాధాన్యత ఇస్తారు. అదే కోవలో అనేక ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన ద్వారా మానసిక ప్రశాంతతను కోరుకుంటారు. ఇందులో భాగంగా.. దేశంలో నిర్వహించే కుంభమేళా, అర్థ కుంభమేళా, మహా కుంభమేళాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాటిలో అత్యంత కీలకమైన మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్ లోని త్రివేణి సంగమం వద్ద ఉన్న ప్రయాగ్రాజ్ వద్ద జనవరి 13వ తేదీ ప్రారంభమైంది. ఫిబ్రవరి 26వ తేదీ ఈ మహా కుంభమేళా ముగుస్తుంది.
ప్రయాగ్ రాజ్ లో 45 రోజులపాటు నిర్వహించే మహా కుంభమేళాకు దేశం నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు రావడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాకు వచ్చిన సాధువులు, ఏగులు ప్రధానంగా నాగ సాధువులతో ప్రయాగ్ రాజ్ కిటకిటలాడుతోంది. సాధారణంగా కుంభమేళాలు ఉత్తరప్రదేశ్ లోని నాలుగు ప్రాంతాల్లో నిర్వహిస్తారు. 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే మహా కుంభమేళ ప్రయాగ్రాజ్లో మాత్రమే నిర్వహించడానికి ప్రత్యేకత ఉంది. ఏ మహా కృతవులో పుణ్య స్థానాలు ఆచరిస్తే జన్మ ధన్యమవుతుందనేది హిందువుల ప్రగాఢ విశ్వాసం.
ఆర్టీసీ ప్యాకేజీ టూర్
యాత్రికుల సదుపాయం కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం నుంచి బస్సులు నడపడానికి వీలుగా ఆర్టీసీ టూర్ ప్యాకేజీ (RTC tour package for Kumbh Mela) కూడా ప్రకటించింది. ఇందులో విజయవాడ నుంచి కొన్ని బస్సులు బయలుదేరుతాయి. కడప జిల్లా బద్వేలు నుంచి కూడా ప్రయాగ్రాజుకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించారు.
మహాకుంభమేళా ప్యాకేజీ టూర్ ఫిబ్రవరి ఒకటవ తేదీ ప్రారంభమయ్యే యాత్ర ఎనిమిదవ తేదీ వరకు ఉంటుంది. విజయవాడ ప్రజా రవాణా అధికారి దానం ఆ వివరాలు వెల్లడించారు.
ఫిబ్రవరి 1: విజయవాడ నుంచి యాత్రికులతో బస్సు బయలుదేరుతుంది.
ఫిబ్రవరి 2 :సాయంత్రం ప్రయాగ్ రాజ్ చేరుకుంటాయి.
3 వ తేదీ: యాత్రికులకు ప్రయాగరాజ్ లోనే బస ఉంటుంది.
4వ తేదీ: రాత్రి బయలుదేరి అయోధ్యకు ప్రయాణం. మరుసటి రోజు ఉదయం అయోధ్యకు చేరుకునే తర్వాత బాల రాముడి దర్శనం. అదే రోజు రాత్రి బయలుదేరి వారణాసికి బయలుదేరుతారు.
ఫిబ్రవరి 6: యాత్రికులను వారణాసి తీసుకువస్తారు. రాత్రికి అక్కడే వసతి కల్పించారు.
ఫిబ్రవరి 7 : వారణాసి నుంచి ఉదయం బయలుదేరి 8వ తేదీ ఉదయానికి విజయవాడకు చేరుకుంటాయి.
టూర్ ప్యాకేజీ చార్జీలు ఇలా...
ప్రయాగ్రాజలో నిర్వహిస్తున్న మహా కుంభమేళాకు వెళ్లడానికి ఏపీఎస్ఆర్టీసీ టూర్ ప్యాకేజీ లో చార్జీలు కూడా వెల్లడించింది. వారం రోజుల పాటు సాగే యాత్రకు ఒక్కో ప్రయాణికుడికి వసూలు చేసే చార్జీలను ఎన్టీఆర్ జిల్లా రవాణా శాఖ అధికారి ఎంవై. దానం ఆ వివరాలు చెప్పారు. ఈ టూర్ ప్యాకేజీలు పిల్లలు, పెద్దలకు ఒకే చార్జీ ఉంటుందని ఆయన చెప్పారు.
"ప్రయాణ చార్జీ మాత్రమే వసూలు చేస్తున్నాం. భోజనం, వసతి ప్రయాణికులే ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఖర్చు వారే అదనంగా భరించాలి" అని రవాణా శాఖ అధికారి దానం స్పష్టం చేశారు.
బస్ చార్జీలు ఇలా..
1. సూపర్ లగ్జరీలో ఒక ప్రయాణికుడికి రు. 8 వేలు
2. స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సులో రు.11 వేలు
3. వెన్నెల ఏసీ స్లీపర్ కోచ్ లో రు. 14,500 చార్జిగా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు
మహా కుంభమేళా యాత్రకు వెళ్ళడానికి ఆసక్తి ఉన్న యాత్రికులు 35 లేదా 29 మంది గ్రూపుగా వస్తే ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. ఈ యాత్రకు వెళ్లి వారికోసం ముందస్తుగా ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని, అలాగే సమీప బస్ స్టేషన్ ఆర్టిసి బుకింగ్ ఏజెంట్ వద్ద కూడా టికెట్లు తీసుకోవచ్చని ఆయన సూచించారు.
మహా కుంభమేళా యాత్రకు సంబంధించి వివరాలు అవసరమైతే ఫోన్ నెంబర్లు 80742 98487 0866-2523928, 0866- 2523926 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
బద్వేలు నుంచి
కడప జిల్లా బద్వేలు డిపో నుంచి కూడా బస్సు కూడా నడపనున్నట్లు డీఎం ఆర్సీ. నిరంజన్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి తెలిపారు. ఆయన ఇంకా ఏమంటున్నారంటే..
"ఫిబ్రవరి రెండో తేదీ ఉదయం డిపో నుంచి బస్సు బయలుదేరుతుంది. ప్రయాగ్ రాజ్, అయోధ్య, వారణాసి సందర్శన అనంతరం 8వ తేదీ తిరిగి బద్వేలుకు చేరుకుంటుంది" అని చెప్పారు. మార్గమధ్యలో ప్రముఖ ఆలయాల సందర్శన కూడా ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ నిరంజన్ చెప్పారు. దీనికోసం ఒకో యాత్రికుడికి రూ. 11,900 చార్జీగా నిర్ణయించినట్లు ఆయన వివరించారు. వివరాలకు రిజర్వేషన్ కౌంటర్ సెల్ అండ్ ఫోన్ పే నెంబర్ : 8886090136 (Baskar) బద్వేలు డిపో మేనేజర్ (Dm) సెల్ నంబర్ 9959225779, STI నంబర్ 7382867104,7337492816,8886090136లో సంప్రదించాలని నిరంజన్ కోరారు.
Next Story