Breaking | చంద్రగిరి వద్ద ఢీకొన్న ఆర్టీసీ బస్సులు
x

Breaking | చంద్రగిరి వద్ద ఢీకొన్న ఆర్టీసీ బస్సులు

ఈ సంఘటనలో 30 మంది గాయపడ్డారు. బాధితులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.


సంక్రాంతి పర్వదినాన ఏర్పడిన ప్రతికూల వాతావరణం ప్రమాదాలకు దారి తీసింది. రాత్రి కావడం. మంచు దుప్పటి ముసుగేయడం. వాహనాలు దగ్గరికి వచ్చే వరకు కనిపించకపోవడం. ఈ పరిస్థితుల్లో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఓ బస్సులో డ్రైవర్ ఇరుక్కుపోయాడని ప్రాథమిక సమాచారం అందింది.


ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (police training College - PTC ) సమీపంలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఆ వివరాలు ఇవి.


మదనపల్లి డిపో ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెళుతుంది. చంద్రగిరి మండలం పోలీసు శిక్షణ కళాశాల వద్ద ఉన్న మలుపులో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మదనపల్లి ఆర్టీసీ డిపో చెందిన బస్సులు డ్రైవర్ స్టీరింగ్ బద్దె ఇరుక్కుపోయాడని సమాచారం అందింది.
మదనపల్లి నుంచి తిరుపతికి రావడానికి మూడున్నర గంటల సమయం పడుతుంది. ఇంత దూరాన్ని చేరుకోవడానికి వేగం కోస్తున్న ఆర్టీసీ బస్సు పిటిసి కాలేజీ వద్ద ఎదురుగా వస్తున్న పీలేరు డిపో బస్సుతో ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

రాత్రి వేళ కావడానికి తోడు వాతావరణ పరిస్థితుల్లో ఏర్పణ మార్పుల కారణంగా వర్షం కురిసి ఆగడంతో మంచు తెరలు కూడా కమ్ముకున్నాయి. పిటిసి కళాశాల నుంచి దట్టమైన శేషాచలం అడవులు ప్రారంభమవుతాయి. దీంతో మంచు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. దగ్గరికి వచ్చేవరకు బస్సులు కనిపించని స్థితిలో మలుపు ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో అందులో ఉన్న ప్రయాణికులు దాదాపు 35 మందికి పైగానే గాయపడినట్లు సమాచారం అందింది. ఊహించని ఈ ఘటనతో వచ్చిన శబ్దానికి ప్రయాణికులు అరుపులు, కేకలు మిన్నంటాయి.
స్తంభించిన ట్రాఫిక్..

చంద్రగిరి మండలం పోలీసు శిక్షణ కళాశాల వద్ద జరిగిన ఈ ప్రమాదంతో ఇరుపక్కల దాదాపు మూడో కిలోమీటర్లకు పైగానే వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంలో గాయపడిన బాధితులను తిరుపతి ప్రజా ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్ ను పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More
Next Story