డిప్యూటీ సీఎం కల్యాణ్ ను రోజా ఏమని ప్రశ్నించారు?
x

డిప్యూటీ సీఎం కల్యాణ్ ను రోజా ఏమని ప్రశ్నించారు?

మత రాజకీయాలకు సీఎం చంద్రబాబు తెరతీశారు. ఆయనకు ఏమాత్రం భక్తి లేదు. అనడమే కాకుండా, పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి ప్రశ్నలు సంధించారు.


కులం, మత రాజకీయాలతో రాజకీయాలతో ప్రజలు, ప్రధానంగా భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారు. రాష్ట్రంలో మతరాజకీయాలు జోరందుకున్నాయి. అని వైసీపీ అధికార ప్రతినిది, మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. "దీనికంతటికీ ప్రధాన కారణం సీఎం చంద్రబాబే" అని ఆమె ఆరోపించారు. "అవురికి (సీఎం చంద్రబాబు) భక్తి ఇల్లే. భయం ఇల్లే" (చంద్రబాబుకు భక్తి లేదు. భయం అంతకన్నా లేదు) అని వ్యాఖ్యానించారు.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై శనివారం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని మాజీ సీఎం వైఎస్. జగన్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అందుబాటులోని లేని ఆర్క్. రోజా తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
పవన్ ది ఏమతం
సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ కూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ఆమె ఘాటుగా మాట్లాడారు.
"ఆయన పూజలు చేసే సమయంలో కూడా బూట్లు వేసుకుంటారు" అంటూ ఫొటొలు ప్రదర్శించారు. "సీఎం చంద్రబాబు ఇలాగే వ్యవహరించిన వీడియోలు కూడా ఉన్నాయి" అని చెప్పారు. ఇలాంటి వారు సనాతన ధర్మం, పద్ధతులపై మాట్లాడడం తమాషాగా ఉందన్నారు.
"పవన్ కల్యాణ్ భార్య క్రిస్టియన్, ఆయనతో పాటు పిల్లలు కూడా బాప్టిజం తీసుకున్నారు" అని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. అసలు వీరిది ఏమతం. అని నిలదీశారు. పవన్ కల్యాణ్ రెండో అన్న నాగబాబు గతంలో దేవుడే లేరు" వీడియో సోషల్ మీడియాలో ఉన్న ఆ వీడియోనే సాక్ష్యం" అని గుర్తు చేశారు.
వైఫల్యాలు కప్పిపుచ్చడానికే..
టీడీపీ కూటమి వంద రోజుల పాలనలో వైఫల్యాలు కప్పిపుచ్చడానికే తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చారని రోజా ఆరోపించారు. "రాజకీయంగా ఎదుర్కోవడం సాధ్యం కాని స్థితిలోనే దేవుడిని అడ్డంపెట్టి రాజకీయం చేస్తున్నారు" అని ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని పార్టీ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు.
Read More
Next Story