రెవెన్యూ రికార్డులు దగ్ధం  ప్రమాదమా? కుట్ర కోణమా??
x

రెవెన్యూ రికార్డులు దగ్ధం ప్రమాదమా? కుట్ర కోణమా??

రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. దీనిపై సీఎం ఎన్. చంద్రబాబు సీరియస్ అయ్యారు. అది అగ్నిప్రమాదామా? లేక అవకతవకలు కప్పిపుచ్చడానికి జరిగిన యత్నమా? అనేది చర్చకు తెరతీసింది.


కాలిబూడిద అయ్యాయి. ఆదివారం అయినా, రాత్రి 10.30 వరకు ఆ ఉద్యోగి కార్యాలయంలో ఎందుకు ఉన్నారు. అనేది సందేహాస్పదంగా మారింది. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీనియస్ గా తీసుకున్నారు. డీజీపీ ద్వారకాతిరుమలరావు, సీఐడీ చీఫ్‌ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. వారిని హెలికాప్టర్లో మదనపల్లెకు వెళ్లమని ఆదేశాలు జారీ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా ఆక్రమిత భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని డీజీపీకి ఆదేశించినట్లు సమాచారం. ఈ ఘటనలో ముఖ్యమైన 20ఏ, 21ఏ సంబంధించిన రికార్డులు, పాత రికార్డులు కాలిపోయాయి.



మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం అత్యవసర విచారణ చేపట్టింది. కీలక ఫైల్స్ అగ్నిప్రమాదంలో దగ్గం అయ్యాయని తెలుస్తోంది. ఆదివారంం మదనపల్లె ఆర్డీఓ హరిప్రసాద్ బదిలీ అయ్యారు. కొత్తగా నియమితులైన సబ్ కలెక్టర్ సోమవారం బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందే ఈ ఘటన జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ అగ్నిప్రమాద ఘటనను అంత్యంత సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. అగ్నిప్రమాదమా, కుట్ర పూరితమా అనే అంశంలో విచారణ చేయాలని ఏపీ చీఫ్ సీఎస్ నీరబ్‌కుమార్, డిజీపీ ద్వారకతిరుమల, సీఐడీ చీఫ్‌ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఉద్దేశ్య పూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు.. వెంటనే ఘటనా స్థలానికి హెలికాఫ్టర్‌లో వెళ్లాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీజీపీ, సీఐడీ చీఫ్ మదనపల్లె పట్ణణానికి బయలుదేరారు.


ఆ సమయంలో ఏం పని
ఆదివారం అయినా సబ్ కలెక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ రాత్రి 10.30 వరకు కార్యాలయంలోనే ఉన్నారని తెలిసింది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు, ఆయన సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. షార్ట్ సర్క్యూట్కు ఆస్కారం లేదని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో 900 ఎకరాలకు సంబంధించిన నిషేధిత పట్టా భూములు (చుక్కల భూములు), అసైన్డ్ భూముల వ్యవహారం ఉన్నట్లు సందేహిస్తున్నారు. అగ్నప్రమాదంలో రికార్డులతో పాటు, కంప్యూటర్లు కూడా బూడిద అయ్యాయి. అగ్నిమాపక శాఖ అతికష్టంపై మంటలు అదుపు చేసింది. జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More
Next Story