శ్రీవారికి రూ. 1.80 కోట్ల అరుదైన కానుకలు
x
తిరుమల ఆలయం వద్ద బంగారు రథం (ఫైల్)

శ్రీవారికి రూ. 1.80 కోట్ల అరుదైన కానుకలు

15 బంగారు పతకాలు అందించిన గోకర్ణ మఠాధిపతి.


అలంకార ప్రియుడైన శ్రీవేంకటేశ్వరస్వామి భాండాగారంలో వెలకట్టలేనంత ఆభరణాలు ఉన్నాయి. శ్రీవారికి సోమవారం ఉదయం 1.80 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను కానుకలుగా అందాయి. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో..


శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం నుంచి 15 బంగారు. పతకాలు, రెండు వెండి తట్టలను స్వామీజీ ఈ కానుకలు అందించారు. శ్రీవారికి నిత్యం 120 కిలోల ఆభరణాలతో అలంకరణలు చేస్తుంటారు. శ్రీకృష్ణదేవరాయల వారి నుంచి ఇప్పటి వరకు యాత్రికులు అందించిన బంగారు దాదాపు తొమ్మిది టన్నుల వరకు ఉంటాయనేది ఓ అంచనా. ఈ ఆభరణాల్లో వెలకట్టలేని అనేక రకాల వజ్రాలు పొదిగిన ఆభరణాలు, నిత్యం అలంకరించే వాటితో పాటు స్వామివారి సేవలకు అవసరమైనవి కూడా ఉన్నాయి.


తిరుమలలో సోమవారం ఉదయం శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను బహుకరించారు.

శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ రామకృష్ణకు స్వామీజీ ఈ కానుకలు అందజేశారు. వారికి శ్రీవారి దర్శనం అనంతరం తీర్ధప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల ఆలయ బొక్కసం ఇన్ ఛార్జ్ గురురాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story