YCP | భయపడం ఎంతకైనా పోరాడుతాం..
x
పలమనేరులో నిరసన వ్యక్తం చేస్తున్న వైసీపీ మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, బైరెడ్డిపల్లె రెడ్డెప్ప, నాయకులు

YCP | భయపడం ఎంతకైనా పోరాడుతాం..

వైసిపి ఎంపీ మిథున్ అరెస్టుపై చిత్తూరులో రగిలిన నిరసనలు.


ఏపీ లిక్కర్ స్కాం లో వైసీపీ ( YSRCP )రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో సోమవారం సాయంత్రం నిరసనలు రాజుకున్నాయి.

చిత్తూరు జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్న మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విధేయ వర్గం నల్ల డాలు, ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. టీడీపీ కూటమి బనాయిస్తున్న కేసులపై నిరసన వ్యక్తం చేశారు.

జిల్లాలోని పలమనేరు, పుంగనూరు పట్టణాల్లో వైసిపి నాయకులు భారీ ర్యాలీలు నిర్వహించారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, జడ్పీ మాజీ చైర్పర్సన్ రెడ్డెమ్మ, వైసిపి రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు నల్ల రిబ్బన్లు మూతికి కట్టుకొని, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించడం ద్వారా నిరసన తెలిపారు.
"రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన ఉంచి రెడ్ బుక్ ( Red Book ) రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు" అని చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప ఆరోపించారు.
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీకి పెద్దది ఎక్కువగా ఉన్నారు. ఆయన కొడుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి నాయకులు తీవ్రంగా ఆక్షేపించారు.
పలమనేరు నియోజకవర్గం లో కీలక బాధ్యత నిర్వహించే. జెడ్పీ మాజీ చైర్ పర్సన్ రెడ్డమ్మ భర్త, వైసీపీ రాష్ట్ర నేత బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, ఆ నియోజకవర్గంలో నాయకులు భారీగా నిరసనలో పాల్గొన్నారు.

పుంగనూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. రెడ్డప్ప, మున్సిపల్ చైర్మన్ షరీఫ్, మాజీ చైర్మన్లు కొండవీటి నాగభూషణం, వెంకట రెడ్డి యాదవ్ తో పాటు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ వీడియోలో ఆ దృశ్యాలు చూడండి.

Read More
Next Story