కర్నూలు : మితిమీరిన వేగం ముగ్గురి ప్రాణాలు తీసింది
x
ఆళ్లగడ్డ వద్ద ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు

కర్నూలు : మితిమీరిన వేగం ముగ్గురి ప్రాణాలు తీసింది

తిరుపతి నుంచి బయలుదేరిన రెండు ప్రైవేటు బస్సులు ఆళ్లగడ్డ వద్ద ఢీ.


ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల మధ్య పోటీ ప్రయాణికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. గమ్యస్థానానికి త్వరగా చేరాలనే ఆతృత, మితిమీరిన వేగం వల్ల రెండు ప్రైవేటు బస్సులు ఢీన్నాయి.

కడప- నంద్యాల జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఘటనా స్థలంలో ముగ్గురు మరణించారు. మరో 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో శుక్రవారం వేకువజామున జరిగింది. ఈ వివరాల్లోకి వెళితే..
తిరుపతి నుంచి ప్రయాణం
తిరుపతి నుంచి జగన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు 46 మంది ప్రయాణికులతో శుక్రవారం రాత్రి 9.45 గంటలకు, శ్రీకృష్ణ ట్రావెల్స్ స్లీపర్ బస్సు 36 రాత్రి పది గంటలకు శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరాయి. రెండు బస్సులు వేర్వేరు సమయాలకు బయలుదేరాయి అని ఓ ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుడు మల్లి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న జగన్ ట్రావెల్స్ బస్సు కడప, నంద్యాల జాతీయ రహదారిలోని ఆళ్లగడ్డ సమీపంలోని ఆల్ఫా ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో వెళుతోంది. అదే సమయంలో మితిమీరిన వేగంతో వచ్చిన శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న జగన్ ట్రావెల్స్ బస్సును ఢీకున్నట్లు తెలిసింది. తిరుపతిలోని జగన్ ట్రావెల్స్ మేనేజర్ మురళీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
ముగ్గురు మృతి
బస్సులు ప్రయాణిస్తున్న వేకువజాము కావడంతో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ముందు వెళుతున్న జగన్ ట్రావెల్స్ బస్సును శ్రీకృష్ణ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో వచ్చిన శబ్దానికి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. జగన్ ట్రావెల్స్ బస్సులో వెనుక సీట్లలో కూర్చుని ఉన్న ఇద్దరు ప్రమాణికులు అక్కడికక్కడే మరణించారని సమాచారం అందింది.
ప్రమాదం జరిగింది జాతీయ రహదారి కావడం వల్ల వాహనదారులు, పెట్రోలింగ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ ఎస్ఐ హరిప్రసాద్ అప్రమత్తం అయ్యారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సును పక్కకు లాగడం తోపాటు అందులో చిక్కకున్న మృతదేహాలను వెలుపలికి తీశారని తెలిసింది. గాయపడిన 28 మంది ప్రయాణికులను సమీపంలో ఆళ్లగడ్డ, నంద్యాల ప్రభుత్వాస్పత్రులకు తరలించారు.
ఈ సంఘటనలో జగన్ ట్రావెల్స్ లో ఒకరు మరణించారని తెలిసింది.
"పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు" అని జగన్ ట్రావెల్స్ మేనేజర్ మురళీ చెప్పారు. సంఘటన స్థలానికి కడప నుంచి జగన్ ట్రావెల్స్ యజమానులు బయలుదేరి వెళ్లారని మాత్రమే ఆయన చెప్పారు.
Read More
Next Story