
తిరుచానూరు అమ్మవారి ఆలయం. తిరుమలలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (పైల్ )
తిరుచానూరులో బ్రహ్మోత్సవ వేళ... 20వ తేదీ రాష్ట్రపతి రాక
తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకోనున్న ముర్ము.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20వ తేదీ రాష్ట్రానికి రానున్నారు. ఈ రెండు రోజులు ఆమె తిరుపతి, తిరుమలలో పర్యటిస్తారు.. ఆ మేరకు తిరుపతి జిల్లా ప్రోటోకాల్ అధికారులకు సమాచారం అందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు.
2022 డిసెంబర్ ఐదో తేదీ మొదటిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేశ ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండవసారి ఆహె తిరుమలకు రానున్నారు. రాష్ట్రపతిగా ఎంపికైన తర్వాత ద్రౌపది ముర్ము మొదటిసారి తిరుమలకు వచ్చారు. తిరుమలలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కూడా రెండోసారి రాష్ట్రపతిని స్వాగతించనున్నారు.
తిరుమల ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (ఫైల్)
20వ తేదీ పర్యటన ఇలా...
తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 17వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈనెల 20వ తేదీ ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రపతి దౌపది మురము పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గాన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి చేరుకుంటారు. అదే రోజు ఆమె శ్రీవారి పుష్కరానికి సమీపంలో ఉన్న శ్రీ వరాహ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. రాత్రికి తిరుమల లోనే బస చేసే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 21వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని, ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నట్లు తిరుపతి జిల్లా అధికారులకు అధికారికంగా సమాచారం అందింది.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుపతి పోలీసు యంత్రాంగం బందోబస్తు ఏర్పాట్లకు సమీక్షించింది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, తిరుచానూరు ఆలయ దర్శనానికి రానున్న రాష్ట్రపతి భద్రతా చర్యలపై సోమవారం సాయంత్రం జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ కాన్ఫరెన్స్ హాలులో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సమీక్షించారు.
అదనపు ఎస్పీలు రవిమనోహరచారి, ఐ. రామకృష్ణ (తిరుమల), నాగభూషణరావు (క్రైం), శ్రీనివాసరావు (సాయుధ దళం), డిఎస్పీలు వెంకటనారాయణ (ఎస్.బి), భక్తవత్సలం (తిరుపతి), ప్రసాద్ (చంద్రగిరి), రామకృష్ణ ఆచారి (ట్రాఫిక్) పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ,
"బ్రహ్మోత్సవాల వేళ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ప్రతి విభాగం సమన్వయంతో ప్రణాళికతో పనిచేయాలి. భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి" అని సూచించారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ట్రాఫిక్, పార్కింగ్, శక్తి టీం పర్యవేక్షణ, మహిళా భక్తుల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు.
Next Story

