
దొరకునా ఇటువంటి సేవ..
శ్రీవారి ఆలయంలోకి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపదీ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం సరిగ్గా పది గంటలకు ఆలయం వద్దకు చేరుకున్నారు. పద్మావతీ అతిథి గృహం నుంచి శ్రీవారి ఆలయానికి వెళ్లే ప్రధానమార్గంలోని రాంబగీచ అతిథి గృహాల సముదాయం వరకు వచ్చారు. అక్కడి నుంచి బ్యాటరీ వాహనంలో ఉత్తర మాడవీధి వరకు బ్యాటరీ వాహనంలో వచ్చారు. ఆమె వెంట టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి టీటీడీ పాలక మండలి సభ్యుడు జీ. భానుప్రకాష్ రెడ్డి తోపాటు అధికారులు ఉన్నారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురవారం మధ్యాహ్నం తిరుపతి రేణిగుంట విమానాశ్రాయానికి చేరుకున్నారు. తిరుచానూరు పద్మావతీ అమ్మవారి దర్శనం తరువాత గురువారం రాత్రి తిరుమలకు చేరుకుని, రాత్రి పద్మావతీ అతిథిగృహంలో బస చేశారు.
తిరుమలలో ఆమెకు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, ఎస్పి ఎల్ సుబ్బారాయుడు ఘన స్వాగతం పలికారు.
తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయం వరకు పరిచిన రెడ్ కార్పెట్ నుంచి నడుచుకుంటూ ఆలయ మహద్వారం వరకు చేరుకున్నారు. అక్కడ ఆ తరువాత శ్రీవారి ఆలయానికి వద్దకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తోపాటు వేదపండితులు ఇస్తకఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి దర్శనానికి ఆలయంలోకి వెళ్లారు.
Next Story

