పోసాని కృష్ణమురళికి  14 రోజుల రిమాండ్‌.. !
x

పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్‌.. !

నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆయన్ని పోలీసులు రాజంపేట సబ్ జైలుకి తరలించారు.

 &

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు. నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేష్‌పై తీవ్రమైన పదజాలంతో విమర్శలు, ఆరోపణలూ చేశారు. ఆయన కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులోనే ఆయన్ని అరెస్టు చేసిన పోలీసులు. కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో విచారణ రాత్రివేళ సాగడం చర్చనీయాంశం. గురువారం రాత్రి 10.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 3 గంటల వరకు కోర్టు విచారణ జరిగింది. పోసాని తరపున ప్రముఖ సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు వినిపించారు. అసలు పోసాని అరెస్టే సక్రమంగా లేదనీ. భారత న్యాయ సంహిత BNS చట్టం ప్రకారం పోసానికి 41A నోటీసులు ఇచ్చి, బెయిల్‌ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. కానీ మేజిస్ట్రేట్ ఈ వాదనతో ఏకీభవించలేదు. చివరకు పోసానికి 14 రోజుల వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలిచ్చారు.


Read More
Next Story