Breaking | యాత్రికులతో నిండిన తిరుచానూరు పద్మపుష్కరిణి...
x
తిరుచానూరు పద్మపుష్కరిణిలో యాత్రికుల సందోహం

Breaking | యాత్రికులతో నిండిన తిరుచానూరు పద్మపుష్కరిణి...

పద్మావతీ అమ్మవారికి మండపం వద్ద ప్రారంభమైన పూజలు. Thefederal Andhrapradesh లైవ్. ప్రత్యేక చిత్రాలు


తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు పద్మ పుష్కరిణి వద్ద కోలాహలంగా మారింది.


మంగళవారం మధ్యాహ్నం 12.10 గంటలకు కుంభ లగ్నంలో చక్రస్నానం నిర్వహించడానికి వీలుగా అమ్మవారికి పుష్కరానికి సమీపంలోని మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

పంచమితీర్థం సందర్భంగా చక్రస్నానం నిర్వహించే సమయంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి యాత్రికుల పోటెత్తారు. నీటితో నిండి ఉన్న కోనేరులోకి యాత్రికులు భారీగా చేరుకున్నారు. చక్ర స్నానం నిర్వహించే సమయంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వీలుగా వచ్చిన యాత్రికులతో పుష్కరణలో నీటికి బదులు యాత్రికులే ఎక్కువగా కనిపిస్తున్నారు.

ఆంక్షలు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమితీర్థం సందర్భంగా మంగళవారం టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, తిరుపతి జిల్లా పోలీసులు కట్టతిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.. హోల్డింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రాంతాల్లో అంటే తిరుచానూరుకు సమీపంలోని కిలోమీటర్లు దూరంలోనే యాత్రికులు నిలిపివేయడం వల్ల ఇబ్బందులు గురయ్యారు.

తిరుచానూరుకు సమీపంలోని ఫ్లై ఓవర్ కింద నుంచి వెళ్లే మార్గంలో పోలీసులు నిలువరింప చేయడంతో మహిళా యాత్రకు పెద్ద సంఖ్యలో అక్కడ నిలబడిపోయారు.
Read More
Next Story