
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ
ఈ నలుగురివీ బీజేపీ మొహాలే, వీళ్లేం చేస్తారు కేంద్రంపై పోరాటం?
చర్చలకు సిద్ధం అంటున్న నక్సల్స్ మాటను కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. ఉగ్రమూకల కోసం సంప్రదింపులు ఏమిటని సీపీఐ నారాయణ ప్రశ్నించారు.
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ నేతలందరే బీజేపీ భక్తులే అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ వ్యాఖ్యానించారు. "బీజేపీ కూటిమికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, మిగతా ప్రగతిశీల శక్తులతో కలిసి రాజకీయ ఉద్యమం చేపడతాం" అని సీపీఐ నారాయణ స్పష్టం చేశారు. ఎన్నికల నాటికి రాజకీయ ప్రత్యమ్నాయ వేదిక సిద్ధం చేస్తామన్నారు.
తిరుపతిలో బుధవారం మధ్యాహ్నం గంధమనేని శివయ్య భవన్ (సీపీఐ) కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇదే మంచి సమయం. కమ్యూనిస్టులతో పాటు కలిసి వచ్చే వారితో కలిసి రాజకీయ ఉద్యమం సాగించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన గుర్తు చేశారు.
పార్టీలు, పేర్లు, జెండాలు, బొమ్మలు వేరుగా ఉండవచ్చు. రాష్ట్రంలోని అన్ని పార్టీలవి బీజేపీ ముఖాలే అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ అభివర్ణించారు. వారిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్, మాజీ సీఎం వైఎస్. జగన్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడగలరా? ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడితే వారి సొమ్మ ఏమి పోతుంది? అని నారాయణ ప్రశ్నించారు.
ఉగ్రవాదులతో చర్చలా?
చర్చలకు సిద్ధం అని మావోయిస్తులు సంసిద్ధత వ్యక్తం చేసినా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏమాత్రం ఖాతరు చేయకుండా, 2025 నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని ప్రకటించడంపై సీపీఐ నారాయణ మండిపడ్డారు.
"మార్క్సిజం, లెనినిజం ప్రపంచ వ్యాపిత సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి అనుగుణంగానే పనిచేస్తున్న నక్సల్స్ దేశ భక్తులు" అని ఆయన అన్నారు. వారి విధానం వేరుగా ఉండవచ్చు. హింసకు మేము వ్యతిరేకమే. సిద్ధాంతం మా అందరిదీ ఒకటే అని నారాయణ అన్నారు.
ప్రపంచానికి సవాల్ గా మారిన పాకిస్తాన్ ఉగ్రమూకల కోసం చర్చలకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో ఎందుకు మాట్లాడదు? అని కేంద్ర మంత్రి అమిత్ షాను నారాయణ ప్రశ్నించారు.
వ్యక్తులను భౌతికంగా అంతం చేయగలరు. కానీ సిద్ధాంతాలను మాత్రం చంపలేరు అని నారాయణహెచ్చరించారు. కమ్యూనిస్టుల సిద్ధాంతం ఓడించడం మీకు సాధ్యం అవుతుందా? అని కూడా నారాయణ ప్రశ్నించారు.
బీజేపీ ఎంపిపై చర్యలకు డిమాండ్
"యుద్ధం కాదు. ఉగ్రమూకలను ఏరివేయాలని అన్నందుకు నన్ను పాకిస్థాన్ పంపించండి" అని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన సీపీఐ నారాయణ..
ఆపరేషన్ సింధూర్ లో వీరోచిత పోరుకు నాయకత్వం వహించిన కల్నల్ సోఫియాను బీహార్ బీజేపీ ఎంపీ హేళన చేయడంపై నారాయణ అభ్యంతరం చెప్పారు. దేశం కోసం పోరాడుతున్న మహిళా సైనికురాలిపై వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాపై ఏం చర్యలు తీసుకుంటారని నారాయణ ప్రశ్నించారు.
పాకిస్థాన్ ప్రభుత్వంపై కాదు. అక్కడి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలి. నారాయణ డిమాండ్ చేశారు. పహల్గావ్ దాడిని కనిపెట్టడంలో నిఘా వ్యవస్థ లోపం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
"పానీ పూరీ విక్రయించే ఒకరు.. కొత్త వ్యక్తులు తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. అని కూకట్ పల్లి నుంచి వెళ్లిన తనకు తెలిసిన మిత్రును హెచ్చరించారనే విషయాన్ని నారాయణ చెప్పారు.
"ఆ దాడిలో ముగ్గురి పాత్ర ఉంది. వారిని దేశానికి అప్పగించే విధంగా పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచాలి. మినహా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై యుద్ధం సరికాదు" అని నారాయణ వ్యాఖ్యానించారు. పౌరులకు నష్టం జరిగితే వారు మళ్లీ ఉగ్రవాదులకు మద్దతు తెలిపే ప్రమాదం లేకపోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్, పాక్ మధ్య చర్యలకు మూడో శక్తి, వ్యక్తికి ఆస్కారం ఇవ్వకూడదు అని వ్యాఖ్యానించిన నారాయణ అమెరికా ప్రమేయాన్ని అనుమతించకూడదన్నారు.
Next Story