నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేేస్తా: ఎంపీ మిథున్
మదనపల్లె ఘటనపై రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మొదటిసారి గళం విప్పారు. ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా అని సవాల్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారు.
"ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేశాం. మా ఎన్నికల అఫివిడవిట్లలో అవన్నీ పారదర్శకంగానే ఉన్నాయి. మా కుటుంబం ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు" అని వైయస్ఆర్సీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. నిరాధార ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తా" అని హెచ్చరించిన ఆయన "వాస్తవం అని నిరూపిస్తే రాజకీయ సన్యానం చేస్తా" అని సవాల్ చేశారు.
చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల దగ్ధం ఘటనపై నాలుగు రోజుల తర్వాత మొదటిసారి ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్ద రెవెన్యూ పోలీస్ యంత్రాంగం ఉండి కూడా, చిన్న సంఘటనపై వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. " ఈ ఘటన జరగడం వెనుక ఉన్న వాస్తవాలను ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సాక్షాధారాలు లేకుండా, మా కుటుంబం పరువు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని కూడా ఆయన హెచ్చరించారు.
"ముమ్మాటికి ఇది తమ కుటుంబ ప్రతిష్ట దెబ్బతీసేందుకు జరుగుతన్న కుట్ర" అని వ్యాఖ్యానించిన ఎంపీ మిథున్ "వాస్తవం అని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా" అని కూడా సవాల్ విసిరారు.
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల దగ్ధం కేసుపై టీడీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. మదనపల్లి ఘటనపై అసలేని ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. తాను, తన తండ్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తల్లి స్వర్ణలత, తన భార్య పేరిట ఉన్న ఆస్తులన్నీ అఫిడవిట్లో స్పష్టంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. దీనికి సంబంధించి మదనపల్లె సబ్ కలెక్టర్ తో పాటు తహసీల్దార్ కార్యాలయాలు సీసీఎల్ఏ రికార్డుల్లో ఉంటాయనే విషయాన్ని గుర్తు చేశారు. తాను, తన సతీమణి, తన తల్లిదండ్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తల్లి స్వర్ణలత ఆఫిడవిట్లో అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయని పునరుద్ఘాటించారు.
"మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దహనం కావడం వెనక ఉన్న వాస్తవాలను ప్రభుత్వం బయటపెట్టాలి" అని ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి తమ కుటుంబం పై ఆరోపణలు చేసే ముందు వివరణ తీసుకోవాలని ఆయన మీడియా సంస్థలకు సూచించారు. ఏకపక్షంగా గతనాల ప్రచురిస్తే వారు నష్టం దావా వేస్తామంటూ ఆయన హెచ్చరించారు.
"మా కుటుంబం 30 ఏళ్లుగా వ్యాపారులు చేస్తోంది. ప్రతి పైసాకు లెక్కలు ఉన్నాయి. ప్రతిదానికి ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాం" మాకు ఉన్న ఆస్తుల వివరాలన్నీ స్పష్టంగా అఫిడవిట్లో ఉన్నాయి. అన్ని పద్ధతి గానే ఉన్నాయి ప్రతి సంవత్సరం రిటర్నులు దాఖలు చేస్తున్నాం" అని వివరించారు. "చాలా మంది రాజకీయ నాయకులు మా కుటుంబం వందలు, వేల ఎకరాలు తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది" అని సలహా ఇచ్చారు.
"నా తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. నేను మూడుసార్లు ఎంపీగా ఎన్నిక అయ్యాను" ఎక్క..డా ఎప్పుడూ.. ఎవరితోనూ పార్టీ ఫండ్ తీసుకున్న దాఖలాలు లేవు. మేము గేలిచే పార్టీ అధికారంలో ఉన్న, లేకున్నా ఎవరి నుంచి పైసా ఆశించలేదు, తీసుకోలేదు. ఇది నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా అని ఛాలెంజ్ చేశారు. ఇప్పటికైనా మదనపల్లి ఘటనపై వాస్తవాలు బయట పెట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. "రికార్డులు తారుమారు చేయడానికి ఈ ఘటన జరిగింది" అని చెబుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా.. మా అఫిడవిట్ లో వివరాలన్నీ సజావుగా ఉన్నాయి. అందుకు సంబంధించిన రికార్డులు సంబంధిత రెవెన్యూ కార్యాలయాల్లో ఉంటాయనే విషయం తెలుసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి హితవు పలికారు. "మా ప్రతిష్ట దెబ్బతీయడానికి బురద జల్లుతున్నారు. ఇవన్నీ పసలైన ఆరోపణలు" అని ఆయన కొట్టిపారేశారు. రికార్డలు దగ్ధం వల్ల మా కుటుంబానికి ఏ విధంగా బెనిఫిట్ అవుతుందని ఆయన ప్రశ్నించారు.