
టీటీడీ మాజీ ఏవీఎస్ఓ వై. సతీష్ కుమార్ (ఇన్ సెట్), రైలు పట్టాల సమీపంలో సతీష్ మృతదేహం (ఫైల్) రైలు పట్టాల పక్కన
గొడ్డలి వేటా..? ఇనుప రాడ్డా..? సతీష్ పై దేనితోొ దాడి చేశారబ్బా?
తిరుమల పరకామణి కేసులో ప్రత్యర్థులే నిందితులుగా కేసు నమోదు.
తిరుమల పరకామణి చోరీ వ్యవహారం అనేది ఓ సంచలన కేసు. ఈ కేసులో ఫిర్యాదు టిటిడి మాజీ ఏవీఎస్ఓ వై. సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి మరో సంచలనంగా మారింది. ఆయనపై మరో.. గొడ్డలి వేటు లాంటిదే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సతీష్ కుమార్ ను హత్య చేశారని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. మృతుడు సతీష్ సోదరుడు మానాది శ్రీహరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బీఎస్ఎస్ 103 (1) సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేశారు ఇందులో తిరుమల పరకామణిలో చోరీ, రాజీ చేయించిన కేసుల్లో కీలకంగా వ్యవహరించిన వారిని నిందితులుగా చేర్చారు. కాగా,
అనంతపురం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఫోరెన్సెక్ విభాగం వైద్యులు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు.
"మాజీ ఏవీఎస్ ఓ, ప్రస్తుతం గుంతకల్లె జిఆర్పీ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నసతీష్ కుమార్ ను తలవెనుక గొడ్డలి తరహా ఆయుధంతో నరికినట్లు ఉంది. బలమైన ఆయుధంతో కొట్టడం వల్లే పుర్రెలో ఎముకలు కూడా పగిలాయి" అని ఫోరెన్సిక్ విభాగం వైద్యులు స్పష్టం చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.
ఈ ఘటనపై మడకశిర టిడిపి ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యుడు ఎంఎస్ రాజు స్పందించారు.
"కుమ్మరి (బీసీ) సామాజిక వర్గానికి చెందిన మాజీ ఏవీఎస్ఓ వై.సతీష్ కుమార్ మృతిపై వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని విచారణ చేయాలి" అని డిమాండ్ చేశారు.
"మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులను వైసీపీ నాయకులు ఇదే తరహాలో హత్య చేయించారు. సతీష్ కుమార్ మరణం వెనక కూడా ఇలాగే జరిగి ఉంటుంది " అని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సందేహం వ్యక్తం చేశారు.
పేద కుటుంబం నుంచి వచ్చి...
కర్నూలు జిల్లా పత్తికొండ కుమ్మర వీధికి చెందిన వై సతీష్ కుమార్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సతీష్ కుమార్ తండ్రి బ్రహ్మయ్య ఓ హాస్టల్ లో వంట పని చేసేవారు. తల్లి చిదాంబరమ్మ గృహిణి. బ్రహ్మయ్య, చిదాంబరమ్మ దంపతులకు నలుగురు పిల్లలు అయితే వారిలో రెండో వ్యక్తి సతీష్ కుమార్. 2009లో సతీష్ కుమార్ ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత పట్టు వదలకుండా ప్రయత్నించిన ఆయన 2011లో ఏ ఆర్ (armed reserve police) అనంతపురం జిల్లా విభాగంలో ఎస్సైగా ఉద్యోగం సాధించారు. కర్నూలుకు చెందిన మమతతో ఆయనకు వివాహం అయింది.
టిటిడి విజిలెన్స్ లోకి..
అనంతపురం జిల్లా ఏఆర్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న సతీష్ కుమార్ 2012 బ్యాచ్ ఎస్ఐ. ఆయన 2017 జూలై 27వ తేదీన టీటీడీ విజిలెన్స్ విభాగానికి ఇన్స్పెక్టర్గా వచ్చారు. మొదట తిరుమల శ్రీవారి ఆలయం, ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వి ఐ. (Vigilance inspector) ఎస్సై స్థాయి అధికారికి ఇచ్చే హోదా టిటిడి విజిలెన్స్ విభాగంలో అది. ఆ తర్వాత ఆయన మాతృ సంస్థ ఏఆర్ విభాగానికి బదిలీ అయ్యారు. సతీష్ కుమార్ కు సిఐ గా పదోన్నతి లభించింది.
అనంతపురం జిల్లా ఏఆర్ విభాగంలో ఎస్సైగా ఉన్న సతీష్ కుమార్ తిరుమలలో పనిచేసినప్పుడు ఆయన నిబద్ధత, అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ మంచితనమే సతీష్ కుమార్ కు తిరుమల లో మళ్లీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో పనిచేసే అవకాశం దక్కింది. ఎస్సైగా బదిలీ అయిన ఆయన తిరిగి సిఐ హోదాలో టీటీడీ ఏవీఎస్ఓగా (TTD assistant vigilance and security wing) హోదాలో మళ్లీ అవకాశం దక్కింది. దీంతో సతీష్ కుమార్ 2022 సెప్టెంబర్ 27 తేదీ శ్రీవారి ఆలయం లో హుండీ లెక్కింపు చేసే పరకామణి ఏ బి ఎస్ ఓ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత తిరుమల సెక్టార్ 3, లగేజీ ఏవీఎస్ఓ హోదాలోనే పనిచేసిన ఆయన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం ఏవీఎస్ లోగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండగానే ఈ సంవత్సరం జూన్ 4వ తేదీ ఆయన మాతృ శాఖకు బది అయ్యారు.
కేసు.. చార్జిషీట్..
ఆయన తిరుమల విజిలెన్స్ విభాగంలోకి మధ్య కాలంలోనే అంటే 2023 ఏప్రిల్ 29వ తేదీ తిరుమల పరకామణిలో పెద్ద జీయర్ మఠం ఏకాంగి (superintendent) ఏవి రవికుమార్ అమెరికన్ డాలర్లు చోరీ చేస్తుండగా సిబ్బంది గమనించి ఏవీఎస్ ఓ సతీష్ కుమార్ కు సమాచారం ఇచ్చారు. కామని గదిలోనే ప్రత్యేకంగా ఉన్న క్లోజ్డ్ రూమ్ లోకి తీసుకువెళ్లి రవికుమార్ ను తనిఖీ చేయగా ఆయన ధరించిన పంచే లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఒక జేబులో నోట్లు బయటపడ్డాయి. దీంతో తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఆనాటి సీఐ జగన్మోహన్ రెడ్డి చార్జిషీట్ కూడా ఫైల్ చేశారు. 2023 సెప్టెంబర్ 9వ తేదీ పరకామణి చోరీ కేసులో రాజీ కావడం అనేది రాజకీయంగా వివాదానికి దారితీసింది. తిరుమల కేంద్రంగా ఓ పత్రిక నిర్వహించే జర్నలిస్టు మాచర్ల శ్రీనివాసులు హైకోర్టులో కేసు దాఖలు చేయడంతో పరకామణి చోరీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.
సాక్షుల్లో కలవరం..
ఈ కేసుపై విచారణ చేసిన హైకోర్టు మందలించడంతో పరకామణి చోరీ కేసు తెరపైకి వచ్చింది. ఏపీ సిఐడి రవిశంకర్ అయ్యన్నార్ సారధ్యంలోని బృందం విచారణ వేగవంతం చేసింది. ఈనెల ఆరో తేదీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. శుక్రవారం జరిగిన విచారణ కోసం బయలుదేరిన మాజీ ఏవీఎస్లో సతీష్ కుమార్ రైల్వే పట్టాలకు దూరంగా శవమై పడి ఉండడం సంచలనం రేకెత్తించింది. పరకామణి చోరీ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న నిందితులతో పాటు అధికారులు కూడా కలవరం చెందుతున్నారు.
సతీష్ మృతదేహానికి పోస్టుమార్టం
మాజీ ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ అనుమానాస్పద మరణం సమాచారం తెలిసిన వెంటనే ఏపీ సిఐడి డిజి రవిశంకర్ అయ్యనార్ అనంతపురం జిల్లాకు బయలుదేరి వెళ్లారు. కోమలి రైల్వే స్టేషన్ కు దూరంలో సంఘటన ప్రదేశాన్ని ఆయనతోపాటు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్, డి ఐ జి షిమోషి వాజ్పాయ్, జి ఆర్ పి పోలీస్ అధికారులు కూడా సందర్శించారు.
డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా మరణించిన సతీష్ కుమార్ మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. యువ పోలీస్ అధికారి సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించడాన్ని పోలీసు అధికారులు కూడా ఛాలెంజ్గా తీసుకొని నిందితుల ను గుర్తించడానికి వీలుగా దర్యాప్తు వేగవంతం చేశారు. పది పోలీసు బృందాలను వివిధ కోణాల్లో దర్యాప్తు కోసం రంగం లోకి దించారు.
సతీష్ కుమార్ మరణంతో ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా పత్తికొండలో విషాదం అలుముకుంది.
"నా కొడుకును పొట్టన పెట్టుకున్నారు ఇది కచ్చితంగా హత్య. ఆత్మహత్య చేసుకునే అంత పిరికితనం నా కొడుకుకు లేదు" అని సతీష్ కుమార్ తల్లి చిదాంబరమ్మ కన్నీరు మున్నీరయ్యారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం పరకామణిలో జరిగిన చోరీకి సంబంధించి కేసు పెట్టాడని కోపంతోనే చంపివేశారు అంటూ ఆమె రోదించారు.
మృతదేహానికి స్కానింగ్?
అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సతీష్ కుమార్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించే ప్రక్రియను ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎస్పీ జగదీష్ స్వయంగా పరిశీలించారు.
పరకామణి చోరీ కేసుకు సంబంధించి నిందాలోపనలు ఎదుర్కొంటున్నది వైసీపీ నాయకులు. దీనిపై ఎన్డీఏ కూటమిలోని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, టిటిడి పాలకమండలి సభ్యుడు జి భాను ప్రకాష్ రెడ్డి ఆధారాలతో సహా బయట పెట్టారు. దీంతో అధికార టిడిపి కూటమి ప్రభుత్వం ఈ కేసును నిగ్గు తేల్చే క్రమంలో పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా..
సతీష్ కుమార్ మృతదేహానికి అనంతపురం సర్వజన ఆస్పత్రిలో జరిగిన శివ పరీక్షను పోలీసు అధికారులతో పాటు ఫోరెన్సి నిపుణులు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు.
"సతీష్ కుమార్ మృతదేహాన్ని సిటీ స్కాన్" చేసినట్లు కూడా తెలుస్తోంది. ఆయన మరణం వెనక ఉన్న కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తి కావడం, తిరుమల పరకామణి చోరీ కేసు సంచలనం సృష్టించింది కావడంతో పోలీసు అధికారులు కూడా మరింత అప్రమత్తంగా దర్యాప్తు చేసి, ప్రతి అంశాన్ని సునిసితంగా వెలుగులోకి తీసుకురావడానికి అవసరమైన జాగ్రత్తలని తీసుకుంటున్నారు.
సతీష్ కుమార్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతపురం ఫ్యూరెన్స్ విభాగం వైద్యులు అనేక విషయాలను గుర్తించారని విశ్వసనీయంగా తెలిసింది.
"సతీష్ కుమార్ తల వెనుక బలమైన ఆయుధంతో కొట్టినట్లు ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారని తెలిసింది" అంతేకాకుండా సతీష్ శరీరంలో పలుచోట్ల ఎముకలు కూడా విరిగాయని శవపరీక్షలో గుర్తించడం ద్వారా ఆ వివరాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
"శుక్రవారం వేకువ జామున రెండు నుంచి నాలుగు గంటల మధ్య సతీష్ మృతి చెందారు" అని ఫోరెన్సిక్ వైద్యులు తమ ప్రాథమిక పరీక్షలో నిర్ధారించినట్లు తెలుస్తోంది.
ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు
తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి మీడియా కథనాలను పరిశీలిస్తే, రాజకీయ నాయకుల పరస్పర ఆరోపణలను విశ్లేషిస్తే దీని వెనక రాజకీయంగా ఏదో జరిగిందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో పరకామణి చోరీకి సంబంధించి ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ సందేహాస్పదంగా మరణించిన ఘటన ను పోలీసు అధికారులు సీరియస్గా తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ ఘటన జరిగిన ప్రదేశంలో మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ తమ్ముడు హరి మాట్లాడుతూ.. రైలు నుంచి కిందికి పడిపోతే 200 మీటర్ల దూరంలో మృతదేహం ఎందుకు పడుతుంది అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
"సంఘటన ప్రదేశాన్ని పరిశీలిస్తే మా అన్న సతీష్ కుమార్ ను హత్య చేసినట్లుగానే ఉంది. పరకామణి కేసులో విచారణకు బయలుదేరిన సమయంలోనే ఇది జరగడం మాకు సందేహాలు ఉన్నాయి" అని హరి సందేహం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ జరిగిన ఘటనపై వీడియో పుటేజి ఉంది. ఇందులో చోరీకి ప్రయత్నించిన జీయర్ మఠం ఏకాంగిగా పని చేసిన పీవీ రవికుమార్ పట్టుబడడం, కేసు నమోదు కావడం, ఆ తర్వాత కోర్టు రాజీకి సంబంధించిన రికార్డులన్నీ స్పష్టంగా ఈ కేసు వివరాలను తెలియజేస్తున్నాయి. ఇందులో తెర వెనక ఉన్న నాయకులు ఎవరైతే నీకు తీర్చాలని విషయంలో దర్యాప్తు జోరందుకున్న సందర్భంలో సతీష్ కుమార్ అసహజ మరణం అనేక ఆరోపణలకు తెరతీసింది. ఈ ఘటన రాజకీయంగా కూడా ప్రకంపనలకు అవకాశం కల్పించింది.
మిగతా అధికారుల విచారణ
ఈ కేసులో ఫిర్యాదుగా ఉన్నాయి మాజీ ఏవీఎస్ ఓ సతీష్ కుమార్ తో పాటు మిగతా అధికారులను శుక్రవారం అంటే ఈనెల 14వ తేదీ ఏపీ సిఐడి బృందం విచారణకు పిలిచింది. సతీష్ కుమార్ రైల్లో వస్తూ మరణించిన ఘటన ఒకపక్క సంచలనం రేకెత్తిస్తే ఇదే కేసులో తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో సిఐడి విచారణకు టిటిడి జేఈఓ వీరబ్రహ్మం, టిటిడి ఆర్థిక సలహాదారు ముఖ్య గణాంక అధికారి బాలాజీ, పరకాల చోరే జరిగినప్పుడు తిరుమల వీజీవో గా ఉన్న బాలిరెడ్డి, తిరుమల టూ టౌన్ సిఐ గా పని చేసిన చంద్రశేఖర్ తో పాటు ఐదుగురు పరకామణి సిబ్బందిని పెద్ద జీయర్ మటన్ ప్రతినిధుల్లో ముగ్గురు అర్చకులను అంటే మొత్తం 12 మందిని విచారణ చేశారు.
పరకామణి చోరీకి సంబంధించి ఏపీ సి ఐ డి మొత్తం 12 మందికి పైగానే అధికారులు సిబ్బందిని విచారణకు అర్హమైన వ్యక్తులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏవీఎస్ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి ఘటన నేపథ్యంలో మిగతా వారికి భద్రత కల్పించాలని టిడిపి కూటమిలోని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా ఆ మేరకు విజ్ఞప్తి చేశారు. పరకామణి నేరానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుండగానే ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణించడం అనేది మరో నేరానికి దారితీసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు తర్వాత ఎన్ని మలుపు తిరుగుతుంది అనేది పోలీసులు తెరపై తీసుకువచ్చే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
Next Story

