PCC - TDP | బాబూ.. నిరుద్యోగ భృతి ఏమైంది..?
x

PCC - TDP | బాబూ.. నిరుద్యోగ భృతి ఏమైంది..?

సూపర్-6ను ఆరు శాసనాలు చేశారు. ఆడబిడ్డ నిధి ఏమైందని పీసీసీ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు.


పిల్లిని మార్జాలం. కుక్కను శునకం అన్నట్లుగా సూపర్-6ను ఆరు శాసనాలుగా పేరు మార్చారని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్. తులసిరెడ్డి విమర్శించారు. కడప టీడీపీ మహానాడు ఈ తీర్మానాల్లో కొత్తదనం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.

కడపలో నిర్వహించిన మహానాడులో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందని తులసిరెడ్డి ఆరోపించారు. కడప జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి సత్తార్, జిల్లా ఉపాధ్యక్షులు సిరాజుద్ధీన్, ప్రసాద్ గౌడ్, జిల్లా కార్యదర్శి భువన ఏకాదశ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షురాలు శ్యామలమ్మతో కలిసి తులసిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

టీడీపీ ప్లీనరీలో అందిన విరాళాలను ప్రస్తావించకుండా, "టిడిపి పేదల పార్టీ కాదు,కోటీశ్వరుల పార్టీ" అని తెలిసి పోయిందని పీసీపీ నేత తులసిరెడ్డి అభివర్ణించారు. "ఎన్టీఆర్ కాలంలో నిర్వహించిన మహానాడుకు, కడప సభలతో పోలుస్తూ, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది" అని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.
భృతి ఏదీ..?
కార్యకర్తే అది నేత అని మొదటి శాసనం. మహానాడు జరుగుతుండగానే.. కార్యకర్తలను పట్టించుకోలేదని నిరసిస్తూ, కడప ఎన్టీఆర్ సర్కిల్ లో దళిత మహిళ చిప్పగిరి మీనాక్షి సెల్ టవర్ ఎక్కిందని తులసిరెడ్డి గుర్తు చేశారు.
రెండవ శాసనం యువగళం "నెలకు రూ 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు పైసా కూడా ఇవ్వలేదు" అని తులిసిరెడ్డి ఎద్దేవా చేశారు.
సామాజిక న్యాయం.బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ హామీ ఇచ్చినా అమలు చేయలేదు.
స్త్రీశక్తి లో 19- 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు ఆడ బిడ్డ నిధి క్రింద ప్రతి నెలా రు 1500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వ లేదు.
అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు. తెలుగు జాతి - విశ్వ ఖ్యాతి అని పేరు పెట్టారు. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేశాక విశ్వఖ్యాతి దేవుడెరుగు రాష్ట్రం లోనే తెలుగుభాష, తెలుగు జాతి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని తులసిరెడ్డి ఆందోళన వ్యక్త చేశారు. సీఎం ఎన్. చంద్రబాబు కొడుకు, మంత్రి నారా లేకేష్ ప్రవేశపెట్టిన ఆరు శాసనాలు రాబోయే రోజుల్లో టిడిపికి మరణ శాసనాలు కావడం తధ్యం అని తులసిరెడ్డి జోస్యం చెప్పారు.
Read More
Next Story