
అనంతపురంలో కూటమి సభ. సభాస్థలికి చేరిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అనంతపురం: 'సూపర్' సభలోకి పవన్ ఎంట్రీ...
కిటకిటలాడుతున్న సూపర్ 6 సభ.
టిడిపి కూటమి సూపర్ - 6 సూపర్ సక్సెస్ విజయోత్సవ సభతో అనంతపురం కిటకిటలాడుతోంది. రాయలసీమతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో పాటు ఆ పార్టీల శ్రేణులు కూడా భారీగా చేరుకున్నాయి.
అనంతపురం శివారులో టిడిపి కూటమి సూపర్ 6. సూపర్ హిట్ పేరిట నిర్వహిస్తున్న విజయోత్సవ సభను సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాష్ట్రంలోని ప్రధానంగా రాయలసీమ ప్రాంతం నుంచి టిడిపి, బిజెపి, జనసేన నాయకులు బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యాతగా ఆహ్వానించారు.
మధ్యాహ్నం రెండు గంటల కు జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేదిక వద్దకు చేరుకున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి పుట్టపర్తి వద్ద ఉన్న శ్రీ సత్య సాయి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జిల్లా ఎస్పీ వి రత్న, పుట్టపర్తి శ్రీ సత్య సాయి ట్రస్ట్ ప్రతినిధి ఆర్జే రత్నాకర్, అధికారులు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు.
పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ కు స్వాగతం పలుకుతున్న ట్రస్టు సభ్యులు
అదే సమయానికి హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి సీఎం నారా చంద్రబాబు కూడా బహిరంగ సభకు సమీపంలోని హెలిపాడ్ లో ల్యాండ్ అయ్యారు.
కిక్కిరిసిన మైదానం
విజయోత్సవ సభకు ఏర్పాటు చేసిన వేదిక ముందు 500 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రాంగణం మొత్తం మూడు పార్టీల సేన్లతో నిండిపోయింది.
టిడిపి కూటమి విజయోత్సవ సభకు హాజరైన మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులతో బహిరంగ కిక్కిరిసింది.. ఎకరాల్లో తొక్కేసలాటకు ఏమాత్రం ఆస్కారం లేకుండా కంపార్ట్మెంట్ల వారీగా విభజించి ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేశారు. అత్యసర సేవల కోసం వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు.
పటిష్ట భద్రత
బహిరంగ సభపై నిఘా
అనంతపురం పట్టణంతో పాటు బహిరంగ జరిగే ప్రదేశంలో కూడా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నగరం మొత్తం దాదాపు 500 పైగానే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఎస్పీ జగదీశ్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో దాదాపు 40 డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.
ఇక్కడి ప్రతి అణువునూ జల్లెడ పట్టే విధంగా కమాండ్ కంట్రోెల్ రూంలో సిబ్బందిని అప్రమత్తంగా ఉంచారు. సీనియర్ పోలీసు అధికారులు ఇక్కడ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు
Next Story