
తిరుపతికి సమీపంలోని మామండూరు అడవిలోని జలపాతం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
మామండూరు అడవిలో ఆహ్లాదంగా..సేదదీరిన పవన్ కల్యాణ్
తిరుపతి శేషాచలం అడవిలో కమాండోగా ఎలా మారారంటే....
డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ( pawan kalyan ) కమాండోలా మారారు. తిరుపతికి సమీపంలోని మామండూరు సమీపంలోని అతిథి గృహాల సముదాయాన్ని పరిశీలించారు. ఎకో టూరిజం అభివృద్ధిని పరిశీలించారు. ఆ ప్రదేశంలో మొక్కలు నాటారు. ఒక రోజు పర్యటన కోసం ఆయన శనివారం తిరుపతికి చేరుకున్నారు. శేషాచలం ప్రకృతి రమణీయతను డిప్యూటీ సీఎం, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆస్వాదించారు.
తిరుపతి విమానాశ్రయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్. వి. వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన పార్టీ శ్రేణులు నాయకులు ఘనంగా స్వాగతించారు.
కమాండో గెటప్ లో..
నా స్లైలే వేరు అన్నట్టు డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఓ కమాండోగా కనిపించారు. పోలీస్ కటింగ్, నేవీ బ్లూ టీ షర్ట్, ఖాకీ ప్యాంటు, జంగిల్ షూ ధరించారు. ఈ గెటప్ లోనే ఆయన మామండూరు అటవీప్రాంతంలో దాదాపు రెండు గంటలకు పైగానే గడిపారు.
తిరుపతికి సమీపంలోని మామ్డూరు అటవీ ప్రాంతంలోకి కమాండో తరహా గెటప్ లో పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. 105 సంవత్సరాల నాటి అతిథి గృహాన్ని సందర్శించడంతోపాటు ఆ ప్రదేశంలో మొక్కలు కూడా నాటారు. మామండూరు అతిథి గృహం ప్రత్యేకతను తెలుసుకున్నారు. ఈ భవన నిర్మాణం వెనుక ఉన్న ప్రత్యేకత తోపాటు ఇక్కడి విడిది చేసిన కెన్నెత్ ఆండర్సన్ రాసిన పుస్తకం చదువూతూ కాసేపు సమాచారం తెలుసుకున్నారు.
అటవీ శాఖ అధికారుల తరహాలోని పవన్ కళ్యాణ్ కూడా కమాండోగా కనిపించారు. పోలీస్ గెటప్ లోకి మారిన ఆయన జుట్టు కత్తిరించారు. నేవీ కలర్ టి షర్ట్, కాకి ప్యాంట్ కాళ్లకు జంగిల్ షూ ధరించిన పవన్ కల్యాణ్ అటవీసప్రాంతంలో పర్యటించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, తిరుపతి డీఎఫ్ఓ సాయిబాబా తో కలిసి మామండూరు అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. అంతకుముందు మామండూరు అతిథి గృహం వద్ద ఆయన మొక్కలు నాటారు.
ప్రకృతి ఒడిలో...
మామండరుకు సమీపంలోని అటవీ అతిథి గృహంతో పాటు, షికారిలైను, బావి కాడి లైన్ ప్రదేశం నుంచి అటవీ ప్రాంతం లోకి ప్రవేశించారు. తిరుమల శేషాచలం కొండలపై నుంచి వచ్చే జలపాతం వద్ద సేదదీరారు. ప్రకృతి రమణీయతను ఆస్వాదించారు. గుంటిమడుగు జలపాతం ఒడ్డున కూర్నుని సందడం చేశారు. నీటిలో నడుస్తూ ఆహ్లాదంగా గడిపారు. ఆ నది ఒడ్డున తిరుపతి డిఎఫ్ఓ సాయిబాబాతో కలిసి కూర్చొని ముచ్చట్లు చెబుతూ వివరాలు తెలుసుకున్నారు.
చెట్టును తడిమి..
అడవిలో నాలుగు కిలోమీటర్ల పైగా ప్రయాణం సాగించిన ఆయన రెండు కిలోమీటర్ల పరిధిలో అటవీ ప్రాంతంలోని ప్రతి చెట్టును తడిమారు.. కాలినడకనబెడుతూ అధికారులతో కలిసి ప్రతి చెట్టు వద్దకు వెళ్లి దాని ప్రత్యేకత ఎర్రచందనం చెట్లు, అంకుడు, తెల్ల మద్ది వంటి అరుదైన మొక్కలను గురించి తెలుసుకున్నారు. పొదరిల్లుల అల్లుకున్న వెదురు జనాలను చూసి వాటి ప్రత్యేకతను అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు.
మామండూరు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడానికి ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్ని నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని బైనాక్యులర్స్ ద్వారా పరిశీలించారు. కమాండో డ్రస్సులో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట ఉన్న తిరుపతి జిల్లా ఎస్పీ, ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక విభాగం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కూడా బాధితులు నిర్వహిస్తున్న ఎల్ సుబ్బారాయుడు అటవీ ప్రాంతాన్ని, అందులో ఉన్న ప్రత్యేకతలను వివరించారు.
శేషాచలం అటవీ ప్రాంత సరిహద్దులతో పాటు స్వర్ణముఖి నది ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది? ఈ ప్రదేశంలో ఉన్న సహజ వనరులు ప్రధానంగా అడవులకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు.
గుంటిమడుగులో సరదాగా..
సమీపంలోని అటవీ ప్రాంతంలో అనేక వాగులు ప్రవహిస్తూ ఉంటాయి. అందులో గుంటిమడుగు వాగు వద్ద ఒడ్డున కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెలయేర్ల సవ్వడి నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తూ పరవశించారు. ఈ వాగుకు ఒడ్డున గున్న అరుదైన చెట్లు, మొక్కలకు సంబంధించిన వివరాలను తిరుపతి డిఎఫ్ సాయిబాబా నుంచి అడిగి తెలుసుకున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన వృక్ష సంపదను కాపాడడానికి ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకుంటున్న చర్లపై డిఎఫ్ సాయిబాబా, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు నుంచి వివరాలు తెలుసుకున్నారు.
సుమారు రెండు గంటలకు పైగానే మామండూరు అటవీ ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ తన శాఖ హోదాకు తగినట్లు కమాండో డ్రస్సులో అనేక ప్రదేశాలను తిరుగుతూ ఆహ్లాదంగా గడిపారు.
Next Story

